»   » సీక్రెట్‌గా హైపర్ ఆది పెళ్లి.. ఎవరిని చేసుకొన్నాడో తెలుసా?

సీక్రెట్‌గా హైపర్ ఆది పెళ్లి.. ఎవరిని చేసుకొన్నాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుల్లితెర మీద విశేషంగా రాణిస్తున్న యువ కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. ఆయన వేసే కామెడి పంచులు, డైలాగులు బ్రహ్మండంగా పేలుతాయి. అందుకే బుల్లితెర ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఫాలోయింగ్ ఆదికి ఉంది. ప్రస్తుతం నాలుగైదు టీవీ షోలలో పాల్లొంటూ ఆయన యమ బిజీగా మారిపోయారు. బుల్లితెర మీద దూసుకెళ్తున్న ఆది సీక్రెట్‌గా వివాహం చేసుకోవడం చర్చనీయాంశమైంది. అత్యంత గోప్యంగా వివాహం చేసుకోవడం వెనుక వివరాలు అందుబాటులోకి రాలేదు.

స్టార్ కమెడియన్ హైపర్ ఆది సీక్రెట్ వివాహం

స్టార్ కమెడియన్ హైపర్ ఆది సీక్రెట్ వివాహం

టెలివిజన్ రియాలిటీ షోలో స్టార్ కమెడియన్‌గా మారిన హైపర్ ఆది తన స్నేహితురాలితో గత కొద్దికాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాడనే తాజా సమాచారం. కొన్నేండ్లుగా సాగుతున్న సంబంధాన్ని ఇటీవల వివాహ బంధంగా మార్చుకొన్నట్టు తెలిసింది.

Jabardasth Hyper Aadi Spoof On Trivikram Srinivas : Part 2 | Filmibeat Telugu
సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం

సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం

అత్యంత గోప్యంగా జరిగిన ఈ వివాహ వేడుకు తనకు సన్నిహితులైన కొద్దిమందిని ఆది ఆహ్వానించినట్టు తెలిసింది. సీక్రెట్‌గా జరిగిన పెళ్లికి సంబంధించిన ఫొటోలు కొందరికి చిక్కాయి. అయితే ఇప్పటివరకు తన వివాహంపై వస్తున్న వార్తలను ఆది ఖండించకపోవడం గమనార్హం.

పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా..

పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా..

ఇరు కుటుంబాల ఇష్టాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం కారణంగానే ఆది మౌనం వహిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆ సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే తన వివాహం ప్రకటన చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

జబర్దస్త్‌తో నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఆది

జబర్దస్త్‌తో నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఆది

ప్రస్తుతం ఆది జబర్దస్త్ సిరీస్ షోతో ప్రేక్షకుల్లో నవ్వులు పువ్వులు పూయిస్తున్నాడు. ఈ కార్యక్రమంపై అనేక విమర్శలు వెల్లువెత్తున్నప్పటికీ హైపర్ ఆది తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. దీంతో టీవీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా పేరును సంపాదించుకొన్నాడు.

English summary
Hyper Aadi name become household after Jabardasth TV Show. He talented actor familiar to everyone for the Television audiences.The comedian has married secretly by inviting limited guests to the event. Few people have found a leaked picture of his from the wedding.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X