For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 23rd Episode: అంకితను దెబ్బకొట్టిన దివ్య.. షాకిచ్చిన అభి.. ఇంట్లో వేడుక

  |

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి కుటుంబాన్ని ముక్కులు చేయడానికి లక్ష రూపాయలు కావాలని అంకిత తన తల్లిని అడుగుతుంది. ఆ తర్వాత తులసికి అంకిత ఓ స్కూటీ కొనుక్కిచ్చి గిఫ్టుగా ఇవ్వాలని చూస్తుంది. కానీ, నీ సొంత డబ్బుతో కొనని ఆ బహుమతిని తీసుకోనని ఆమె వివరిస్తుంది. అనంతరం లాస్య.. నందూతో కొత్త కారు కొందామని చెప్పి ఒప్పిస్తుంది.

  తులసి పనిని అభినందించిన క్లోజ్ ఫ్రెండ్

  తులసి పనిని అభినందించిన క్లోజ్ ఫ్రెండ్

  అంకిత తెచ్చిన స్కూటీని తీసుకోకూడదని నిర్ణయించుకున్న తులసితో అంజలి మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఆమె మంచి నిర్ణయం తీసుకుందని అంజలి అభినందిస్తుంది. అంతేకాదు, ఇలాగే ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లాలని ఆశించింది. ఇక, ఎప్పటిలాగే తులసిని పైకి లేపుతూ చాలా సేపు ప్రశంసల వర్షం కురిపించింది.

   ఇంట్లో నుంచి వెళ్లిపోతానని చెప్పిన శృతి

  ఇంట్లో నుంచి వెళ్లిపోతానని చెప్పిన శృతి

  ఒంటరిగా ఉన్న అంకిత దగ్గరకు శృతి వస్తుంది. అప్పుడు ‘అంకిత ఈ ఇంట్లో నీకు శత్రువును నేనే కదా' అంటుంది. దానికామె ‘ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా' అంటుంది. అప్పుడు శృతి ‘నువ్వు ఇంట్లో వాళ్లందరితో మంచిగా ఉండు. కావాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతా. ఎవరెవరో మాటలు విని లైఫ్‌ను నాశనం చేసుకోకు' అని చెబుతుంది. దీనికి అంకిత ఆమెపై కోప్పడుతుంది.

  అంకితకు మరోసారి బిగ్ షాకిచ్చిన అభి

  అంకితకు మరోసారి బిగ్ షాకిచ్చిన అభి

  అంకిత రూమ్‌లో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది. అప్పుడు అభి ‘ఏంటి అంకిత ఎవరితో మాట్లాడుతున్నావ్' అనగా.. ‘ఇంకెవరితో మా అమ్మతో. నువ్వు సరిగా జాబ్ చేయడంలేదని సీనియర్ డాక్టర్లు చెప్పారంట' అంటుంది. అప్పుడు అభి ‘నీకో విషయం చెబుతున్నా విను. నేను ఆ జాబ్ మానేశా. హైయ్యర్ స్టడీస్ కోసం మనమెక్కడికీ వెళ్లట్లేదు. ఇండియాలోనే చేద్దాం' అని షాకిచ్చాడు.

   తిరిగొచ్చిన ప్రేమ్.. దివ్య కోసం గిఫ్ట్ కూడా

  తిరిగొచ్చిన ప్రేమ్.. దివ్య కోసం గిఫ్ట్ కూడా

  అంకిత అన్న మాటలు గుర్తు చేసుకుని బాధ పడుతోన్న శృతి.. ఆ తర్వాత ప్రేమ్‌కు ఫోన్ చేస్తుంది. అప్పుడతను మార్నింగ్ కల్లా ఇంటికొచ్చేస్తా అంటాడు. అన్నట్లుగానే ఉదయాన్నే దిగిపోతాడు ప్రేమ్. కొడుకు రాగానే సంతోషంతో తులసి ముఖం వెలిగిపోతుంది. ఆ తర్వాత దివ్య నాకోసం ఏం తెచ్చావ్ అని అడుగుతుంది. దీంతో బ్యాగ్‌లో నుంచి ట్యాబ్ తీసి ఆమెకు గిప్టుగా ఇస్తాడు.

  అంకిత కన్నింగ్ ప్లాన్‌ను దెబ్బకొట్టిన దివ్య

  అంకిత కన్నింగ్ ప్లాన్‌ను దెబ్బకొట్టిన దివ్య

  దివ్యను తన వైపునకు తిప్పుకోవాలన్న ఉద్దేశ్యంతో తల్లితో మాట్లాడి లాప్‌టాప్ తెప్పిస్తుంది అంకిత. ప్రేమ్ ట్యాబ్ తెచ్చిన సమయంలోనే ఆమె లాప్‌టాప్ పట్టుకుని అక్కడకు వెళ్తుంది. ట్యాబ్‌లో ఆన్‌లైన్ క్లాసులు కష్టం అని అటుండగా దివ్యకు లాప్ ఇవ్వాలని చూస్తుంది. కానీ, ఆమె మాత్రం అది వద్దంటుంది. అంతేకాదు, అన్న తెచ్చిన గిఫ్టునే తీసుకుంటానని చెప్పి అంకితకు షాకిస్తుంది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
   తులసి ఇంట్లో శుభకార్యానికి వాళ్ల ప్లాన్లు

  తులసి ఇంట్లో శుభకార్యానికి వాళ్ల ప్లాన్లు

  వీళ్ల మధ్య చర్చలు జరుగుతుండగా నందూ తండ్రి అక్కడకు వచ్చి ప్రేమ్‌ను బాధ్యతగా మెలుగుతున్నావని అభినందిస్తాడు. అప్పుడు అనసూయ అక్కడకు వచ్చి ఎప్పటిలాగే పాత సామెతతో విమర్శిస్తుంది. దీంతో పెళ్లై యాభై ఏళ్లు అయినా నీకు బుద్ది రాలేదే అని ఆమె భర్త అంటాడు. దీంతో అభి ‘తాతయ్య మీ పెళ్లై 50 ఏళ్లు అయ్యాయా? అయితే గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ చేస్తాం' అంటాడు.

  English summary
  Intinti Gruhalakshmi Episode 353: Shruthi Ready to go from Tulasi house for Ankita. Then Prem Came to Home After few Days. And Also Brings Tab to his Sister Divya. at the same time akinta bring Laptop to Divya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X