For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 3rd Episode: తులసి కోసం అనుకోని అతిథి.. నందూపై లాస్య కుట్ర.. కథలో మలుపు

  |

  ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇధే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇధే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రెగ్నెన్సీ విషయాన్ని భర్తకు చెప్పనందుకు అంకిత బాగా బాధ పడుతుంది. ఆ తర్వాత ప్రేమ్.. శృతి మధ్యలో స్విమ్మింగ్ ఫూల్ దగ్గర రొమాంటిక్ సన్నివేశం కనిపిస్తుంది. ఇక, దివ్యను తులసి ఆశీర్వాదం తీసుకోమని నందూ దగ్గరకు పంపిస్తుంది. అప్పుడు లాస్య కన్నింగ్ ప్లాన్లు వేసినా.. దివ్య మాత్రం ధీటుగా బదులిస్తూ ఆమెకే షాకిస్తుంది.

  దివ్య గురించి లాస్యపై కోప్పడిన నందూ

  దివ్య గురించి లాస్యపై కోప్పడిన నందూ

  తండ్రి ఆశీర్వాదం కోసం ఇంటికి వచ్చిన దివ్యతో లాస్య వాగ్వాదానికి దిగడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోగానే నందూ ఎంట్రీ ఇస్తాడు. రావడం రావడమే చిన్న పిల్లతో అలాంటి మాటలు ఎందుకు అంటూ లాస్యపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతాడు. ఆ తర్వాత కూతురిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఎమోషనల్ అవుతాడు.

  అంకితకు బ్రెయిన్ వాష్ చేసిన పేరెంట్స్

  అంకితకు బ్రెయిన్ వాష్ చేసిన పేరెంట్స్


  మరోపక్క తన గర్భం గురించి అభికి చెప్పకపోవడంతో అంకిత మధన పడుతూ కనిపిస్తుంది. అంతలో ఆమె తల్లి తండ్రి అక్కడకు చేరుకుంటారు. బాధ పడుతోన్న కూతురికి అబార్షన్ చేసుకోమని బ్రెయిన్ వాష్ చేస్తారు. అంతేకాదు, ‘నువ్వు కడుపుతో ఉన్నావని తెలిస్తే.. మీ అత్తింటి వాళ్లంతా ఇక్కడికి వచ్చేస్తారు.. తర్వాత నిన్ను అక్కడకు తీసుకెళ్లిపోతారు' అంటూ ఆమెను భయపెడతారు.

  తులసి కోసం మహిళా సంఘాల రాక

  తులసి కోసం మహిళా సంఘాల రాక

  విడాకులు కాకముందే తులసిని భర్త వదిలేసి వెళ్లిపోయిన విషయం తెలుసుకుంటారు మహిళా సంఘాల కార్యకర్తలు. ఈ క్రమంలోనే కొంత మంది అక్కడకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే భర్తపై పోరాటం చేద్దామని వాళ్లు తులసి అడుగుతారు. దీనికి ఆమె ఒప్పుకోదు. అంతేకాదు, ‘నాలుగు గోడల మధ్య పరీష్కారం అయ్యే వాటిని రోడ్డు మీదకు తీసుకు రావొద్ద'ని వాళ్లను పంపించేస్తుంది.

  ఆఫీస్‌లో నందూకు కొత్త తలనొప్పులు

  ఆఫీస్‌లో నందూకు కొత్త తలనొప్పులు

  లాస్య పక్కనే ఉండగా ఆఫీసులో తన పని తాను చేసుకుంటూ ఉంటాడు నందూ. ఆ సమయంలోనే అక్కడ పని చేస్తోన్న శ్రీనివాస్ వచ్చి ‘సార్ మన కంపెనీలో పని చేసే ఉద్యోగులంతా జీతాలు కావాలని అడుగుతున్నారు. కానీ, సంస్థ వాటిని కేటాయించలేదు' అని చెబుతాడు. అప్పుడు నందూ అతడికి సర్ధి చెబుతుండగా.. లాస్య మాత్రం బాగా సీరియస్ అయి పంపించేస్తుంది.

  తులసి ఇంటికి అనుకోని అతిథి ఎంట్రీ

  తులసి ఇంటికి అనుకోని అతిథి ఎంట్రీ


  తులసి ఉద్యోగం గురించి మామ గారు అడుగుతుంటాడు. అప్పుడు ఆమె ఏదో సమాధానం చెబుతుంటుంది. అంతలో అక్కడకు రోహిత్ సోదరి అంజలి వస్తుంది. అనుకోకుండా వచ్చిన స్నేహితురాలితో ఆమె మాట్లాడుతుంటుంది. అప్పుడే అనసూయ వచ్చి ఆమెను ఏదో అంటుంది. అప్పుడు తులసి బాగా ఫైర్ అవడంతో.. తన ఫ్రెండ్‌లో వచ్చిన మార్పుకు ఆమె ఆశ్చర్యపోతుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  నందూపై లాస్య భారీ కుట్ర లీకైందిగా

  నందూపై లాస్య భారీ కుట్ర లీకైందిగా


  ఆఫీస్‌లో జీతాల కోసం నందూను అడిగిన శ్రీనివాస్‌.. ఆ తర్వాత లాస్య దగ్గరకు వస్తాడు. అప్పుడు ‘ఏం యాక్టింగ్ చేశారు మేడం. నందూ గారు నిజమేనని అనుకున్నారు' అని అంటాడు. దీంతో ‘అందతా నాకెందుకు? నాకు కావాల్సింది డబ్బులు మాత్రమే' అంటూ అంటోంది లాస్య. దీంతో ఆమె డబ్బుల కోసం కుట్ర చేసినట్లు ఒప్పుకుంటుంది. దీంతో సీరియల్‌లో కొత్త కోణం కనిపిస్తుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 336: Parents brain wash to Ankita for abortion. Then Anjali Came to Tulasi House. Lasya Cunning Plan on Nandhu for Money.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X