పిచ్చిదానా.. నీకు అంత సీన్ లేదు.. అరియానాను ఆటపట్టించిన అవినాష్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో అరియానా గ్లోరి, అవినాష్ మధ్య ఓ రకమైన రిలేషన్ కనిపిస్తుంది. వారిద్దరి కెమిస్ట్రీ చాలా సున్నితమైన హాస్యాన్ని పుట్టిస్తుంది. ప్రతీసారి వారిద్దరి మధ్య చిలిపి సంభాషణ ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇంటిలో 68వ రోజున అవినాష్, అరియానా, మెహబూబ్ మధ్య సరదా సంభాషణ ఇలా జరిగింది..

ఇంటిలో రెండు నెలల జర్నీ

ఇంటిలో రెండు నెలల జర్నీ

బిగ్‌బాస్ ఇంటిలోకి వచ్చి ఇప్పటికే రెండు నెలుల అయిపోయాయి. ఈ లైఫ్ చాలా గమ్మత్తుగా గొప్పగా ఉంది అంటూ అరియానా చెప్పబోతే.. రెండు నెలల్లో బాగా తయారయ్యావు. బాగుంది కదా అంటూ అరియానాను చూసి మెహబూబ్‌తో అవినాష్ కామెంట్ చేశాడు. దాంతో.. నువ్వు నా ముందే ఇద్దరు ముగ్గురిని బాగుంటావని చెప్పావు. ఇప్పుడు నన్ను అదే మాట నాతో అంటే నేను నీకు పడను అంటూ అరియానా కామెంట్ చేసింది.

నీపై అలాంటి ఆలోచన లేదు

నీపై అలాంటి ఆలోచన లేదు

నీవు నాకు పడాల్సిన అవసరం లేదు. నీకు అంత సీన్ లేదు. నాకు అంత సీన్ లేదు. నాకు అసలు ఆమె మీద అలాంటి ఆలోచన లేదు. కానీ ఆమెలో తనకు తెలియని విషయం ఒకటి ఉంది. అదే నేను గుర్తించాను అంటూ మెహబూబ్ వేసిన ఓ ప్రశ్నకు అవినాష్ సమాధానం చెప్పారు. అయితే ఎప్పుడు గుర్తించావు అంటూ అరియానా ఎదురు ప్రశ్నవేసింది.

ఓన్లీ ఫ్రెండ్‌షిప్ మాత్రమే

ఓన్లీ ఫ్రెండ్‌షిప్ మాత్రమే

అరియానా వేసిన ప్రశ్నకు అవినాష్ స్పందిస్తూ.. నేను ఏది చెప్పిన నమ్మదు. ఈమె ఓ పిచ్చిది. ఆమె నాకు పడాలని నేను ట్రై చేయడం లేదు అని అన్నాడు. అందుకు మా మధ్య అలాంటి ఆలోచన లేదు. మా మధ్య ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉంది అంటూ కామెంట్ చేసింది. అందుకు నీవు అప్పుడు ఏం మాట్లాడుతావో నీకే తెలియదు అంటూ అవినాష్ సీరియస్ అయ్యాడు.

మోనాల్ అందంగా ఉన్నావంటూ

మోనాల్ అందంగా ఉన్నావంటూ

నేను ఎవరైనా అమ్మాయి అందంగా ఉంటే.. బాగున్నావు అంటాను. నేను చాలా సార్లు మోనాల్‌ను చూసి బాగున్నావు అన్నాను. కానీ ఆమె నేను నీకు పడనని ఎప్పుడూ కామెంట్ చేయలేదు. నేను ఏదో సరదాగా అంటే నీవు అలా ఎలా అంటావు.. నీవు చదువుకొన్నావు కద.. ఇంటర్వూలో చేస్తావు. నాకు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని సలహాలు ఇస్తావు అంటూ అవినాష్ రెచ్చిపోయాడు.

Recommended Video

Chiranjeevi Tests Positive For COVID-19, Under Home Quarantine | Filmibeat Telugu
అరియానా, అవినాష్ మ్యాచింగ్ డ్రస్

అరియానా, అవినాష్ మ్యాచింగ్ డ్రస్

అయితే అరియానా తన మాటను మార్చుకొంటూ నేను నీకు పడిపోతాను అని చెప్పగా.. ఏం మాట్లాడుతున్నావు. నీవు నాకు ఎందుకు పడాలి. మనిద్దరం స్నేహితులం. అలానే ఉందాం అని అవినాష్ కామెంట్ చేశాడు. అయితే అరియానాను చూసి మ్యాచింగ్ డ్రస్ వేసుకొన్నావా అంటూ మెహబూబ్ టీజింగ్ చేయగా.. ఇప్పటికే ఇద్దరు ఆ మాట అన్నారు అంటూ అవినాష్ అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇలా వారి మధ్య సరదాగా సంభాషణ జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X