For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 26th Episode: తులసికి సారీ చెప్పిన నందూ.. లాస్యకు షాకిస్తూ భార్యతో కలిసి!

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

   శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ ఫంక్షన్ చేయడానికి వీలు లేదని తండ్రి చెప్పడంతో ఇంట్లో చికాకులు కనిపిస్తాయి. అంకిత.. తన గురించి చెడుగా మాట్లాడుతున్న విషయాన్ని తులసి గ్రహిస్తుంది. ఆ తర్వాత అనసూయ కళ్లు తిరిగి పడిపోతుంది. చికిత్సకు కూడా సహకరించదు. దీంతో అత్తగారి కోరిక తీర్చేందుకు తులసి తన భర్త నందూ దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది.

  నందూ దగ్గరకు వెళ్లొద్దన్న మామగారు

  నందూ దగ్గరకు వెళ్లొద్దన్న మామగారు

  అత్తగారు పట్టుబట్టడంతో నందూ దగ్గరకు వెళ్లడానికి రెడీ అవుతుంది తులసి. అప్పుడు మామగారు ఎంట్రీ ఇచ్చి ‘మీ అత్త చచ్చే రకం కాదమ్మ. ఎదుటి వాళ్లను చంపే రకం. దాని కోసం నువ్వు నందూ దగ్గరకు వెళ్లడం నాకైతే ఇష్టం లేదు' అని అంటాడు. అయినప్పటికీ తులసి మాత్రం వెళ్లడానికే సిద్ధమవుతుంది. అప్పుడే ఆ విషయాన్ని అంకిత.. లాస్యకు ఫోన్ చేసి మరి చెబుతుంది.

  లాస్య ఇంటికి వెళ్లిన తులసి... యుద్ధం

  లాస్య ఇంటికి వెళ్లిన తులసి... యుద్ధం

  అంకిత ద్వారా తులసి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న లాస్య గుమ్మం దగ్గరే వేచి చేస్తుంటుంది. అప్పుడే ఆమె లోపలికి వస్తుంది. దీంతో ‘నీ ఇంటికి వస్తే కాళ్లు విరగ్గొడతా అన్నావు కదా. ఇప్పుడు నేను కూడా అదే పని చేయాలా. అయినా ఏ ముఖం పెట్టుకుని ఇంటికొచ్చావు' అంటుంది. అప్పుడు తులసి ‘అత్తగారి కోసం' అని బదులిస్తుంది. దీంతో కాసేపు గొడవ జరుగుతోంది.

   భార్యతో కలిసి వచ్చేందుకు నందూ రెడీ

  భార్యతో కలిసి వచ్చేందుకు నందూ రెడీ

  తులసి.. లాస్య ఇంట్లో గొడవ పడుతోన్న సమయంలో నందూ ఎంట్రీ ఇచ్చి భార్యపై కేకలు వేస్తాడు. ఆ తర్వాత ఎందుకొచ్చావని ఆమెను ప్రశ్నించగా.. అత్తగారి గురించి చెబుతుంది. అప్పుడు ‘అమ్మ కోసం నా దగ్గరకు వచ్చావా' అంటాడు. దీనికి పలు రకాలుగా తులసి అతడికి నచ్చజెప్పుతుంది. దీంతో భార్యతో కలిసి వెళ్లడానికి నందూ సిద్ధం అవుతాడు. అలాగే లాస్యను లోపలికి పొమ్మంటాడు.

   తల్లికి నందూ భరోసా.. భార్యకు క్షమాపణ

  తల్లికి నందూ భరోసా.. భార్యకు క్షమాపణ

  తులసితో కలిసి ఇంటికి వెళ్లిన నందూ.. తన తల్లితో చాలా సేపు మాట్లాడతాడు. ‘నా చేతుల మీదుగానే ఫంక్షన్ జరిపిస్తాను' అని భరోసా ఇస్తాడు. దీంతో ఆమె సంతోషించి టాబ్లెట్లు వేసుకుంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన నందూ.. తన భార్య తులసికి క్షమాపణలు చెబుతాడు. ‘ఫంక్షన్ చేయాలనుకున్న మీ ప్లాన్‌కు అనవసరంగా అడ్డు వచ్చాను' అంటూ కొత్తగా మాట్లాడుతాడు.

   లాస్యను తీసుకు రావద్దని చెప్పిన తండ్రి

  లాస్యను తీసుకు రావద్దని చెప్పిన తండ్రి

  ఆ సమయంలో పక్కనే ఉన్న తండ్రి మాత్రం నందూపై చిరాకు పడుతుంటాడు. ‘ఫంక్షన్ చేయొద్దంటే నువ్వు చస్తానంటావు. మీ అమ్మ నిరాహారదీక్ష చేస్తుంది. మీరిద్దరూ సరిపోయారు. ఇంకో విషయం.. ఫంక్షన్ నువ్వు చేయాలంటే లాస్య అక్కడకు రాకూడదు' అని కండీషన్ పెడతాడు. దీనికి నందూ తను నా మనిషి అంటాడు. ఆ తర్వాత దీనిపై తులసి మామగారిని ఒప్పిస్తుంది.

  నా భిక్ష అంటూ లాస్యకు తులసి ఝలక్

  నా భిక్ష అంటూ లాస్యకు తులసి ఝలక్

  తను అనుకున్నట్లే ఫంక్షన్ జరుగుతున్న నేపథ్యంలో లాస్య.. తులసికి ఫోన్ చేస్తుంది. ‘నీపై నేను గెలిచినందుకు ఫోన్ చేశా. నీ నుంచి ఏం లాక్కున్నా నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది' అంటుంది. అప్పుడు తులసి ‘నిజాయితీగా గెలిస్తే సంతోషించాలి. ఇప్పుడు ఫంక్షన్ నేను ఒప్పుకుంటేనే జరుగుతుంది. అంటే నీ గెలుపు నేను పెట్టిన భిక్ష' అని ఝలక్ ఇవ్వడంతో కాల్ కట్ చేస్తోంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 356: Nandu Visited his House. Then He Talk to his Mother Anasuya Then She Agreed for Treatment. After That Tulasi Gave Big Shock To Lasya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X