For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒక తప్పు వల్ల జబర్దస్త్ కమెడియన్ నా చెంప పగలగొట్టాడు.. విషయం పూరి జగన్నాథ్ వరకు వెళ్లింది: అవినాష్

  |

  జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ లలో ముక్కు అవినాష్ ఒకరు. బిగ్ బాస్ వరకు వెళ్లిన ఈ కమెడియన్ ఆ షో ద్వారా తన స్థాయిని మరింత పెంచుకున్నాడనే చెప్పాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం అవినాష్ పేరు ఇంటర్నెట్ ప్రపంచంలో బాగా వైరల్ అవుతోంది. ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య కూడా గట్టిగానే పెరుగుతోంది. అయితే ఒక సమయంలో ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ నా చెంప పగలగొట్టాడు అంటూ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు అవినాష్

   బిగ్ బాస్ 4సక్సెస్ లో..

  బిగ్ బాస్ 4సక్సెస్ లో..

  ముక్కు అవినాష్ బిగ్ బాస్ సీజన్ 4 లోకి ఒక జోకర్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతను ఎంట్రీతోనే షోకు మంచి బజ్ క్రియేట్ చేశాడు. పైగా తన టాలెంట్ ను కూడా అందరికి మరింత తెలిసేలా చేశాడు. బిగ్ బాస్ తెలుగు 4 ఈ సారి సక్సెస్ కావడానికి కారణం అవినాష్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించాడు.

   జబర్దస్త్ వల్ల ఇబ్బందులు..

  జబర్దస్త్ వల్ల ఇబ్బందులు..

  అయితే హౌజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత అవినాష్ తన పర్సనల్ విషయాలను ఎన్నో బయటకు చెప్పుకుంటున్నాడు. పైగా జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి 10లక్షలు డబ్బు కట్టడానికి పడిన ఇబ్బందులపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. జబర్దస్త్ లో ఇలాంటివి కూడా ఉంటాయా అనే విషయం కూడా జనాల్లో చర్చనీయాంశంగా మారింది.

  అతను కొట్టడంతో..

  అతను కొట్టడంతో..

  ఇక ముక్కు అవినాష్ ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ కమెడియన్ తనపై చేయి చేసుకున్నాడు అంటూ వివరణ ఇచ్చాడు. ఒక తప్పుడు ఆలోచన తీసుకోవడం వల్లనే అతను కొట్టినట్లు చెప్పిన అవినాష్ చివరకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరకు ఆ విషయం వెళ్లినట్లు చెప్పాడు.

  సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను

  సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను

  అవినాష్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ లో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. షూటింగ్స్ ఉంటే ఏ బాధ ఉండేది కాదు. కానీ సడన్ గా కరోనా వల్ల పనులన్నీ ఆగిపోవడంతో రెండు నెలల్లోనే చేతుల్లో ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి. ఒకవైపు లోన్ లో తీసుకున్న ఫ్లాట్, మరోవైపు అప్పులు. చాలా కఠినమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే ఒకనొక సమయంలో ఏం చేయలేక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను.

  గెటప్ శ్రీను రెండు చెంపలు వాయించేశారు

  గెటప్ శ్రీను రెండు చెంపలు వాయించేశారు

  అయితే నాకు ఎలాంటి బాధ ఉన్నా కూడా ముందుగా చెప్పుకునేది గెటప్ శ్రీను అన్నతోనే. అన్నా.. నాకు ఎలానో అనిపిస్తోంది. చచ్చిపోవాలని ఉందని ఒక మాట చెప్పడంతో ఆయన ఏమి అనకుండా ఒక్కసారి ఇంటికి రమ్మని పిలిచారు. నేను ఇంటికి వెళ్లగానే గెటప్ శ్రీను రెండు చెంపలు వాయించేశారు. అలాంటి తప్పుడు ఆలోచనలు పెట్టుకోవద్దని చాలా చెప్పారు.

  విషయం పూరి జగన్నాథ్ వరకు వెళ్లింది..

  విషయం పూరి జగన్నాథ్ వరకు వెళ్లింది..

  ఇక నాతో మాట్లాడిన తరువాత గెటప్ శ్రీను, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు ఫోన్ చేశారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు కూడా చాలా బూస్ట్ ఇచ్చాయి. నీ జీవితం ఒక సినిమా లాంటిది. అందులో నువ్వే హీరో. అప్పుడప్పుడు సినిమాలు హిట్టవుతాయి.. ప్లాప్ అవుతాయి.. అంటూ పూరి జగన్నాథ్ టెన్షన్ పడవద్దని అన్నారు. అంతే కాకుండా నీ టైమ్ వచ్చే వరకు వేయిట్ చెయ్యాలి అన్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. ఒక విధంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ అవినాష్ వివరణ ఇచ్చాడు.

  English summary
  Bigg Boss Season 4 has successfully completed a total of 105 days of travel. Bigg Boss, which received a lot of craze as the biggest reality show in the middle of this season, gave some entertainment in the final but never before. Abhijit won the season 4 as expected. However, the Bigg Boss show has set a new record for most votes cast
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X