విజయం కాదు.. మగాడి సమాధి వెనకాల ఆడది.. జబర్దస్త్‌లో బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
బుల్లితెర ప్రేక్షకులకు తెలుగు కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దశాబ్దానికి పైగా జబర్దస్త్ కామెడీ షో తెలుగు టీవీ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోంది. రీసెంట్ గానే 12 ఏళ్ల సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. దీంతో సరికొత్తగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా కామెడీని అందించేందుకు నిర్వాహకులు, కమెడియన్లు సిద్ధం అయ్యారు. ఆ విధంగా తమ స్కిట్లతో ప్రతి వారం నవ్విస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జబర్దస్త్ కామెడీ షోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో ప్రతి ఆర్టిస్ట్ తమ స్కిట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా బుల్లెట్ భాస్కర్ స్కిట్ మాత్రం ఆసక్తికరంగా మారింది.
ప్రొమో ప్రకారం.. మొదటగా రాకింగ్ రాకేష్, సుజాత తమ కామెడీ స్కిట్ ను ప్రదర్శించారు. తమ పంచులు, మ్యానరిజంతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ రియల్ లైఫ్ లో భార్య భర్తలు అనే సంగతి తెలిసిందే. ఇక జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లో కూడా భార్యభర్తలుగానే స్కిట్ చేశారు. భర్తపై భార్య వేసే పంచులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ తర్వాత ఆటో రామ్ ప్రసాద్ జబర్దస్త్ వేదికపై వైల్డ్ యానిమల్స్ ఫొటోలను ప్రదర్శించి సరికొత్త స్కిట్ ను నడిపించారు. ఆయన పంచ్ లైన్స్ తో ఆకట్టుకున్నారు. నెక్ట్స్ నూకరాజు, జబర్దస్త్ వర్ష తనదైన స్కిట్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. మరోవైపు గాలిపటాల సుధాకర్, అప్పారావు తమదైన శైలిలో కామెడీని పంచుతున్నట్టు ప్రోమోలో చూపించారు.

ఇక బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ వర్ష, ఫైమా కలిసి ఒక స్కిట్ చేశారు.ఇద్దరు లేడీ కంటెస్టెంట్లతో బుల్లెట్ భాస్కర్ చేసిన స్కిట్ ప్రోమోలో హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రేక్షకులకు కళ్లకుకట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారనిపించింది. అయితే జబర్దస్త్ వర్ష స్కిట్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్ ను ఒక ప్రశ్న అడుగుతుంది. మగవాళ్లు శుభ్రంగా ఉంటారా? ఆడవాళ్లు శుభ్రంగా ఉంటారా? అని అడుగుతుంది. అందుకు భాస్కర్ ప్రపంచం మొత్తంలో మగవాళ్లే శుభ్రంగా ఉంటారని చెబుతాడు. మేం సెలూన్ షాప్ కు వెళ్లి ఇంట్లోకి స్నానం చేసి మాత్రమే వస్తాం, మీరు బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఏ రోజైనా మొహమైనా కడుక్కోని ఇంట్లోకి వస్తారా? అని ఉదాహరణతో చెబుతాడు.
ఆ తర్వాత వర్ష మరో ప్రశ్న అడుగుతుంది. ఒకప్పుడు ప్రతి మగాడి విజయం వెనకాల ఆడదే ఉందని అంటున్నారు. మరీ ఇప్పుడు ఏమని అంటున్నారని అంటుంది. ఇక బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో భాగంగా స్పందిస్తూ ఇప్పుడు పెళ్లైనా మొగాడి సమాధి వెనకాల ఆడదే ఉంటుందమ్మా అంటూ చేతులెత్తి నమస్కరిస్తూ చెబుతాడు. ఆ తర్వాత స్కిట్ లోకి జబర్దస్త్ ఫైమా ఎంట్రీ ఇస్తుంది. తనకు ఆల్రెడీ పెళ్లైనట్టు తన భర్తను డ్రమ్ లో పడేసి చింపేసినట్టు, ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ కోసమే ఇలా చేశానని చెప్పడం, చివరి బుల్లెట్ భాస్కర్ ను కూడా డ్రమ్ లోకి ఎక్కించడమంతా సోషల్ ఇష్యూస్ ను చూపించే ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది.
ఇక బబర్దస్త్ కామెడీ షో లేటెస్ట్ ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 5న, సెప్టెంబర్ 6న ఈటీవీలో ప్రసారం కానుంది. ఈ షోకు సీనియర్ నటి ఖుష్బూ, సీనియర్ కమెడియన్ నటుడు కృష్ణ భగవాన్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. యాంకర్లుగా రష్మీ గౌతమ్, మానస్ లు వ్యవహరిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











