For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హరితేజ ఓటమికి కారణాలివేనా? తాను తవ్వుకొన్న గోతిలోనే పడ్డిందా!

  By Rajababu
  |

  తెలుగులో తొలి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా విజయవంతంగా ముగిసింది. జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి హోస్ట్‌గా మారి నడిపిన ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ గేమ్ షోలో మొదటి నుంచి అందర్ని ఆకట్టుకున్న కంటెస్టెంట్ హరితేజ ఫైనల్‌లో ఎలిమినేట్ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. మెజార్టీ ప్రేక్షకులు హరితేజనే విజేతగా నిలుస్తారనే భావనలో ఉన్నారు. ప్రేక్షకుల మనోభావాలకు విరుద్ధంగా హరితేజ ఓటమి చెందడం వెనుక స్వయంకృపారాధమే అనే మాట వినిపిస్తున్నది.

  అంచనాలు లేకుండా..

  అంచనాలు లేకుండా..

  ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన ఇంటి సభ్యుల్లో హరితేజ ఒకరు. క్రమక్రమేణా హరితేజ తన ప్రతిభా పాటవాలతో ఇంటిలో కీలక సభ్యురాలిగా మారింది. కిచెన్‌లో సరదాగా ఉండటం, టాస్క్‌లలో చురుకుగా వ్యవహరించడంతో ప్రేక్షకులకు ఆమె చాలా దగ్గరయ్యారు. టైటిల్‌కు బలంగా పోటి పడుతున్న వ్యక్తుల్లో ఆమె ఒకరిగా మారారు.

  Bigg Boss Winner : Shiva Balaji Won because of Pawan Kalyan
  ఆటపాటలతో..

  ఆటపాటలతో..

  హరితేజ పాడే పాటలు, చేసే న‌ృత్యాలు ఇతర అంశాలు ఆమెకు కలిసి వచ్చాయి. ఉదయం లేవడంతోనే చలాకీగా కనిపిస్తూ ప్రేక్షకులకు చేరువైంది. చాలా సమయాల్లో ఆమె చూసిన సమయస్పూర్తి ఆటను మరోస్థాయికి తీసుకెళ్లింది.

  హరితేజ హరికథ..

  హరితేజ హరికథ..

  లగ్జరీ టాస్క్‌లో భాగంగా హరితేజ చెప్పిన హరికథ ఎపిసోడ్ బిగ్‌బాస్1 కార్యక్రమానికి టాప్ అని చెప్పవచ్చు. ఈ ఎపిసోడ్‌లో హరితేజ టాలెంట్ ప్రపంచానికి తెలిసింది. హరితేజలో పలు కోణాలున్నాయని ప్రేక్షకులకు అర్థమైంది. అప్పటి నుంచే ఎన్నిసార్లు ఎలిమినేషన్‌కు నామినేట్ అయినా గానీ ప్రేక్షకులు ఆమెను బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగేటట్టు చేశారు.

  ఆదర్శ్‌ను తప్పించడం..

  ఆదర్శ్‌ను తప్పించడం..

  బిగ్‌బాస్‌లో హరితేజ చేసిన మొదటి తప్పు ఆదర్శ్‌ను ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి రక్షించడం. అప్పటికే ఆదర్శ్ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. అలాంటి ప్రత్యర్థిని హరితేజ సేఫ్ చేయడం మొదటికే మోసానికి వచ్చింది. గేమ్ ఫార్మాట్‌ను అర్థం చేసుకొని ఉంటే హరితేజకు బిగ్‌బాస్ టైటిల్ దక్కే అవకాశం ఉండేది.

  శివబాలాజీ కెమిస్ట్రీ

  శివబాలాజీ కెమిస్ట్రీ

  బిగ్‌బాస్ హౌస్‌లో చేసిన అతి కీలకమైన మరో తప్పు శివబాలాజీతో కెమిస్ట్రీ. ఓ దశలో అగ్రస్థానంలో దూసుకెళ్తున్న సమయంలో శివబాలాజీ ట్రాప్‌లో హరితేజ పడింది. అప్పటివరకు చాలా కోపంగా, దూకుడుగా ఆడుతున్నారని ముద్ర పడిన శివబాలాజీ.. తన క్యారెక్టర్ మార్చుకోవడానికి హరితేజ పనికివచ్చింది. దాంతో శివబాలాజీ తన గేమ్‌ను చాలా వేగంగా మార్చుకొన్నాడు. ఇంటిని సజావుగా నడపడంతోపాటు, కిచెన్‌లో కీలక పాత్ర పోషించడం శివబాలాజీకి ప్రేక్షకుల మద్దతు పెరిగింది.

  కంట్రోల్ తప్పి..

  కంట్రోల్ తప్పి..

  బిగ్‌బాస్ హౌస్‌లో చివరి వారానికి ముందు హరితేజ నియంత్రణ కోల్పోయింది. దీక్షా పంత్‌ను కార్నర్ చేయడానికి హరితేజ, అర్చన జతకట్టినట్టు కనిపించారు. దీక్షాను టార్గెట్ చేయడమే కాకుండా అవహేళన చేస్తూ కనిపించారు. అక్కడే నుంచే హరితేజకు ప్రతికూలత ఎదురైంది. దాంతో శివ బాలాజీ, ఆదర్శ్‌లకు క్రేజ్ పెరిగింది.

  అర్చనతో కలిసి డబుల్ గేమ్

  అర్చనతో కలిసి డబుల్ గేమ్

  దీక్షాతో ఓ వైపు మంచిగా ఉంటూనే మరో వైపు అర్చనతో కలిసి డబుల్ గేమ్ ఆడింది. బాత్రూంలో హరితేజ, అర్చనలిద్దరూ దీక్షాపై చాడీలు చెప్పుకుంటూ దీక్ష, శివబాలాజీకి అడ్డంగా దొరికిపోయారు. దాంతో హరితేజ గేమ్ ప్లాన్, నిజ స్వరూపం తెలిసింది. దాంతో సానుకూలంగా ఉన్న ప్రేక్షకులు ప్రతికూలంగా మారారనే వాదన తెరపైకి వచ్చింది.

  పొరపాట్లతో..

  పొరపాట్లతో..

  తన గేమ్ ప్లాన్‌లో పొరపాట్ల కారణంగా మెజార్టీ వర్గాలను హరితేజ ఆకట్టుకోలేకపోయింది అనే మాట బలంగా వినిపిస్తున్నది. హరితేజకు ప్రధానంగా పిల్లలు, టీనేజర్ల నుంచి మద్దతు లభించినట్టు ఐమాక్స్ నుంచి చేసిన ప్రత్యక్ష ప్రసారంలో ఆనవాళ్లు కనిపించాయి.

  ఎమోషనల్‌గా ఆదర్శ్

  ఎమోషనల్‌గా ఆదర్శ్

  బిగ్‌బాస్‌లో ఆదర్శ్‌ తన గేమ్‌ను చాలా డిఫరెంట్‌గా ఆడాడు. పెద్దగా టాలెంట్ ప్రదర్శించిన ఆదర్శ్ కేవలం ఎమోషన్స్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొంటూ ఆకట్టుకొన్నాడు. ఇతర వ్యక్తుల పరిస్థితులను ఆర్థం చేసుకొన్నట్టు గ్లేమ్ ప్లాన్ చేసుకొన్నాడు. తోటి ఇంటి సభ్యులను కించపరుచకుండా సేఫ్ ఆడటంలో ఆదర్శ్ మార్కులు కొట్టేశాడు.

  గేమ్ ప్లాన్‌ను..

  గేమ్ ప్లాన్‌ను..

  బిగ్‌బాస్ విజేతగా నిలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ.. హరితేజ ఎదుటివారి గ్లేమ్ ప్లాన్‌ను అంచనా వేయడంలో తప్పటడుగు వేసినట్టు అర్థమవుతున్నది. శివ బాలాజీ, ఆదర్శ్ గేమ్ ప్లాన్ సరిగా ఆర్థం చేసుకొంటే హరితేజ విజేతగా నిలిచేది.

  English summary
  Actor Hariteja is strong contestant in Bigg Boss Telugu Reality Show. Intiallly Hariteja played well with good strategy. But Hariteja lost her control over game. So Result has come negatively for her. Hariteja eliminated final round of the game.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X