»   » సినీ దర్శకుడిగా మారుతున్న జబర్దస్త్ అదిరే అభి

సినీ దర్శకుడిగా మారుతున్న జబర్దస్త్ అదిరే అభి

Posted By:
Subscribe to Filmibeat Telugu

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులను నవ్వించిన చాలా మంది నటులు సినిమాల్లోకి కమెడియన్లుగా ఎంట్రీ ఇవ్వడం, అందులో కొందరు కమెడియన్లుగా టాప్ రేంజికి వెళ్లడం చూశాం. అయితే త్వరలో జబర్దస్త్ షో నుండి ఓ దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోన్నాడు. అతడు మరెవరో కాదు తనదైన శైలి స్కిట్లతో ప్రేక్షకులను అలరించిన అదిరే అభి.

అదిరే అభి ఇప్పటికే మల్టీ టాలెంటెడ్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే అతడిలో దర్శకుడు కావాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. త్వరలోనే దాన్ని నిజం చేసుకోబోతున్నాడు. ఓ స్క్రిప్టు సిద్ధం చేసుకుని దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

Jabardasth Adhire Abhi to turn director

ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.... అదిరే అభి దర్శకుడిగా చేయబోతున్న సినిమాలో హీరోగా హర్షవర్దన్ రాణే నటించబోతున్నారట. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

English summary
Noted artiste Abhi shot to fame with his entertaining skits in the hit comedy show Jabardasth. He has good recognition among movie lovers. Popularly known as Adhire Abhi, this multi-talented actor will soon be turning director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X