For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi May 22nd Episode: భర్తపై తులసి ఉగ్రరూపం.. సీరియల్‌లో తొలిసారి అలాంటి సీన్!

  |

  తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు ఊహించని రీతిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది వస్తున్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  గురువారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగిందిదే


  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో మాధవి, మోహన్ తులిసి క్షమాపణలు చెబుతారు. ఆ తర్వాత లాస్య ప్లాన్ ప్రకారం.. నందూ ఇంట్లో మరోసారి పంచాయితీ పెడతాడు. ఈ క్రమంలోనే భార్య తులసిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు లాస్యకే సర్వాధికారాలు అప్పగిస్తున్నట్లు ప్రకటిస్తాడు. ఇక, ఇంట్లో జరిగిన గొడవను దివ్య తన పెద్దన్నయ్య అభికి ఫోన్ కాల్ ద్వారా తెలియజేస్తుంది.

  తులిసికి చిరాకు తెప్పించిన లాస్య

  తులిసికి చిరాకు తెప్పించిన లాస్య


  శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో.. గొడవ వల్ల బాధ పడుతోన్న తులిసి దగ్గరకు వచ్చిన లాస్య.. ‘ఏంటి తులసి ఇంట్లో జరిగిన గొడవతో నీకు మైండ్ బ్లాక్ అయిందా? నాతో పెట్టుకుంటే అంతే మరి' అంటూ ఆమెను మరింతగా చిరాకు పెట్టేలా మాట్లాడుతుంది. దీనికి తులసి కూడా ధీటుగానే సమాధానాలు ఇస్తుంది. దీంతో ఇద్దరి మధ్య సంభాషణలు తారాస్థాయికి చేరుకుంటాయి.

  తులిసిని అలా భయపెట్టిన లాస్య

  తులిసిని అలా భయపెట్టిన లాస్య


  తులసి కూడా ఎదురించి మాట్లాడుతుండగా.. లాస్య ‘అంకుల్‌కు బీపీ టాబ్లెట్లు ఎక్కువ కావొచ్చు.. ఆంటీకి షుగర్ తక్కువ కావొచ్చు.. దివ్య మెట్ల మీద నుంచి పడిపోవచ్చు. ప్రేమ్ టిప్పర్ కింద పడిపోవచ్చు. ఇవన్నీ నా వల్లే జరగొచ్చు. ఇవన్నీ జరిగితే మన ముగ్గురమే మిగలొచ్చు. అప్పుడు విడాకులతో నువ్వు వెళ్లిపోతే మేం హ్యాపీగా ఉండొచ్చు' అంటూ పరోక్షంగా భయపెడుతోంది.

  నందూ తండ్రిని చంపేసిన లాస్య

  నందూ తండ్రిని చంపేసిన లాస్య


  లాస్య పాలు తీసుకుని నందూ తండ్రికి ఇవ్వబోతుంది. అప్పుడాయన వాటిని వద్దంటాడు. ‘నేను ఇచ్చినవి తాగకపోతే ఇంకెవరూ ఇవ్వరు' అని ఆమె బెదిరించగా.. ఆయన పాలు తీసుకుని తాగుతాడు. ఆ కాసేపటికే నోట్లో నుంచి నురగ వచ్చి చనిపోతాడు. అంతలో మెలకువ వచ్చి నిద్ర లేస్తుంది తులిసి. ఆ తర్వాత జరిగింది అంతా కల అని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంటుంది.

  ఆ భయంతో బుక్కైపోయిన తులసి

  ఆ భయంతో బుక్కైపోయిన తులసి


  తర్వాతి రోజు ఉదయాన్నే లాస్య నిజంగానే పాలు పట్టుకుని వస్తుంది. దీంతో అక్కడే ఉన్న తులసి ‘వాటిని తాగొద్దు.. లాస్య ఏదో కలిపి తీసుకొచ్చింది' అని అంటుుంది. దీంతో లాస్యనే ఆ పాలను స్వయంగా తాగి ఏమీ కలపలేదని నిరూపించడంతో పాటు తులసిని ఇరికిస్తుంది. దీంతో పక్కనే ఉన్న నందూ రెచ్చిపోయి ‘ఎప్పుడూ లాస్యను తప్పుబడతావు' అంటూ భార్యపై ఫైర్ అవుతాడు.

  నా భార్య స్థానం ఆమెకే అనగానే

  నా భార్య స్థానం ఆమెకే అనగానే


  నందూ ‘నా భార్య స్థానం లాస్యకే ఇస్తా'నంటూ తులసిని బెదిరిస్తాడు. దీంతో తొలిసారి ఆమె తన భర్తపై తిరగబడుతుంది. ‘ఎవరి స్థానం ఎవరికి ఇస్తారు? ఇవ్వడానికి మీరెవరు? తీసుకోవడానికి ఆవిడ ఎవరు? మూడుముళ్లు, ఏడు అడుగులతో నేను ఆ స్థానం తీసుకున్నాను.. ఎవరో ఒక ఆడది మీ జీవితంలోకి వస్తే.. మీరు ఆ స్థానాన్ని ఎలా ఇచ్చేస్తారు' అంటూ భర్తను ప్రశ్నించింది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  నేను కూడా చేస్తే ఏం చేస్తారు?

  నేను కూడా చేస్తే ఏం చేస్తారు?

  ఆగ్రహంతో ఊగిపోతోన్న తులసి.. నందూపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటుంది. ‘ఇన్ని రోజులూ ఏం చేసినా ఏమీ మాట్లాడకుండా ఉన్నది.. చేతకాక కాదు.. మీ మీద ప్రేమతో. అది ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని అనుకున్నా. కానీ, మీరు మరింతగా రెచ్చిపోతున్నారు. మీలా నేను కూడా ఎవరినైనా తీసుకొచ్చి.. మీ స్థానాన్ని వాళ్లకు ఇస్తే ఎలా ఉంటుంది' అంటూ ఓ రేంజ్‌లో కోప్పడింది.

  English summary
  ntinti Gruhalakshmi Episode 326: After big fight in house.. Lasya Irritate Tulasi with Cunning Plan. then Tulasi Fire on her Husband Nandu for first time
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X