Double Elimination: డబుల్ ఎలిమినేషన్.. వైల్డ్ కార్డు ఎంట్రీలు.. షాకివ్వబోతున్న బిగ్‌బాస్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 9వ సీజన్ రంజుగా సాగుతున్నది. సెలబ్రిటీలు వర్సెస్ కామన్ మ్యాన్ గ్రూపులకు మధ్య జరుగుతున్న వార్ అంచనాలకు మించి కొనసాగుతున్నది. సెలబ్రిటీలకు ఏ మాత్రం తగ్గుకుండా కామన్ మ్యాన్స్ మాత్రం అదరగొట్టే పెర్ఫార్మెన్స్‌తో ముందుకు దూసుకెళ్తున్నారు. నామినేషన్స్, కెప్టెన్సీ టాస్క్, ఇలా ప్రతీ టాస్క్‌లోను రెండు గ్రూపులు సత్తా చాటుతున్నాయి. అయితే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2.O గురించి చర్చ జరుగుతున్నది. అయితే త్వరలోనే వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా మరికొందరు సెలబ్రిటీలు ఇంట్లోకి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో 4వ వారం డబుల్ ఎలిమినేషన్ అనే విషయం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయా? డబుల్ ఎలిమినేషన్స్ ఉంటాయా? అనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్ 4వ వారంలో సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరీ, హరిత హరీష్, శ్రీజ, దివ్య నిఖిత నామినేట్ అయ్యారు. దాంతో ఈ వారం మొత్తం 6 గురు నామినేషన్స్‌లోకి వచ్చారు. అయితే ఈ వారం అనధికారిక ఓటింగ్ ఫలితాలను బట్టి ఈ వారం హరిత హరీష్, శ్రీజ దమ్ము అత్యల్పంగా ఓటింగ్ సాధించారు అనే విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఇంటిలోకి వైల్డ్ కార్డు ద్వారా కామన్ మ్యాన్ కేటగిరి నుంచి దివ్య నిఖిత ఇంట్లోకి అడుగుపెట్టారు. రెండోసారి కూడా నాగ ప్రశాంత్‌ను దురదృష్టం వెంటాడింది. అయితే ఇక సెలబ్రిటీలు నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయనే ప్రచారం జోరందుకొన్నది. సింగర్ సాయితేజ్, టెలివిజన్ యాక్టర్ సుహాసిని, అలేఖ్య చిట్టి పికిల్స్, దివ్వెల మాధురి ఇంట్లోకి అడుగుపెడుతారనే విషయం ఆసక్తిగా మారింది.
అయితే బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో 2.O వెర్షన్‌లో భాగంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుంది. వారి ఎంట్రీ 5వ వారం చివర్లో ఉండే అవకాశం ఉందనేది తాజా సమాచారం. అయితే వారి ఎంట్రీకి ముందే 4 వారం డబుల్ ఎలిమినేషన్ చేస్తారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే.. హరిత, శ్రీజ దమ్ము ఇద్దరు ఇంటి నుంచి పంపే అవకాశం ఉంది. ఎందుకంటే వారిద్దరే తక్కువ ఓటింగ్‌తో చివర్లో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఒకవేళ ఎలిమినేషన్ ప్రక్రియలో ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వకూడదని భావిస్తే.. ఈ వారం హరిత హరీష్, శ్రీజ దమ్ములో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం. వారిలో ఎలిమినేట్ చేయాల్సి వస్తే.. ఎక్కువ శాతం హరీష్‌ను ఇంటి నుంచి బయటకు పంపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శ్రీజ తన గేమ్‌ను ఏ మాత్రం తగ్గకుండా ముందుకు తీసుకెళ్లడం గమనార్హం.
ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఈ సీజన్ మరింత క్రేజ్‌గా మారుతుందనే ఆడియెన్స్ భావిస్తున్నారు. కొత్త వారు రావడం వల్ల ఇంట్లో ఎదురుదాడి మరింత ఉధృతం అవుతుంది. కాబట్టి గేమ్‌లో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా బిగ్‌బాస్ సర్‌ప్రైజ్ ఇచ్చి కొత్త వారిని ఇంట్లోకి పంపిస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నది. వైల్డ్ కార్డు ఎంట్రీల అవకాశం ఎవరికి లభిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











