Elimination: మళ్లీ బిగ్‌బాస్‌లోకి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్.. సెలబ్రిటీని తిరిగి తీసుకు రావడానికి కారణం అదేనా?
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 5వ వారం ముగింపులో ఆసక్తికరమైన పరిణామాలు,సంచలన నిర్ణయాలు చోటు చేసుకొన్నాయి. గత నాలుగు వారాలుగా ఎలిమినేషన్ ప్రక్రియలో ఎలాంటి సంచలనాలు లేకపోవడంతో ఈ వారం కూడా సాదాసీదాగా కంటెస్టెంట్‌ను ఇంటి నుంచి బయటకు పంపిస్తారని అందరూ అనుకొన్నారు. కానీ డబుల్ ఎలిమినేషన్ పేరుతో ఎవరూ ఊహించని విధంగా కంటెస్టెంట్‌ను రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా బయటకు పంపించారు. అయితే ఆ కంటెస్టెంట్‌ను మళ్లీ తీసుకు వస్తున్నారు? ఆమెకు అన్యాయం జరిగింది అనే భావనతో వెనక్కి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది. 5వ వారం ఎలిమినేషన్‌లో ఏం జరిగింది? ఎవరిని తిరిగి తీసుకు రావాలని అనుకొంటున్నారు అనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు షోలోని తాజా ఎపిసోడ్‌లో డబుల్ ఎలిమినేషన్ చేశారు. తొలుత ఓటింగ్ ప్రకారం ఫ్లోరా సైనీని ఇంటి నుంచి బయటకు పంపించారు. ఆ తర్వాత డబుల్ ఎలిమినేషన్ అంటూ మరో ఎలిమినేషన్‌కు తెర లేపారు. అయితే కొన్ని టాస్కులు ఆడించి.. కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ దమ్మును ఎలిమినేట్ చేశారు. అయితే ఈ ప్రక్రియ అంతా చాలా ఆర్టిఫిషియల్‌గా, తెచ్చి పెట్టుకొని బయటకు పంపించడంలా కనిపించింది. అలా బలవంతంగా ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు.

అయితే సాధారణంగా ఏవరైనా కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయాలంటే.. ఆడియెన్స్ వేసే ఓటు ద్వారానే కంటెస్టెంట్లను బయటకు పంపిస్తారు. అయితే శ్రీజ దమ్మును ఓటింగ్‌తో కాకుండా టాస్క్‌లు ఆడించి ఎలిమినేట్ చేయడంపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో అన్యాయం అంటూ వీడియోలు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్‌లో ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినా గానీ.. వారి జర్నీని చూపిస్తారు. అయితే శ్రీజ దమ్ము విషయంలో అది జరగలేదు. శ్రీజ ఎలిమినేషన్ అనూహ్యంగా జరిగింది. కాబట్టి ఆమె ఆడియో విజువల్ ప్రజెంటేషన్ రెడీ కాలేదు. కాబట్టి చూపించలేకపోయాం అంటూ నాగార్జున వెల్లడించారు. దాంతో శ్రీజ ఎలిమినేషన్ కరెక్ట్ కాదు. ఏదో ట్విస్టు ఉందనే అనుమానం మరింత బలపడుతున్నది.
ఇక శ్రీజ దమ్ము ఆట తీరుపై కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ.. ఆమె ఆడే తీరు.. టాస్కుల్లో ఆమె చూపించే ప్రతిభ అందర్నీ ఆకట్టుకొన్నది. కొందరు సెలబ్రిటీల కంటే బెటర్‌గా ఆడుతుందనే అభిప్రాయం కూడా ఉంది. దాంతో ఆమె ఎలిమినేషన్ విషయంలో సానుభూతి భారీగా పెరుగుతున్నది. అయితే ఈ క్రమంలో శ్రీజను తిరిగి ఇంట్లోకి తీసుకు రావాలి అనే డిమాండ్ పూర్తి స్థాయిలో వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆమెను తిరిగి తీసుకొస్తారు అనే విషయం సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతున్నది.
శ్రీజ ఎలిమినేషన్ తర్వాత బయటకు వచ్చి ఎక్కడా కనిపించకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను సీక్రెట్ రూమ్‌లో ఏమైనా పెట్టారా? అలా సీక్రెట్ టాస్క్ ఏదైనా ఇస్తే మళ్లీ ఎంట్రీ ఎప్పుడు ఇప్పిస్తారు అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీజ విషయంలో నెటిజన్లు పాజిటివ్‌గా స్పందించడం బట్టి చూస్తే.. ఆమెను తిరిగి రీ ఎంట్రీ ఇప్పించాల్సిందే అంటూ ప్రచారం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











