ఆడదానివి ఆ పని చేయకూడదు.. జబర్దస్త్ వర్షపై బుల్లెట్ భాస్కర్ ఫైర్
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను దశాబ్దానికి పైగా జబర్దస్త్ కామెడీ షో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా ఎలాంటి గుర్తింపు లేని ఎంతో మంది ఆర్టిస్టులు సెలబ్రెటీలుగా మారిపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం హీరోలుగా, దర్శకులుగా, టాప్ స్టార్ యాంకర్లుగా మారి ప్రేక్షకులను పెద్ద పెద్ద వేదికలు, వెండితెరపై అలరిస్తూ వస్తున్నారు. జబర్దస్త్ ద్వారా మంచి పేరు సంపాదించుకొని ఆర్టిస్టులు ఉన్నతమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. ఎంతో మంది జబర్దస్త్ వేదికకు వస్తూ వెళ్తున్నారు. కానీ జబర్దస్త్ కామెడీ షో మాత్రం నిర్విరామంగా కొనసాగూతూనే వస్తోంది.
ఎంత మంది జడ్జీలుగా మారినా, కంటెస్టెంట్లుగా మారిన జబర్దస్త్ కామెడీ షో ప్రదర్శనలో ఎలాంటి మార్పులు లేకుండా ముందుకు సాగుతోంది. ఈ విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ కామెడీ షోకు సంబంధించిన తాజా ప్రోమో యథావిధంగా విడుదలైంది. సెప్టెంబర్ 26వ తేదీన, సెప్టెంబర్ 27వ తేదీన ప్రసారం కానున్న ఫుల్ ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రోమోను జబర్దస్త్ టీమ్ తాజాగా విడుదల చేసింది. ఎప్పటిలాగే ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. టీమ్ లీడర్లు సరికొత్త కామెడీని అందించేందుకు ప్రయత్నించారనేది తెలుస్తోంది.

ఇక జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ వర్ష కలిసి చేసిన స్కిట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్లుగా జబర్దస్త్ వర్ష బుల్లెట్ భాస్కర్ టీమ్ లో లేడీ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీళ్లు ఇద్దరూ సోషల్ ఎలిమెంట్స్ ను తీసుకుంటూ కామెడీ రూపకంలో పలు సందేశాత్మక స్కిట్లను జబర్దస్త్ వేదికపై ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వీరు చేసిన స్కిట్ ప్రోమోలో హైలెట్ గా నిలిచింది.
వీరిద్దరూ ముందు లవర్స్ గా కనిపిస్తారు. పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఉద్యోగం చేసిన డబ్బులు ఖర్చుల పెడుదాం. నువ్వు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బులు అకౌంట్ లో సేవ్ చేసుకొందామని వర్ష బుల్టెట్ భాస్కర్ తో అంటుంది. దాంతో బుల్లెట్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేస్తారు. ఆడది పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండాలి. మగాడు సంపాదించాలి అంటూ తన డైలాగ్ చెబుతాడు. దాంతో వర్ష నేను ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేదంటే కుదరదు అంటుంది. ఆ వెంటనే బుల్లెట్ భాస్కర్ బ్రేకప్ చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తన స్కిట్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాడు.
అయితే ప్రస్తుతం సోసైటీలోని అంశాన్ని ఇలా స్కిట్ రూపంలో చూపించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో నరేశ్, ఫైమా, తదితర ఆర్టిస్టులతో నవ్వులు పూయించారు. పూర్తి ఎపిసోడ్ లో ఫుల్ స్కిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మిగితా టీమ్ లీడర్లు వెంకీ, రాకెట్ రాఘవా, రామ్ ప్రసాద్, నూకరాజు తమ స్కిట్లో నవ్వించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ వారం ప్రసారం కాబోయే ఫుల్ ఎపిసోడ్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. ఈ షోకు జడ్జీలుగా కృష్ణ భగవాన్, ఖుష్బూ వ్యవహరించారు. యాంకర్లుగా మానస్, రష్మీ గౌతమ్ షోను నడిపించారు.


Click it and Unblock the Notifications











