‘ఆఫర్ కోసం లిప్‌లాకా? అందులో ఫెయిలైతే సూసైడ్ చేసుకొంటారా?’
యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ, టిక్ టాక్ భాను తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తనదైన శైలిలో వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటూ వచ్చింది. సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ గా సంపాదించుకున్న క్రేజ్ తో ఆమె తెలుగు పాపులర్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో జబర్దస్త్ వేదికపై హైపర్ ఆది టీమ్ లో పలు స్కిట్లలో మెరిసి నవ్వులు పూయించింది. ఇలా టీవీ రంగంలోనూ కాస్తా సందడి చేస్తూ కనిపించింది.
ఇక తాజా టిక్ టాక్ భాను జబర్దస్త్ వర్ష కొద్దిరోజులు హోస్ట్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ షోకు గెస్ట్ గా హాజరైంది. ఈ సందర్భంగా తన కుటుంబం గురించి, ఫిల్మ్ కెరీర్ గురించి, తన బాయ్ ఫ్రెండ్ గురించి, తన వ్యక్తిగత విషయాలపై ఆసక్తికరంగా స్పందించింది. ఈ తాజాగా కిస్సిక్ టాక్స్ లేటెస్ట్ ప్రోమోను విడుదల చేయడంతో ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. జబర్దస్త్ వర్ష భానుకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడంతో పాటు పలు ఆసక్తికరమైన ప్రశ్నలను సంధించడం ఆసక్తికరంగా మారింది.

భాను మాట్లాడుతూ.. నేను కారు డ్రైవింగ్ బాగానే చేస్తాను. కానీ మా అమ్మ ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ అస్సలు చేయను. ఇప్పటి వరకు ఒక్క ఛలాన్ కూడా కట్టలేదు. అయితే ఇప్పుడైతే నాకు పేరెంట్స్ ఉన్నారు కానీ, రేపు పెళ్లైతే నా భరించే వారి పరిస్థితి ఎలా ఉంటుందనేది తలుచుకుంటేనే కంగారుగా ఉంది. ఇక నాకు టిక్ టాక్, ఇతర సోషల్ మీడియాల ద్వారా పెద్ద ఒరిగిందేమీ లేదని అనిపిస్తుంది. కానీ నాకు మంచి ప్లాట్ ఫ్లామ్ ఇచ్చి, జనాల వరకు తీసుకెళ్లి రీచ్ ఇచ్చింది మాత్రం ఆది.
ఇక నేను ఇప్పుడు అమ్మ వాళ్లతో విజయవాడలో ఉంటున్నాను. పుట్టింది గుంటూరు దగ్గర వీణుకొండలో పుట్టాను. దసరా సందర్భంగా 9 రోజులలో ఒక రోజు తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటాను. కానీ శివయ్య అంటే చాలా ఇష్టం. ఇక మా అమ్మ నాగదేవత, నాగేంద్ర స్వామికి పెద్ద గుడి కట్టిస్తున్నారు. ఆ గుడి కట్టిన తర్వాత నాకు పెళ్లి చేయాలనేది వారి ఆలోచన. ప్రస్తుతం నేను మంచి హెల్తీ రిలేషన్ షిప్ లో ఉన్నాను. ఇక నాకు కెరీర్ కంటే, సినిమాల కంటే కూడా నా బాయ్ ఫ్రెండ్ అంటేనే ముఖ్యం. అదే మా తల్లిదండ్రుల విషయానికొస్తే నా బాయ్ ఫ్రెండ్ కంటే ముందు కూడా అమ్మనాన్నలే ఇష్టం. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మనే అందుకు కారణం. అది నేను మర్చిపోలేను.
నాకు ఆన్ స్క్రీన్ లో లిప్ లాక్ ఆఫర్ వచ్చినా అస్సలు చేయను. ఇక నాకు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోల కింద పలు రకాల కామెంట్స్ వస్తుంటాయి. నీకు సినిమా ఆఫర్లు రావాలని ఇలా చేస్తున్నావా? నువ్వు అలా చేస్తే సినిమా ఆఫర్లు రావని అంటుంటారు. అసలు మిమ్మల్ని సినిమా ఆఫర్లు ఎవడ్రా అడిగారు. ఈ విషయం నాకు అస్సలు అర్థం కాదు. ఇక లైఫ్ లో మనం చేయాలనుకున్నవి చేయపోయినా, లవ్ లో కానీ, స్టడీస్ లో ఫెయిల్ అయినా సూసైడ్ మాత్రం చేసుకోవద్దు. అది చాలా తప్పు. ఇక నేను లండన్ లో ఉన్నప్పుడు మా అమ్మనాన్నలను చాలా మిస్ అయ్యాను. అక్కడ చదువుకోవడానికి వెళ్లాను. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత మా అమ్మ కోసం ప్రతిరోజూ ఏడ్చేదాన్ని.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 27న రాత్రి 7 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications











