twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jabardasth: అవసరానికి వాడుకొని వదిలేశారు.. అతడి వల్లే జబర్దస్త్ షో వదిలేశా: అప్పారావు ఎమోషనల్

    |

    జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును అందుకున్న కమెడియన్స్ చాలా వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు అందుకుంటూ ఉన్న విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ షో లో ఉన్నన్ని రోజులు కూడా కొంతమంది షో ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడ్డారు అయితే అవసరం ఉన్నన్ని రోజులు వాడుకొని ఆ తరువాత బయటకు పంపేశారు అని కామెంట్ చేసిన వారు ఉన్నారు. ఇక జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన వారిలో అప్పారావు కూడా షోపై పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి ఒక వ్యక్తి కూడా మరొక కారణం అని తెలియజేశాడు పూర్తి వివరాల్లోకి వెళితే..

    టాప్ కామేడి షోగా..

    టాప్ కామేడి షోగా..

    2013లో మొదలైన జబర్దస్త్ షో కొన్నాళ్ళకే మంచి క్రేజ్ అందుకుని అత్యధిక టిఆర్పి కూడా సొంతం చేసుకుంది. దాదాపు గత మూడేళ్ళ వరకు కూడా ఈ జబర్దస్త్ టాప్ రేటింగ్స్ అందుకున్న రియాల్టీషో గా గుర్తింపుతో ఉంది. ఒకవిధంగా మల్లెమాల సంస్థకు మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఆర్థికంగా కూడా అన్ని షో ల కంటే కూడా ఎక్కువ లాభాలను అందించింది. దీంతో జబర్దస్త్ లో అవకాశాలు దక్కించుకోవాలనే చాలా మంది పోటీపడ్డారు.

    జబర్దస్త్ తెరవెనుక

    జబర్దస్త్ తెరవెనుక

    అయితే ఒకానొక దశలో జబర్దస్త్ నుంచి కొంతమంది అసంతృప్తితోనే బయటకు వచ్చినట్లుగా అర్థమయింది. కొంతమంది సినిమా అవకాశాల కోసం బయటకు వస్తే మరికొందరికి మాత్రం షో వెనకాల ఉన్న కొంతమంది కారణంగా బయటకు వచ్చేసినట్లు బహిరంగంగా గానే వివరణ ఇచ్చారు. అందులో కొంతమంది కారణంగా షో మేనేజ్మెంట్ మొత్తం తప్పుదోవ పడుతోంది అని కూడా విమర్శలు చేశారు.

    నాగబాబు బయటకు రావడంతో..

    నాగబాబు బయటకు రావడంతో..

    నాగబాబు బయటకు వెళ్లిపోయేటప్పుడు జబర్దస్త్ షో పై చాలా విమర్శలు వచ్చాయి. అందులో ఎంతగానో కష్టపడే దర్శకులకు కూడా సరైన పారితోషికాలు ఇవ్వరు అని ఎదిగే వారిని కూడా కొందరు కావాలని తొక్కేస్తున్నారు అని కూడా విమర్శలు వచ్చాయి అయితే ఆ విషయంలో మల్లెమాల మేనేజ్మెంట్ కూడా పెద్దగా స్పందించకపోవడంతో నే నాగబాబు బయటకు వచ్చినట్లుగా కథనాలు వెలువడ్డాయి.

    ఆ ఇద్దరి వల్ల గుర్తింపు

    ఆ ఇద్దరి వల్ల గుర్తింపు

    ఇక రీసెంట్ గా వచ్చిన ఇంటర్వ్యూలో అప్పారావు కూడా జబర్దస్త్ షో తెరవెనుక జరిగే కొన్ని విషయాలపై ఓపెన్ గానే వివరణ ఇచ్చారు. మొదట తాను ఎవరి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే జబర్దస్త్ షో ద్వారా క్రేజ్ అందుకున్నాను అంటూ మొదట షకలక శంకర్ చాలా సపోర్ట్ చేయడంతోనే అతని టైమ్ లో మంచి గుర్తింపు వచ్చింది అని అన్నారు ఆ తర్వాత చలాకి చంటి టీమ్ లో కూడా వర్క్ చేసినప్పుడు మంచి గుర్తింపు వచ్చిందని వారిద్దరు కూడా తన కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడ్డారని అన్నారు.

    బుల్లెట్ భాస్కర్ ప్రాధాన్యత ఇవ్వడు

    బుల్లెట్ భాస్కర్ ప్రాధాన్యత ఇవ్వడు

    అయితే గ్రూప్ లీడర్ గాడ్ చేసినప్పుడు నా వయసు రీత్యా అంత ఒత్తిడి తీసుకోవడం కరెక్ట్ కాదు అని దర్శకులు చెప్పడంతో వారి మాటకు విలువ నిచ్చే నేను వెనక్కి తగ్గాను. ఆ తర్వాత కరోనా కారణంగా కొన్ని రోజులు నన్ను దూరం పెట్టారు. మళ్ళీ తనే వెళ్ళి అడగడంతో బుల్లెట్ భాస్కర్ టీమ్ లో జాయిన్ చేస్తాను అన్నారు. కానీ అతని టీమ్ లో నేను చేయనని చెప్పాను. ఎందుకంటే అతను తన క్యారెక్టర్ మాత్రమే హైలెట్ చేసుకుంటాడు అని మిగతా వారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడు.. అని అప్పారావు చెప్పారు.

    అవసరం ఉన్నన్ని రోజులు వాడుకొని..

    అవసరం ఉన్నన్ని రోజులు వాడుకొని..

    ఇక బుల్లెట్ భాస్కర్ కారణంగా జబర్దస్త్ షో వదిలేయాలని అనుకున్నాను. ఆ తర్వాత రాకింగ్ రాకేష్ టీమ్ లో వేస్తామని అన్నప్పుడు పారితోషికం విషయంలో కొంత అసంతృప్తి చెందాను. రేటింగ్ బాగా తగ్గిపోవడం వలన టీం లీడర్స్ మాత్రమే మీకు అమౌంట్ అడ్జస్ట్ చేస్తారు అని అన్నప్పుడు కొంత అసంతృప్తి చెందాను. ఇక అప్పుడే వేరే ఆఫర్లు రావడంతో బయటకు వచ్చాను. అయితే NOC కావాలి అని అడిగినప్పుడు కనీసం తనను ఎందుకు వెళ్ళిపోతున్నారు అనే విషయం కూడా మేనేజ్మెంట్ అడగలేదు.. అని అవసరం ఉన్నన్ని రోజులు వాడుకొని వదిలేశారు అని అప్పారావు ఆవేదన చెందాడు.

    English summary
    Jabardasth comedian apparao shocking comments on show management
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X