Mid Week Elimination: బిగ్‌బాస్‌లో షాకింగ్‌గా మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆందోళనకరంగా కంటెస్టెంట్ ఆరోగ్యం?
బిగ్‌బాస్ తెలుగు 9 (Bigg Boss Telugu 9) రియాలిటీ షోలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకొంటున్నాయి. తొలివారం కొంత సరదాగా, కొంత వివాదాస్పద సంఘటనలతో సాగిపోయింది. అయితే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున గేమ్ ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేశాడు. ఇంటి సభ్యుల లోపాలను, గేమ్ స్ట్రాటజీలను ఎత్తి చూపుతూ రెండో వారం ఆటను ఆసక్తిగా మార్చేశాడు. అయితే సంజన, హరిత హరీష్ విషయంలో హోస్ట్ పెట్టిన చిచ్చు ఇంటిలో అనేక మార్పులకు, కొత్త వ్యూహాలకు తెర లేపింది. అయితే హోస్ట్ అనుసరించిన వ్యూహం ఈ సీజన్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు దారి తీస్తుందా? అనే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎందుకు జరిగే అవకాశం ఉందనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తాజా సీజన్‌లో విభిన్నమైన ప్రవర్తన, డిఫరెంట్ గేమ్ స్ట్రాటజీతో హరిత హరీష్ అందర్నీ ఆకట్టుకొన్నాడు. అతడి ఆట, మాటలు ఆడియెన్స్‌లోను, సోషల్ మీడియాలోను హాట్ టాపిక్‌గా మారింది. కామన్ మ్యాన్‌గా బిగ్‌బాస్ ఎంట్రీ కోసం ఆయన అరగుండు కొట్టుకోవడం చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత గుండు చేసుకొని ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇమ్మాన్యుయేల్ ఆయనను గుండు అంకుల్ అంటూ కామెంట్ చేయడం వివాదంగా మారింది. అంతేకాకుండా హరీష్ వాడిన రెడ్ ఫ్లవర్ అనే మాటను నాగార్జున తప్పుపట్టారు. దాంతో ఆయన ఇమ్ముకు క్షమాపణ కూడా చెప్పారు.

అయితే రెడ్ ఫ్లవర్ మాత్రమే కాకుండా భరణి, ఇమ్మును ఆడవాళ్లు అంటూ కామెంట్ చేయడాన్ని హోస్ట్ నాగార్జున, ఇంటి సభ్యులు తీవ్రంగా పరిగణించారు. ఆడవాళ్లను కించపరిచే విధంగా మాట్లాడావు అంటూ నాగార్జున సీరియస్ అయ్యారు. క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో మరింత ఆగ్రహం చెందాడు. ఆ తర్వాత మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు తన పేరులోని హరితను తొలిగిస్తున్నాను అని కామెంట్ చేశారు. నాగ్ కామెంట్స్‌పై హరీష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇంటి సభ్యులు ఆమోదిస్తే.. తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని నాగ్ అన్నారు.
వీకెండ్ ఎపిసోడ్‌లో జరిగిన పరణామాలతో హరీష్ మనస్తాపం చెందాడు. రెండో వారంలో అతడిని అందరూ టార్గెట్ చేయడంతో మరింత కుంగిపోయినట్టు కనిపించాడు. దాంతో రీతూ చౌదరీతో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. మీలాంటి వాళ్లతో ఇంట్లో ఉండటం, ఈ షోలో కొనసాగడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు. దాంతో అయితే నిన్ను ఎవరు ఆపుతున్నారు అంటూ ఆమె కామెంట్ చేసింది. అయితే బిగ్‌బాస్‌కు దమ్ముంటే పంపించమను అంటూ హరీష్ సవాల్ విసిరాడు. అయితే ఈ కామెంట్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. బిగ్‌బాస్ ఇంటిలో హరీష్ గేమ్ స్ట్రాటెజీనా? అనే విధంగా టాక్ వినిపిస్తున్నది.
వీకెండ్ ఎపిసోడ్ తర్వాత భరణితో వివాదం కారణంగా గత మూడు రోజులుగా భోజనం మానేయడం దిగ్బ్రాంతికరంగా మారింది. ఆయన పూర్తిగా బలహీనంగా కనిపిస్తున్నాడు. దాంతో ఆయన తీరుపట్ల బిగ్‌బాస్ ఇంట్లోనే కాకుండా తన సొంత ఇంట్లో కూడా టెన్షన్ మొదలైంది. అయితే హరీష్ భార్య ఆందోళన వ్యక్తం చేస్తూ బిగ్‌బాస్ నిర్వాహకులను సంప్రదించినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో హరీష్ తన పద్దతి మార్చుకోకపోతే.. ఆరోగ్య భద్రత దృష్టా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే అవకాశం లేకపోలేదని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











