Intinti Gruhalakshmi June 20th Episode: తండ్రి చెంతకు చేరిన అభి.. ఆమెకు అసలు నిజం చెప్పేసిన అంకిత
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభి అడగగానే ఇంటికి రావడానికి అంకిత ఒప్పుకుంటుంది. అయితే, దీని వెనుక తల్లితో కలిసి ఆమె భారీ కుట్రను ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత అభి, అంకిత తమ ఇంటికి వచ్చేస్తారు. ఆ సమయంలో అంకిత.. తులసి ఇంట్లోని అందరికీ సారీ చెప్పి నటిస్తుంది. ఆ తర్వాత శృతి దగ్గర మాత్రం తన ప్లాన్ మొత్తం బయట పెట్టి ఆమెను విపరీతంగా భయ పెట్టేస్తుంది.

అభిపై నందూను రెచ్చగొట్టిన లాస్య
శృతికి అంకిత వార్నింగ్ ఇస్తున్న సీన్‌తో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న నందూను కొడుకుపై రెచ్చగొడుతుంది లాస్య. 'అభి తన భార్యతో కలిసి వచ్చాడు. కనీసం నీకు ఒక్క మాటైనా చెప్పాడా? నేరుగా తల్లి దగ్గరకు వెళ్లిపోయాడు. నువ్వేమో నా కొడుకు నా కొడుకు అని వెళ్లి అవమానం పాలయ్యావు. అభి నిన్ను పట్టించుకోట్లేదు' అని అతడిలో కోపం రగిల్చింది.

నందూకు సరిగ్గా బదులిచ్చిన అభి
లాస్య అన్న మాటలకు కోపంతో రగిలిపోయిన నందూ వెంటనే తన కొడుకు అభికి ఫోన్ చేసి ప్రశ్నిస్తాడు. దీనికి అభి 'మీరు మామ్‌ను వద్దనుకున్నారు కదా.. మమ్మల్ని కూడా దూరం పెడతారేమో అనుకున్నాను. అందుకే చెప్పలేదు' అంటాడు. అప్పుడు నందూ 'నాకు తులసి తప్ప అందరూ కావాలి' అంటాడు. దీనికి అభి 'మామ్ మాత్రం అందరితో పాటు మీరూ కావాలంటుంది' అని చెప్తాడు.

ఎటైనా వెళ్లిపోతానని చెప్పిన శృతి
అంకిత ఇచ్చిన వార్నింగ్‌తో ఆలోచనలో పడిపోతుంది శృతి. అప్పుడు ఆమె దగ్గరకు వచ్చిన తులసి 'ఏంటమ్మా ఇంకా పడుకోలేదేంటి' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు శృతి 'అప్పుడు నా వల్లే అభి అంకిత ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని భయంగా ఉంది. అందుకే నేను ఏటైనా వెళ్లిపోతా ఆంటీ' అని అంటుంది. కానీ, దీనికి తులసి మాత్రం ఒప్పుకోదు.

తండ్రిని కలిసేందుకు వెళ్లిన కొడుకు
నందూ ఫోన్ చేసిన తర్వాత ఇద్దరం వెళ్లి ఓ సారి అంకుల్‌ను కలిసొద్దాం అని అంకిత అభిని ఒప్పిస్తుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ బయలుదేరగా ఇంట్లో వాళ్లంతా ఆపుతారు. అప్పుడు అంకిత వాళ్లకు కూడా నచ్చజెపుతుంది. ఆమెకు అనసూయ కూడా మద్దతు తెలుపుతుంది. కాసేపు చర్చలు జరిగిన తర్వాత తులసి వాళ్లిద్దరూ వెళ్లడానికి పర్మీషన్ ఇస్తుంది. దీంతో ఈ జంట అక్కడికెళ్తుంది.

తన ప్లాన్ లాస్యకు చెప్పిన అంకిత
నందూ ఇంటికి వెళ్లగానే అభి, అంకితను చూసినా పట్టించుకోడు. పైగా కోపంతో అలిగి వెళ్లిపోమంటాడు. అప్పుడు ఇద్దరూ కలిసి సారీ చెప్పినా.. లాస్య వచ్చి చెప్పే వరకూ ఒప్పుకోడు. ఆ తర్వాత తండ్రీ కొడుకులు హగ్ చేసుకుని నవ్వుకుంటారు. ఇల్లు చూపిస్తానని అంకితను తీసుకెళ్లిన లాస్య.. ఏ ప్లాన్ వేశావని అడుగుతుంది. దీంతో కంగారు పడిన ఆమె.. ఆ తర్వాత మొత్తం చెప్తుంది.
Recommended Video

ఆ ప్లాన్‌తో ఒక్కటైన లాస్య.. అంకిత
మొదట తన ప్లాన్ చెప్పడానికి అంకిత ఇష్టపడదు. దీంతో లాస్య 'నేను మీ మామ్‌తో మాట్లాడా. ఆమె నాకన్నీ చెప్పింది. కానీ నీ ప్లాన్‌ను నీ నోటి వెంట వినాలని ఉంది' అనగానే.. అభిని ఇక్కడి నుంచి శాశ్వతంగా తీసుకెళ్లిపోడానికి వచ్చాను అని నిజం చెబుతుంది. దీంతో లాస్య కూడా ఆమెతో చేతులు కలుపుతుంది. అంతేకాదు, ఏ సాయం కావాలన్నా చేస్తానని అభయం ఇస్తుంది.


Click it and Unblock the Notifications











