»   » షాక్: ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన వీడియోలో టీవీ స్టార్

షాక్: ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన వీడియోలో టీవీ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రచార వీడియోలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టెలివిజన్‌ స్టార్‌ కనిపించారు. 12 నిమిషాల ఈ వీడియోను ఐఎస్‌ అండర్‌గ్రౌండ్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ గురువారం ఉదయం విడుదల చేసింది. ప్రఖ్యాత ఆస్ట్రేలియా టీవీ స్టార్‌ కార్ల్‌ స్టెఫానోవిక్‌ వీడియోలో కనిపించడం హాట్ టాపిక్ అయింది.

స్టెఫానోవిక్‌ టీవీ సెలబ్రిటీ కావడంతో ఇంటర్నేషనల్ మీడియాలో ఈ వీడియో గురించి చర్చ సాగుతోంది. ఆయన ఆస్ట్రేలియా నైన్‌ నెట్‌వర్క్‌కు చెందిన జర్నలిస్ట్‌, ప్రెజెంటర్‌. ఇటీవల ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత అక్కడి పరిస్థితిని స్పెఫానోవిక్ రిపోర్ట్‌ చేశారు.

Isis propaganda video features footage of Today show host Karl Stefanovic

తాజాగా విడుదలైన ఐసిస్ వీడియోలో పారిస్ ఉగ్రదాడి దృశ్యాలతో పాటు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలన్‌ల చిత్రాలు కూడా ఉండటం విశేషం. పారిస్‌ దాడుల ఫుటేజీలలతో పాటు ఆ మధ్య కాలిఫోర్నియాలో జరిగిన ఉగ్ర దాడుల ఫుటేజీలు కూడా ఈ వీడియోలో కనిపించాయి.

ఐసిస్ తరుపు పని చేస్తున్న ఫైటర్లలో మనోస్థైర్యం నింపేందుకు.... వారిని మరింత ఉత్తేజితులను చేయడానికి, దాడికి సన్నద్ధం చేయడానికి ఈ వీడియో రిలీజ్ చేసినట్లు మీడియాలో చర్చ సాగుతోంది.

Read more about: tv, టీవీ
English summary
Footage of one of Australia's leading television personalities has appeared in the latest Islamic State (IS) propaganda video that calls on more supporters to join their war against the West.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu