For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 25th Episode: అంకిత మాటలను వినేసిన తులసి.. ఆమె కోసం ఆ పని చేయాలని నిర్ణయం

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అత్తమామల పెళ్లిరోజును ఘనంగా జరపాలని తులసి నిర్ణయించుకుంటుంది. ఈ విషయాన్ని భాగ్య లాస్యకు చెబుతుంది. దీంతో ఆమె నందూను రెచ్చగొట్టి ఫంక్షన్ చేయాలని చెబుతుంది. అప్పుడు నందూ తన ఇంటికి వెళ్లి తండ్రితో ఈ విషయం చెప్పగా.. ఆయన వద్దంటాడు. దీంతో అతడు చనిపోతానని అందరి ముందే బెదిరించి వచ్చేస్తాడు.

  లాస్యతో విషయాలన్నీ చెప్పిన అంకిత

  లాస్యతో విషయాలన్నీ చెప్పిన అంకిత

  తులసి ఇంట్లో తండ్రితో జరిగిన గొడవను లాస్యకు వివరిస్తుంటాడు నందూ. ఆ సమయంలోనే ఫంక్షన్ చేయనని అంటాడు. అదే జరిగితే తన ప్లాన్ వర్కౌట్ కాదని ఆమె బాధ పడుతుంటుంది. సరిగ్గా అప్పుడే లాస్యకు అంకిత ఫోన్ చేస్తుంది. తమ ఇంట్లో జరిగిన గొడవ మొత్తాన్ని ఆమెకు పూస గుచ్చినట్లు వివరిస్తుంది. అనుకూలమైన విషయం జరగలేదని ఇద్దరూ బాధ పడుతుంటారు.

  కొడుకు కోసం అనసూయ ఉపవాసం

  కొడుకు కోసం అనసూయ ఉపవాసం

  తమ పెళ్లిరోజు నందూ సమక్ష్యంలోనే జరగాలని అనసూయ పట్టుబడుతుంది. అందుకోసం నిరాహార దీక్షను చేపడుతుంది. ఈ క్రమంలోనే ఏమీ తినలేదని టిఫిన్ పట్టుకుని వెళ్లిన తులసిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు, ఫంక్షన్ నందూకు ఇష్టమైనట్లు జరగకపోతే ఏమీ ముట్టుకోనని చెబుతుంది. ఆ సమయంలోనే కొడుకు కోసం ఎంతో బాధ పడుతున్నట్లు తులసికి వివరిస్తుంది.

  కోడలి మాటల్ని చాటుగా విన్న తులసి

  కోడలి మాటల్ని చాటుగా విన్న తులసి

  అనసూయ దగ్గర నుంచి వస్తున్న తులసికి అంకిత, అభి మాటలు వినిపిస్తాయి. ‘ఆంటీకి అంత పట్టుదల ఎందుకు అభి? అమ్మమ్మ వాళ్ల కోసం అంకుల్ మాట వినొచ్చు కదా. ఆంటీ వ్యవహరిస్తున్న తీరు నాకైతే నచ్చడం లేదు. అంత పంతం ఎందుకు' అంటూ అంకిత మాట్లాడుతుంది. అప్పుడు అభి ‘ఇందులో తప్పు ఎవరిదో చెప్పలేం. రెండు వైపులా న్యాయం ఉంది' అని చెప్పుకొస్తాడు.

  గొడవ గురించి ప్రేమ్.. శృతి మధ్య చర్చ

  గొడవ గురించి ప్రేమ్.. శృతి మధ్య చర్చ

  ఫంక్షన్ గురించి పక్క గదిలో ప్రేమ్, శృతి మధ్య కూడా అలాంటి డిస్కర్షన్ జరుగుతుంది. దీన్ని కూడా తులసి చాటుగా వింటుంది. ఇక, ఇందులో ప్రేమ్ మొత్తం తప్పును తన నానమ్మ మీద వేసేసి తల్లికి మద్దతుగా మాట్లాడతాడు. అమ్మను వద్దనుకుని వెళ్లిపోయిన తండ్రిని తిడతాడు. అదే సమయంలో తాతయ్య తీసుకున్న నిర్ణయానికి కూడా సపోర్టు చేస్తాడు. శృతి కూడా తలూపుతుంది.

  పడిపోయిన అనసూయ... వైద్యానికి నో

  పడిపోయిన అనసూయ... వైద్యానికి నో

  కొడుకు కోసం పంతం పట్టిన అనసూయ కళ్లు తిరిగి పడిపోతుంది. ఇది చూసిన శృతి ఎంత లేపినా ఆమె స్పృహలోకి రాదు. దీంతో పరుగు పరుగున వచ్చి తులసికి చెబుతుంది. దీంతో ఆమె వెంటనే డాక్టర్‌ను ఇంటికి పిలిపిస్తుంది. కానీ, అనసూయ మాత్రం వైద్యానికి నిరాకరిస్తుంది. అప్పుడు డాక్టర్ ‘ఆమెకు బీపీ తక్కువగా ఉంది. ఇదే కంటిన్యూ అయితే ప్రాణానికే ప్రమాదం' అంటుంది.

  తులసి సంచలన నిర్ణయం.. భర్త చెంతకు

  తులసి సంచలన నిర్ణయం.. భర్త చెంతకు

  డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత తులసి.. అత్తగారితో ‘మీకు ఏం కావాలి? మీ పెళ్లిరోజు ఆయన చేతులు మీదుగా జరగాలి అంతేనా' అంటుంది. దానికి అనసూయ ప్రత్యేకంగా చెప్పాలా అని బదులిస్తుంది. దీంతో తన భర్త దగ్గరకు వెళ్లి ఫంక్షన్ గురించి మాట్లాడాలని తులసి డిసైడ్ అయిపోతుంది. అందుకు అనుగుణంగానే లాస్య ఇంటికి పయనం అవుతంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తయిపోయింది.

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  English summary
  Intinti Gruhalakshmi Episode 355: Anasuya Fell Down in Home. Then She Denied for Treatment. After That Tulasi wants to go to Nandu's House for Inviting.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X