twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jabardasth comedians remuneration షాకింగ్‌గా క్వాలిఫికేషన్స్: చదువుతో సంబంధం లేకుండా భారీగా సంపాదన!

    |

    ప్రస్తుతం బుల్లితెర ప్రపంచంలో టాప్ కామెడీ షోగా రేటింగ్ అందుకుంటున్న జబర్దస్త్ నుంచి ఎంతో మంది కమెడియన్స్ వెండితెర వైపు అడుగులు వేస్తున్నారు. ఒక విధంగా చిన్నపాటి కమెడియన్స్ కు స్కూల్ తరహాలో జబర్దస్త్ హెల్ప్ అవుతోంది. మధ్యమధ్యలో విబేధాల వలన కొంతమంది ఈ షోను వదిలెస్టిన్నారు. ఇక మొదట్లో వచ్చిన కొంతమంది అలానే సినిమాలు చేసుకుంటూ మరోవైపు జబర్దస్త్ లో స్కిట్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక జబర్దస్త్ ద్వారా క్రేజ్ అందుకున్న కమెడియన్స్ రెమ్యునరేషన్ గురించి నిత్యం ఏదో ఒక టాక్ వస్తూనే ఉంటుంది..

    అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి మాత్రం బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. చదువు మధ్యలో ఆపేసి వచ్చి ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ అందులో డిగ్రీ పట్టాలు సాఫ్ట్ వేర్ జాబ్ లు వదిలేసుకున్న వారు కూడా ఉన్నారు. యాంకర్ నుంచి కమెడియన్స్ వరకు అందరు కూడా ఉన్నత చదువులను పక్కనపెట్టి వారికి నచ్చిన దారిలో అడుగులు వేస్తూ భారీగా ఆదాయం అనుకుంటున్నారు.

    ఒక్క రోజు షూట్ లో ఎన్ని స్కిట్స్ చేస్తారంటే..

    ఒక్క రోజు షూట్ లో ఎన్ని స్కిట్స్ చేస్తారంటే..

    సాధారణంగా జబర్దస్త్ షూటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకే రోజు మూడు స్కిట్స్ చేయాల్సి ఉంటుంది. కుదిరితే కొన్ని కొన్ని సార్లు నాలుగు స్కిట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు మూడు వారాలకు సరిపడా ఎపిసోడ్స్ ను ఒక్కరోజులోనే అందించాల్సి ఉంటుంది. అందరూ కూడా వారం మొత్తం కష్టపడే స్కిట్ లు తయారు చేస్తూ ఉంటారు. ఇక వారు మల్లెమాల సంస్థలోనే ఉంటూ షూటింగ్ కు సంబంధించిన ప్లాన్ ను కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు.

    జడ్జీల రెమ్యునరేషన్ ఎంతంటే..

    జడ్జీల రెమ్యునరేషన్ ఎంతంటే..

    ఇక షోలో పాల్గొనే జడ్జిలకు రెమ్యునరేషన్ ఇస్తారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి కూడా నాగబాబు రోజా జబర్దస్త్ షో కి న్యాయానిర్ణేతలుగా కొనసాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదట నాగబాబుకు 25 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవారు. ఇక ఆ తర్వాత రోజా కూడా 15 నుంచి 20 లక్షల వరకు తీసుకునేవారు. ఇక నాగబాబు వెళ్లిపోయిన అనంతరం సింగర్ మనో వచ్చారు. ఆయనకి 12లక్షల వరకు ఇస్తున్నట్లు సమాచారం.

    యాంకర్స్ రెమ్యునరేషన్ ఎంతంటే..

    యాంకర్స్ రెమ్యునరేషన్ ఎంతంటే..

    ఇక యాంకర్స్ విషయానికి వస్తే ఒకవైపు జబర్దస్త్, మరోవైపు ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ కవర్ చేస్తున్న అనసూయ, రష్మీ ఇద్దరు కూడా ఉన్నతమైన చదువులు చదువుకున్న వారే. అనసూయ ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఒక ఎపిసోడ్ కు 4 నుంచి 5 లక్షల మధ్యలో పారితోషకం పొందుతున్నట్లు సమాచారం యాంకర్ రష్మి గౌతమ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ఆమెకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మధ్యలో పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

     సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను వదిలేసి..

    సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను వదిలేసి..

    ఇక మిగతా కమెడియన్స్ విషయానికి వస్తే హైపర్ ఆది బీటెక్ చదువు పూర్తి చేసి కొన్నాళ్ళు సాఫ్ట్ వేర్ కూడా జాబ్ చేశాడు. అతనికి ప్రస్తుతం మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల మధ్యలో జీతం అందుతోంది. రాకెట్ రాఘవ డిగ్రీ కంప్లీట్ చేశాక కొన్నాళ్లపాటు టీచర్ వృత్తి కోసం శిక్షణ కూడా తీసుకున్నాడు. రంగస్థలం మహేష్ కూడా మొదట జబర్దస్త్ ద్వారానే గుర్తింపు అందుకున్నాడు అతను డిగ్రీ పూర్తిచేశాడు. బుల్లెట్ భాస్కర్ డిగ్రీ ఫినిష్ చేశాడు. ఇతనికి 2.5లక్షల వరకు జీతం అందుకుంటున్నట్లు టాక్.

    సుడిగాలి టీమ్.. చదువులు.. జీతాలు

    సుడిగాలి టీమ్.. చదువులు.. జీతాలు

    సుడిగాడు సుధీర్, సుడిగాలి సుధీర్ ఇద్దరు కుడ ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్నాడు. వీళ్ళిద్దరికి కూడా మూడు లక్షలకు వరకు రెమ్యునరేషన్ అందుతున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి టీమ్ లోనే ఉండే ఆటో రాంప్రసాద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకొని ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. అతనికి ప్రస్తుతం రెండు లక్షల వరకు పారితోషకం వస్తోందట.సినిమాలు కూడా అతను రైటర్ గా వర్క్ చేస్తున్నాడు.

    చదువును మధ్యలోనే వదిలేసిన వాళ్ళు..

    చదువును మధ్యలోనే వదిలేసిన వాళ్ళు..

    కెవ్వు కార్తీక్ డిగ్రీ పూర్తి చేయగా అదుర్స్ ఆనంద్ ఎంసీఏ కోర్సును మధ్యలోనే వదిలేసి జబర్దస్త్ వైపు అడుగులు వేశాడు. వీరికి లక్ష వరకు పారితోషికం అందుతోంది. చలాకి చంటి కూడా డిగ్రీ ని మధ్యలోనే వదిలేశాడు. నాటి నరేష్ కూడా అదే తరహాలో చదువు మధ్యలో ఆపేసి జబర్దస్త్ వచ్చేశాడు. తాగుబోతు రమేష్ మాత్రం స్కూల్ దశలోనే చదువుకో పుల్ స్టాప్ పెట్టి సినిమాల వైపు అడుగులు వేశాడు. ఇక వీరికి లక్షకు పైగానే అందుతున్నట్లు సమాచారం.

    Recommended Video

    Naga Chaitanya Samantha విడాకులు వివాదానికి చెక్.. ఎందుకీ లొల్లి !
    డాక్టరేట్ అందుకున్న సుధాకర్

    డాక్టరేట్ అందుకున్న సుధాకర్

    ఇక బుల్లెట్ భాస్కర్ టీమ్ సభ్యుడు గాలిపటాల సుధాకర్ జబర్దస్త్ లో అడుగు పెట్టిన అనంతరం మొత్తంగా 5వేలకు పైగా షోలను పూర్తి చేయడంతో రాయల్ అకాడమీ ఆర్ట్స్ యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ను అందించింది. ఇక ఆ అవార్డు దుబాయిలో ఓ కార్యక్రమంలో అందుకున్నాడు. జబర్దస్త్ అనంతరం సుధాకర్ ఎక్కువగా స్టేజ్ షోలతోనే ఆదాయాన్ని పెంచుకున్నాడు. అతనికి కూడా లక్ష వరకు ఆదాయం అందుతోంది.

    English summary
    Jabardasth comedians education qualifications and remuneration details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X