For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi May 27th Episode: తులసి నేను తాళి కట్టిన భార్య.. లాస్యకు బిగ్ షాకిచ్చిన నందూ

  |

  తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నంచి ఊహించని రీతిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో తులసి.. భాగ్య, అనసూయకు వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత మరోసారి ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుని, మామగారితో చర్చలు జరుపుతుంది. అనంతరం శృతి రీఎంట్రీ ఇస్తుంది. ఆ సమయంలో పని మనిషితో కలిసి తులసిలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతుంది. ఇక, ఎపిసోడ్ చివర్లో లాస్య, నందూ కొత్త ఇంట్లోకి అద్దెకు దిగి షాకిచ్చారు.

  తులసికి బిగ్ వార్నింగ్ ఇచ్చిన లాస్య

  తులసికి బిగ్ వార్నింగ్ ఇచ్చిన లాస్య

  నందూ, లాస్య తన ఇంటి ముందే అద్దెకు దిగడంతో తులసి బాధ పడుతూ బయటకు వస్తుంది. అప్పుడు ఆమెను చూసి వాళ్లిద్దరూ మరింత రెచ్చిపోతారు. ఆ సమయంలో లాస్య.. తులసి దగ్గరకు వస్తుంది. అప్పుడు తులిసి 'నీకింకా బుద్ది రాలేదా.. నా ముందుకే వస్తావా' అంటుంది. దీంతో రెచ్చిపోయిన లాస్య 'నిన్నింకా బాధ పెడతా. యుద్ధం మొదలెడుతున్నా' అంటూ వార్నింగ్ ఇచ్చింది.

  తులసి ఉద్యోగం ఆఫర్ చేసిన రోహిత్

  తులసి ఉద్యోగం ఆఫర్ చేసిన రోహిత్

  రోడ్డు మీద జరిగిన గొడవ తర్వాత అందరూ ఎవరి ఇళ్లలోకి వాళ్లు వెళ్లిపోతుండగా.. రోహిత్ డ్రైవర్ అక్కడకు వస్తాడు. అప్పుడు వాళ్లు చూస్తుండగానే తులసితో 'మేడం మిమ్మల్ని రోహిత్ సార్ తీసుకు రమ్మన్నారు. మీకు ఉద్యోగం ఇస్తానని చెప్పారు' అంటూ చెబుతాడు. అప్పుడామె 'నాకు ఇప్పుడు కుదరదు. రోహిత్‌కు నేను కాల్ చేస్తా' అని సమాధానం చెప్పి అతడిని పంపేస్తుంది.

  అభిని ఘోరంగా అవమానించిన అత్త

  అభిని ఘోరంగా అవమానించిన అత్త

  భార్యతో జరిగిన గొడవను గుర్తు చేసుకుంటూ ఒంటరిగా బాధ పడుతుంటాడు అభి. అప్పుడు అంకిత అతడి దగ్గరకు వచ్చి మేకప్ కిట్ తీసుకు రమ్మని లిస్ట్ ఇస్తుంది. దీంతో ఫైర్ అయిన అభి.. 'నా దగ్గర డబ్బులు లేవు. అందుకే నీతో నేనిలా ఉంటున్నాను' అని చెబుతుంది. ఆ తర్వాత అంకిత తల్లి అక్కడకు వచ్చి అభికి డబ్బులు ఇవ్వడంతో పాటు అతడిని ఘోరంగా అవమానిస్తుంది.

  ప్రేమ్‌కు ఫోన్ చేసి మేటర్ చెప్పిన శృతి

  ప్రేమ్‌కు ఫోన్ చేసి మేటర్ చెప్పిన శృతి

  ముందు ఎపిసోడ్‌లోనే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది శృతి. ఇక, ఇప్పుడు నందూ లాస్యతో కలిసి ఇంటి ముందే కాపురం పెట్టిన విషయాన్ని ఆమె ప్రేమ్‌కు ఫోన్ చేసి వివరిస్తుంది. అప్పుడు అతడు 'నేను రాగానే ఆ లాస్యకు బుద్ధి చెబుతా' అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఇవేమీ మనసులో పెట్టుకోవద్దని చెబుతూ.. తనకు బోరింగ్‌గా ఉందని కాసేపు కొంటెగా మాట్లాడి అతడిని కూల్ చేస్తుంది.

  తులసి నేను తాళి కట్టిన భార్య అంటూ

  తులసి నేను తాళి కట్టిన భార్య అంటూ

  తులసికి రోహిత్ ఉద్యోగం ఇస్తానని చెప్పిన విషయం తెలుసుకున్న నందూ.. 'ఉద్యోగం చేస్తానని అంటుందా? అది కూడా రోహిత్ దగ్గర. ఇది నాకసలు ఇష్టం లేదు' అంటూ లాస్య ముందు కోప్పడతాడు. అప్పుడామె 'నువ్వు విడాకులివ్వబోయే ఆమె గురించి నీకెందుకు' అంటుంది. దీనికి నందూ 'ఏమనుకున్నా ఆమె నేను తాళి కట్టిన భార్య. డివోర్స్ వరకూ అదే' అంటూ షాకిచ్చాడు.

  Recommended Video

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  నందూపై కోప్పడిన లాస్య.. బ్రతిమాలి

  నందూపై కోప్పడిన లాస్య.. బ్రతిమాలి

  తులసిని ఇప్పటికీ తన భార్య అనడంపై లాస్య అతడిపై అలుగుతుంది. అప్పుడు 'నాకు ఇదే భయంగా ఉంది నందూ. ఎప్పటికైనా నువ్వు తనే నా భార్య అంటావని నాకు ముందే తెలుసు' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఒంటరిగా ఉన్న ఆమె దగ్గరకు వెళ్లి బ్రతిమాలుతాడు నందూ. అయినప్పటికీ లాస్య అసంతృప్తిగానే ఉంటుంది. దీంతో గురువారం ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 330: Lasya Warned Tulasi in front of Nandhu. Then Tulasi Got Job opportunity From Rohit. After This Nandhu Fire on Tulasi for Doing Job.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X