For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 28th Episode: తులసికి నచ్చినట్లే ప్లాన్ చేసిన నందూ.. చిచ్చు పెట్టిన అంకిత

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అత్తగారి పంతం మేరకు తులసి.. నందూ దగ్గరకు వస్తుంది. అప్పుడు అతడికి నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత తల్లితో మాట్లాడి టాబ్లెట్స్ వేయిస్తాడు నందూ. ఆ తర్వాత తులసిని క్షమించమని అడుగుతాడు. అలాగే, ఫంక్షన్ గ్రాండ్‌గా చేద్దామని ప్లాన్ చేస్తాడు. అనంతరం తులసికి లాస్య ఫోన్ చేస్తుంది. కానీ, ఆమె మాటలకు షాకై పెట్టేస్తుంది.

  శృతి ప్రేమ్ దూరంగా... అంకిత ప్లాన్

  శృతి ప్రేమ్ దూరంగా... అంకిత ప్లాన్

  శృతికి ప్రేమ్ గోళ్ల రంగు వేస్తుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఇది అంకిత కంట పడడంతో వాళ్లని విడగొట్టాలని అప్పుడే ప్లాన్ చేస్తుంది. తర్వాత వాళ్ల దగ్గరకు వెళ్లి ‘ప్రేమ్.. నువ్వు శృతిని పెళ్లి చేసుకుంటావా? ఒకవేళ చేసుకుంటే ఓకే.. లేదంటే దూరంగా ఉండడం మంచిది. పెళ్లి కావాల్సిన వాళ్లు కదా. ఎవరైనా చూస్తే బాగోదని చెప్పా' అనగా.. వదిన మారిందని ప్రేమ్ సంతోషిస్తాడు.

  తులసిని మరోసారి ప్రశ్నించిన మామ

  తులసిని మరోసారి ప్రశ్నించిన మామ

  ఫంక్షన్‌కు సమయం దగ్గర పడడంతో తులసితో మామగారు మరోసారి మాట్లాడతాడు. ‘ఏమ్మా నీకు మా ఫంక్షన్ నందూ చేతుల మీద జరగడం ఇష్టమేనా' అని అడుగుతాడు. దీనికి ‘ఎవరో ఒకరి ఇష్టం కోసం మన ఇష్టంతో పనేముంది మామయ్య' అంటుంది. ఆ తర్వాత తులసి తల్లికి ఫోన్ చేసి ఫంక్షన్‌ను పిలుస్తుంది. అప్పుడు మామగారు కూడా మాట్లాడడంతో ఆమె వస్తానని చెబుతుంది.

  లాస్య టార్గెట్ తులసి కాదు.. ఆమెనే

  లాస్య టార్గెట్ తులసి కాదు.. ఆమెనే

  పెళ్లిరోజు ఫంక్షన్‌కు తులసి వాళ్ల అమ్మ కూడా వస్తుందన్న విషయాన్ని భాగ్య ద్వారా తెలుసుకుంటుంది లాస్య. అప్పుడు ‘రానీ రానీ.. ఫంక్షన్‌లో ఆవిడే మన టార్గెట్. ఆమెను వాడుకుని తులసిలో అసహనం కలిగిస్తా. ఆ తర్వాత కుటుంబంలో గొడవలు పెట్టి ముక్కలు చేసేస్తా' అంటుంది. ఇది అర్థం కాలేదని భాగ్య చెబుతుంది. ఫంక్షన్‌లో చూడు మొత్తం నీకే అర్థం అవుతుంది అంటుంది లాస్య.

  రిసార్టుకు ఫ్యామిలీ.. నందూకు షాక్స్

  రిసార్టుకు ఫ్యామిలీ.. నందూకు షాక్స్

  ఫంక్షన్ కోసం నందూ, లాస్య ముందుగా రిసార్టుకు చేరుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం వేచి చూస్తుండగా.. అందరూ ఎంట్రీ ఇస్తారు. అప్పుడు తండ్రి మొదలుకుని.. మోహన్, ప్రేమ్ కూడా నందూకు గుచ్చుకునేలా మాట్లాడి షాకిస్తారు. అప్పుడు తులసి ‘ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. సరదాగా గడపడానికి వచ్చాం పదండి' అంటూ అందరినీ లోపలికి పంపుతుంది.

  తులసికి ఆ బాధ్యత.. లాస్యకు ఇలా

  తులసికి ఆ బాధ్యత.. లాస్యకు ఇలా

  వాళ్లంతా లోపలికి వెళ్లినా తులసి మాత్రం తల్లి కోసం వేచి చూస్తుంది. అప్పుడు నందూ ‘ఏంటి తులసి ఎవరైనా వస్తారా? నువ్వు లోపలికి వెళ్లు. నేను రిసీవ్ చేసుకుంటా' అంటాడు. కానీ, తులసి మాత్రం వెళ్లదు. అప్పుడు నందూ ‘ఇక్కడ ఏం కావాలన్నా లాస్యను అడుగు' అంటాడు. అలాగే లాస్యతో ‘షష్టిపూర్తికి సంబంధించిన విషయాలు తులసి చూసుకుంటుంది' అని బాధ్యత అప్పగిస్తాడు.

  తులసి లాస్య మధ్య మరొక ఛాలెంజ్

  తులసి లాస్య మధ్య మరొక ఛాలెంజ్

  నందూ ఆ మాట చెప్పగానే.. ‘అవునులే సంప్రదాయం గురించి తెలుసు కాబట్టి ఆ పనులు నేనే సక్రమంగా చేస్తా. విలువలు లేని వాళ్లు, తెలియని వాళ్లు చేయలేరు' అని అంటుంది తులసి. అప్పుడు లాస్య ‘నువ్వు నీ పని చేసుకో.. నేను నా పనులు చేసుకుంటా. చూద్దాం ఎవరు ఎవరి పనులను సక్రమంగా చేస్తారో' అంటూ ఛాలెంజ్ చేసుకుంటారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  English summary
  Intinti Gruhalakshmi Episode 357: Ankita Planed to Break The Bonding of Prem and Shruthi. Then Total Family Went to Resort for Marriage Day Function. There Nandu Gave Responsibility to Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X