Elimination: బిగ్‌బాస్ నుంచి మరో కామన్ మ్యాన్ అవుట్.. టాప్ 5 కంటెస్టెంట్ ఎలిమినేట్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో నాలుగో వారంలో ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్‌లో ఉన్న కామన్ మ్యాన్ అతి తక్కువ ఓట్లు సాధించడంతో ఇంటి నుంచి బయటకు పంపించారు. అయితే శనివారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఎపిసోడ్‌లో కామన్ మ్యాన్ నుంచి మరొకరిని హోస్ట్ నాగార్జున అక్కినేని ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. 4వ వారం ఎలిమినేట్ అయిన వారిలో ఎవరు ఉన్నారు? ఎవరు సేఫ్ అయ్యారు అనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్ 4వ వారంలో సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరీ, హరిత హరీష్, శ్రీజ, దివ్య నిఖిత నామినేట్ అయ్యారు. దాంతో ఈ వారం మొత్తం 6 గురు నామినేషన్స్‌లోకి వచ్చారు. అయితే ఈ వారం అనధికారిక ఓటింగ్ ఫలితాలను బట్టి ఈ వారం హరిత హరీష్, శ్రీజ దమ్ము అత్యల్పంగా ఓటింగ్ సాధించారు. దాంతో వారిపై ఎలిమినేషన్ కత్తి వేలాడింది. అయితే వారాంతం ఎపిసోడ్‌లో నాగార్జున అక్కినేని వచ్చి ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించారు.

అయితే నాలుగో వారం వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యుల మధ్య గొడవలు, విభేదాలు, ఎమోషన్స్ గురించి ప్రస్తావించారు. దాంతో కంటెస్టెంట్లు మొత్తం భావోద్వేగంతో తమలోని ఎమోషన్స్‌ను బయటపెట్టారు. ఆటపాటలు కొనసాగిస్తూ ఒక్కొక్కరిని సేఫ్ చేస్తూ శనివారం ఎపిసోడ్‌ను కొనసాగించారు. అయితే అత్యల్పంగా ఓట్లు సాధించిన హరిత హరీష్, శ్రీజ దమ్ములు చివరిగా ఎలిమినినేషన్ ప్రక్రియలో నిలిచారు.
ఇక 4వ వారం అత్యల్ప ఓట్లు సాధించిన హరిత హరీష్‌ను ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించినట్టు సమాచారం. దాంతో ఆయన ప్రయాణం బిగ్‌బాస్‌లో ముగిసింది. గత కొద్దికాలంగా హరీష్ కూడా ఆటను ప్రదర్శించకుండా అనారోగ్యం పేరుతో డల్ అయ్యాడు. పలుమార్లు ఆయన స్వయంగా ఎలిమినేట్ అయితే బాగుంటుందని పదే పదే చెప్పడం కనిపించింది. దాంతో ఆయన ఇంటి నుంచి నిష్క్రమించినట్టు సమాచారం.

నాలుగో వారంలో అత్యల్ప ఓట్లు సాధించడంతో ఎలిమినేట్ అయిన హరిత హరీష్ చివరిసారిగా వేదికపైకి వచ్చి హోస్ట్‌తో కలిసి తన జర్నీని చూసి ఎమోషనల్ అయ్యారని తెలిసింది. ఇక తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల తన శక్తికి మించి ఆటను ప్రదర్శించడంలో విఫలమయ్యానని అభిప్రాయపడినట్టు తెలిసింది.
ఇక కామన్ మ్యాన్‌ను ఇంటిలోకి తీసుకొచ్చేందుకు జరిగిన అగ్నిపరీక్షలో మాస్క్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన హరిత హరీష్.. రకరకాల వివాదాలకు కేంద్ర బిందువుయ్యాడు. ఇంటిలో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఇంటి సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. లౌక్యం ప్రదర్శించలేకపోయిన హరీష్ చివరకు బిగ్‌బాస్‌లో ఇంటి నుంచి బయటకు వచ్చాడు.


Click it and Unblock the Notifications











