Wild Card Entry: బిగ్‌బాస్‌లోకి ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్.. వైల్డ్ కార్డుతో 6 గురు.. ఎవరెవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో 5వ వారంలోకి అడుగుపెట్టింది. మరో 8 వారాల షో ఉండగా.. బిగ్‌బాస్ భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నది. ఇప్పటికే కామన్ మ్యాన్స్‌ను వైల్డ్ కార్డు రూపంలో పంపిన నిర్వాహకులు.. ప్రస్తుతం ఈ సీజన్ 2.0 షోకు తెరలేపారు. ఇంటిలో ఆటను రక్తి కట్టించేందుకు మరో అరుగురిని వైల్డ్ కార్డుల ద్వారా ఇంట్లోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి వెళ్లే ఆరుగురు ఎవరు? ఈ క్రమంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అనే విషయంలోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో 5 వారంలోకి ప్రవేశించంది. ఇప్పటికే ఇంటి నుంచి శ్రష్టి వర్మ, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, హరిత హరీష్ ఇంటలి నుంచి బయటకు వచ్చారు. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కామన్ మ్యాన్ కేటగిరి నుంచి దివ్య నిఖిత ఉన్నారు. ఇక కామన్ మ్యాన్ కోటాను పూర్తి చేసినట్టే అని భావించాల్సిందే అని అనలిస్టులు అంటున్నారు.

Prabhas Srinu as Wild Card entry into Bigg Boss Telugu 9

అయితే వైల్డ్ కార్డు ఇంట్రీల ద్వారా ఆరుగురు సెలబ్రిటీలను ఇంట్లోకి పంపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు వారికి సంబంధించిన ప్రోమోలను షూట్ కూడా చేస్తున్నారు. అందులో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ప్రస్తుతం టెలివిజన్ సీరియల్స్‌లో సీనియర్ నటిగా గుర్తింపు పొందిన సుహాసిని బిగ్‌బాస్‌ ఇంట్లోకి అడుగుపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత సీరియల్ నటుడు అఖిల్ రాజ్ కూడా వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి వస్తున్నట్టు సమాచారం.

బిగ్‌బాస్ తెలుగులోకి వెళ్తున్నారని చాలా రోజుల నుంచి వినిపిస్తున్న పేరు అలేఖ్య చిట్టి పికిల్‌. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ భామ ఎప్పుడో ఇంట్లోకి రావాల్సింది. వైల్డ్ కార్డు కోసమే ఆగారనే చెబుతున్నారు. ఇక ఆమె తర్వాత సోషల్ మీడియాలోను, పొలిటికల్ రంగంలోను మరో పాపులర్ ఫిగర్ దివ్వెల మాధురి. ఆమె ఇటీవల కాలంలో రాజకీయ రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలో ఎలా సుపరిచమయ్యారో అందరికి తెలిసిందే.

Prabhas Srinu as Wild Card entry into Bigg Boss Telugu 9

ఆ తర్వాత క్రేజీగా వినిపిస్తున్న పేరు సీరియల్ నటుడు నిఖిల్ నాయర్. ఇంటింటి గృహలక్ష్మీ సిరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఆయన కూడా వైల్డ్ కార్డుతో హౌస్‌లోకి అడుగు పెట్టనున్నారు. దాదాపు ఎక్కువగా ఈ వైల్డ్ కార్డు ఎంట్రీలో సోషల్ మీడియా, టీవీ రంగానికి చెందిన వారిపైనే దృష్టిపెట్టడం గమనార్హం.

ఇక ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీతో క్రేజీగా నిలిచే వ్యక్తి ప్రభాస్ శ్రీను. హాస్య నటుడిగానే కాకుండా రెబల్ స్టార్‌ ప్రభాస్‌కు అత్యంత సన్నిహితుడిగా, ఆయన ఫ్యామిలీకి దగ్గరైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. దాంతో ఆయనను ప్రభాష్ శ్రీను అని ముద్దుగా పిలుచుకొంటారు. గబ్బర్ సింగ్ సినిమా ద్వారా క్రేజీగా మారారు. ఇలా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి వచ్చే అావకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X