#BringBackSwetaa అవకాశం వస్తే మళ్లీ బిగ్‌బాస్‌లోకి అంటూ శ్వేతా వర్మ.. వైల్డ్ కార్డు ఎంట్రీకి నెటిజన్ల డిమాండ్
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో ఎలిమినేషన్స్ షాకింగ్‌గా మారుతున్నాయి. నిజాయితీగా, టాస్కుల్లో రాణిస్తున్న కంటెస్టెంట్లు ఒక్కక్కొరు ఇంటి దారి పట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గత ఆరువారాల్లో ఇంటిలో రెబల్ స్టార్‌గా కనిపించిన శ్వేతా వర్మ ఇంటి నుంచి వెళ్లిపోవడం షాక్ గురిచేసింది. శ్వేతా వర్మ ఎలిమినేషన్ కేవలం ఇంటి సభ్యులకే కాకుండా టీవీలో షోను చూసే సాధారణ ప్రజలకు కూడా అసంతృప్తిని కలిగించింది. అయితే తాజాగా శ్వేతా వర్మ ఎలిమినేషన్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆమెను మళ్లీ వెనుకకు తీసుకురావాలని ట్రెండ్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

లైవ్‌లో శ్వేతా వర్మ ఇలా..
బిగ్‌బాస్ నుంచి ఎలిమినేషన్ అయిన తర్వాత శ్వేతా వర్మ తన జర్నీ గురించి సంతృప్తి చెందినట్టు చెప్పారు. లైవ్‌లో తన అభిమానులతో మాట్లాడుతూ.. తనకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. ఆరువారాల ప్రయాణం చక్కగా సాగింది. ప్రతీ రోజు ఏదో ఒక అనుభవాన్ని సంపాదించుకొన్నాను. మళ్లీ అవకాశం వస్తే వైల్డ్ కార్డు ద్వారా బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి రెడీగా ఉన్నాను అంటూ శ్వేతా వర్మ తెలిపారు.

శ్వేతా వర్మ ఎలిమినేషన్‌పై సిరి హన్మంతు
ఇక శ్వేతా వర్మ ఎలిమినేషన్ తర్వాత కూడా ఇంటి సభ్యుల్లో సానుభూతి కనిపించింది. టాస్కుల్లో వీరపోరాటం చేసిన కంటెస్టెంట్. ముక్కుసూటిగా మాట్లాడుతూ తప్పైతే తప్పు.. ఒప్పైతే ఒప్పు అని చెప్పేది. శ్వేతా వర్మ ఇంటి నుంచి వెళ్లిపోవడం నిజంగా షాక్. మేము ఊహించుకోలేకపోతున్నాం. ఆరువారాల్లో ఐదుగురు మహిళా కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. అది చాలా బాధగా ఉంది అంటూ సిరి హన్మంతు కూడా చెప్పడం కనిపించింది.

ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్
ఇక శ్వేతా వర్మ ఎలిమినేషన్ గురించి నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు. ముఖానికి ఎలాంటి మాస్క్ లేకుండా నిజాయితీగా ఆడిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ శ్వేతా వర్మ. టాస్కుల్లో కూడా ఆమె బెస్ట్ ఇచ్చేది. మూడుసార్లు కెప్టెన్సీ టాస్క్‌కు పోటీ పడిన ఏకైక కంటెస్టెంట్. ఏదో ఒక సందర్భంగా కోపంతో ఊగిపోయింది. కానీ ఆమె ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లో ఒకరు అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

టాస్క్‌లో 100 శాతం అంటూ
ఎలిమినేషన్ తర్వాత మళ్లీ ఇంటిలోకి ఎవరినైనా పంపించాలనుకొంటే.. ఆ అర్హత ఉంది కేవలం శ్వేతా వర్మకే. బిగ్‌బాస్‌లోకి రీ ఎంట్రీ ఉన్న ఏకైక కంటెంస్టెంట్ శ్వేతా వర్మ. ప్రతీ టాస్క్‌లో 100 శాతం ఇస్తుంది అని మరో నెటిజన్ తన కామెంట్‌ను పోస్టు చేశారు.

శ్వేతాను మళ్లీ పంపించండి అంటూ
శ్వేతా ఇంటిలోకి వెళ్లడానికి డిజర్వ్ ఉన్న కంటెస్టెంట్. ఆమెను షోలోకి తీసుకురండి. శ్వేతా స్ట్రాంగెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్. శ్వేతాను వెనుకకు తీసుకురండి (#bringbackSwetaavarma) అంటూ కామెంట్స్ చేస్తున్నారు. భారీగా ట్విట్టర్‌లో శ్వేతా వర్మకు సానుకూలంగా కామెంట్లు కనిపిస్తున్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా శ్వేతా వర్మ వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











