For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 24th Episode: కొంప ముంచిన ఫంక్షన్.. చస్తానని బెదిరించిన నందూ.. ఆమె కూడా!

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అంకిత కోసం శృతి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోడానికి సిద్ధం అవుతుంది. అప్పుడు ప్రేమ్ ఇంటికి తిరిగి వస్తాడు. అంతేకాదు, దివ్యకు ఓ ట్యాబ్‌ను కూడా గిప్టుగా తెస్తాడు. అదే సమయంలో అంకిత లాప్‌టాప్‌ను తీసుకొస్తుంది. కానీ, దివ్య దాన్ని తీసుకోడానికి ఇష్టపడదు. ఇక, తాతయ్యకు గోల్డెన్ జూబ్లీ చేయాలని అభి, ప్రేమ్ నిర్ణయించుకుంటారు.

  ప్రేమ్ సక్సెస్‌కు శృతే కారణమన్న తులసి

  ప్రేమ్ సక్సెస్‌కు శృతే కారణమన్న తులసి

  తాతయ్యకు 50వ పెళ్లిరోజు ఫంక్షన్ చేయాలని అభి, ప్రేమ్ అనుకోవడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. అప్పుడు వాళ్లంతా కలిసి గోల్డెన్ జూబ్లీని వేడుకగా జరిపించాలని అనుకుంటారు. దీని తర్వాత ప్రేమ్‌ను తల్లి అభినందిస్తుంది. దీంతో ‘నా సక్సెస్‌కు కారణం నువ్వేనమ్మా' అని అంటాడతను. కానీ, తులసి మాత్రం ఆ క్రెడిట్‌ను శృతికి ఇచ్చేసి.. ఆమెకు థ్యాంక్స్ చెప్పమని పంపుతుంది.

  లాస్యకు అదిరిపోయే సలహా ఇచ్చిన భాగ్య

  లాస్యకు అదిరిపోయే సలహా ఇచ్చిన భాగ్య

  తులసి ఇంట్లో ఫంక్షన్ జరపాలని చేస్తున్న ప్లాన్‌ను భాగ్య వచ్చి లాస్యకు వివరిస్తుంది. దీంతో ఆమె ఎప్పటి లాగే దీన్ని కూడా లైట్ తీసుకుంటుంది. అప్పుడు భాగ్య ‘వాళ్లు డబ్బు లేక చిన్నగా ఫంక్షన్ చేద్దామని అనుకుంటున్నారు. అదే నువ్వు బావగారితో కలిసి గ్రాండ్‌గా చేస్తే.. ఆ ఇంట్లో నీకు విలువ పెరుగుతుంది. అలాగే, తులసక్కకు చెడ్డపేరు వస్తుంది' అని సలహా ఇస్తుంది.

  నందూను రెచ్చగొట్టి ఇంటికి పంపిన లాస్య

  నందూను రెచ్చగొట్టి ఇంటికి పంపిన లాస్య

  గార్డెన్ ఏరియాలో కూర్చుని ఉన్న నందూ దగ్గరకు వచ్చిన లాస్య ‘నీకో విషయం తెలుసా? అంకుల్ వాళ్లు పెళ్లి చేసుకుని 50 ఇయర్స్ అయిందట. దీన్ని ఫంక్షన్‌లా చేయబోతున్నారట. వాళ్లెందుకు మనమే ఈ ఫంక్షన్ జరిపిద్దాం' అని అంటుంది. దీనిపై ఆలోచించిన నందూ ‘ఇలాంటి పరిస్థితుల్లో ఫంక్షనా. సరే చేద్దాం. అక్కడా ఇక్కడా కాకుండా రిసార్టులో చేద్దాం' అని అంటాడు.

  తులసి ఇంటికి వచ్చి నందూ.. తండ్రి ఇలా

  తులసి ఇంటికి వచ్చి నందూ.. తండ్రి ఇలా

  ఇక, ఓ రిసార్టులో తండ్రి పెళ్లిరోజును ఘనంగా జరపాలని నిర్ణయించుకున్న నందూ.. తులసి ఇంటికి వస్తాడు. అప్పుడు తన ఆలోచనను తండ్రితో చెబుతాడు. కానీ, ఆయన మాత్రం దీనికి ఒప్పుకోడు. ‘ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా. మమ్మల్ని కాదని వెళ్లిపోయావు. ఇప్పుడు ఫంక్షన్ ఎలా చేస్తావు? నీ చేతుల మీద జరిగితే అసలు ఇది జరపడానికి ఒప్పుకోను' అని అంటాడు.

  శాశ్వతంగా దూరం అవుతానన్న నందూ

  శాశ్వతంగా దూరం అవుతానన్న నందూ

  ఫంక్షన్ చేస్తానని ఎంత సర్ధి చెప్పినప్పటికీ తండ్రి మాత్రం నందూ మాటకు ఒప్పుకోడు. దీంతో అతడు ‘మీరు ఈ ఫంక్షన్‌కు ఒప్పుకోకపోతే మీకు శాశ్వతంగా దూరమైపోతాను. ఇకపై ఎప్పటికీ కనిపించను. మీ కొడుకు చచ్చిపోయాడనుకోండి' అంటూ వార్నింగ్ ఇస్తూ వెళ్లిపోతాడు. ఆ వెంటనే అనసూయ కూడా తన కొడుకు చెప్పినట్లు వినకపోతే చచ్చిపోతాను అని బెదిరిస్తుంది.

  యాక్టింగ్ చేస్తూ మళ్లీ రెచ్చగొట్టిన లాస్య

  యాక్టింగ్ చేస్తూ మళ్లీ రెచ్చగొట్టిన లాస్య

  తండ్రి చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఇంటికి తిరిగి వస్తాడు నందూ. అప్పుడు లాస్యకు అక్కడ జరిగిందంతా చెబుతాడు. దీంతో ఆమె తనలో తానే సంతోష పడుతుంది. ఆ తర్వాత ‘పెద్ద వాళ్లు కదా నందూ. అలాగే అంటారు. మళ్లీ ఒకసారి అడుగు. అప్పుడు కచ్చితంగా ఒప్పుకుంటారు' అంటూ రెచ్చగొడుతుంది. కానీ, నందూ మాత్రం ఈ సారి ఆమె మాట వినడానికి ఇష్టపడడు.

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  English summary
  Intinti Gruhalakshmi Episode 354: Nandhu Wants to do a Function for Her Father. But He Denied This. Then Nandhu Warned his Father and Family Members.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X