Bigg Boss Telugu OTT లోకి హాట్ యాంకర్.. గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కామెంట్
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సెలబ్రిటీల పేర్ల విషయంలో హల్‌చల్ కొనసాగుతున్నది. అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు కొత్తగా తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ షోలో పాల్గొంటున్నారంటూ తెరపైకి వస్తున్న పేర్లు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. అయితే బిగ్‌బాస్ ఓటీటీలోకి వింధ్యా మేడపాటి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే యాంకర్ భామ తన సమాధానం ఏం చెప్పారంటే..

స్పోర్ట్స్ కామెంటేటర్, హోస్ట్‌గా
వింధ్యా మేడపాటి విషయానికి వస్తే.. స్పోర్ట్స్ యాంకర్‌గా, కామెంటేటర్‌గా అందరికి సుపరిచితులు. క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయంటే ఇక తనదైన శైలిలో కామెంటరీతో వీక్షకులను ఆకట్టుకొంటుంది. గత ఐపీఎల్ సీజన్లతో మరింత పాపులారిటీ సంపాదించింది.

యాంకర్ రవితో హోస్ట్‌గా
క్రికెట్, స్పోర్ట్స్ కామెంటరీ కాకుండా వినోద సంబంధింత షోలతో కూడా మంచి ప్రేక్షకాదరణను సంపాదించుకొన్నది. యాంకర్ రవితో కలిసి నువ్వు రెడీ నేను రెడీ అనే షోలో కొద్దికాలం యాంకరింగ్ చేసింది. అయితే ఆ షోను నిలిపివేయడంతో బుల్లితెర మీద కనిపించకుండా పోయారు. కానీ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ కోసం సిద్దమవుతున్నారు. ఆ క్రమంలో వింద్యా మేడపాటి ఓటీటీ ఫార్మాట్ బిగ్‌బాస్‌లోకి అడుగుపెడుతున్నారనే విషయం బయటకు వచ్చింది.

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీపై కామెంట్
అయితే తొలిసారి ఓటీటీలో ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారా అనే విషయంపై వింధ్యా పాజిటివ్‌గా స్పందించింది. బిగ్‌బాస్ ఓటీటీ షోలో పాల్గొనే అవకాశం లేకపోలేదని తన ఇష్టాన్ని ఓ సంకేతంగా మీడియాలోకి వదిలారు. దాంతో ఈ అందాల భామ ఎంట్రీ తప్పదనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

హిందీ, తమిళంలో హిట్ కొట్టేసి..
ఇక గతేడాది హిందీ ఛానెల్స్‌లో బిగ్‌బాస్ ఓటీటీ ఫార్మాట్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. హిందీ వెర్షన్‌లో బ్రహ్మండమైన ఆదరణ, ప్రేక్షకుల స్పందన లభించింది. దాంతో జనవరి 31వ తేదీన తమిళంలో ప్రారంభించగా మంచి రెస్పాన్స్‌ను అందుకొంటున్నది. ఈ షోలో వనితా విజయ్ కుమార్, అభినయ తదితరులు బ్రహ్మండంగా రాణిస్తున్నారు.

డిస్నీ+హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 26 నుంచి
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ త్వరలోనే డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో ప్రారంభం కాబోతున్నది. తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 26న ఈ షో ప్రారంభం అవుతుందనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అయితే ఈ షో ప్రారంభానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే ఓ ప్రోమోను రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటన చేసే అవకాశముందని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











