హైపర్ ఆది మార్కుల షీట్ చూశారా? 10th, ఇంటర్‌లో మార్కులు చూస్తే షాకే!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం దాదాపు 12 ఏళ్లుగా తెలుగు ప్రజలను నవ్విస్తోంది. ఎంతో మంది ప్రతిభావంతులకు ఫ్లాట్‌ఫాంగా మారి వారి కెరీర్‌ను నిలబెట్టింది. జబర్దస్త్ ద్వారా పరిచయమైన యాంకర్లు, కమెడియన్లు.. నేడు చిత్ర పరిశ్రమలో టాప్ రేంజ్‌లో ఉన్నారు. యాంకర్లు, జడ్జిలు, కమెడియన్లు మారినా నేటికీ తెలుగు బుల్లితెరపై తన డామినేషన్ కొనసాగిస్తోంది జబర్దస్త్. అలా జబర్దస్త్ ద్వారా పరిచయమైన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు.

పంచ్‌లతో కుమ్మేసే హైపర్ ఆది
తన పంచ్‌లు, ప్రాసలతో జబర్దస్త్ షోను తిరిగి నిలబెట్టి.. మరింత పాపులారిటీ తెచ్చిపెట్టాడు హైపర్ ఆది. తను ఎదుగుతూ తనతో పాటు తన టీమ్ మెంబర్స్‌ని కూడా స్టార్లుగా చేశాడు ఆది. ఎక్కడో ప్రకాశం జిల్లా చీమకుర్తి సమీపంలో ఓ మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి .. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పేరున్న సెలబ్రెటీగా ఎదిగాడు. బుల్లితెరతో పాటు వెండితెరపైనా రాణిస్తూ దూసుకెళ్తున్నాడు. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీలతో పాటు ఇతర తెలుగు పాపులర్ షోలలో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నాడు.

Jabardasth Fame Hyper Aadi Mark Sheet Memos Comedian Studies surprises you

జబర్దస్త్‌లో ఛాన్స్ ఇచ్చిన అదిరే అభి
తొలినాళ్లలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన హైపర్ ఆది.. తన కోసం తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చేందుకు కాస్త పొలం అమ్మి ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు. ఉద్యోగం చేస్తూనే సోషల్ మీడియాలో తన ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ వచ్చాడు. ఈ వీడియోలు అదిరే అభి వరకు చేరాయి. హైపర్ ఆది టైమింగ్, పంచ్‌లు, మేనరిజం బాగా నచ్చడంతో జబర్దస్త్‌లోని తన టీమ్‌లో ఆదికి అవకాశం కల్పించారు. తనకు ఈ స్థాయిని, ఇమేజ్‌ను ఇచ్చిన అదిరే అభి అన్న రుణాన్ని తీర్చుకోలేనని ఆది పలుమార్లు చెప్పాడు.

హైపర్ ఆదికి భారీగా ఆస్తులు
హైపర్ ఆది ఒక్కో స్కిట్ కోసం లక్ష రూపాయలకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటాడని బుల్లితెర వర్గాలు చెబుతుంటాయి. అలా దాదాపు పదేళ్లుగా బుల్లితెరపై అలరిస్తున్న హైపర్ ఆది బాగానే ఆస్తులు కూడబెట్టినట్లు టాక్. హైదరాబాద్‌లో ఖరీదైన ఫ్లాట్‌తో పాటు మరికొన్ని ఆస్తులు కూడా హైపర్ ఆది కొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన ఆస్తుల విలువ రూ.50 కోట్ల పైమాటేనని అంటారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఎంతో అభిమానిస్తారు. తన అభిమాన నటుడితో కలిసి పనిచేసే అవకాశం కూడా దక్కించుకున్నాడు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో ఆయన కోసం ప్రచారం చేశారు.

చదువులో టాప్
కాగా.. బుల్లితెర, వెండితెరపై తన ప్రతిభను నిరూపించుకున్న హైపర్ ఆది.. చదువులో ఎంతో ముందుండేవారు. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీలోని ఓ ఎపిసోడ్‌లో హైపర్ ఆది టెన్త్ క్లాస్ మార్కుల లిస్ట్‌ను స్క్రీన్‌పైన ప్రదర్శిస్తుంది యాంకర్ రష్మి. అందులో మొత్తం 600 మార్కులకు గాను ఆయనకు 10వ తరగతిలో 534 మార్క్స్ వచ్చాయి. తెలుగులో 85, ఇంగ్లీష్‌లో 87, మ్యాథమేటిక్స్‌‌లో 96, సైన్స్‌లో 94, సోషల్‌లో 92, హిందీలో 80 మార్కులు వచ్చాయని రష్మి చదివి వినిపించింది.

ఆది మార్కుల షీట్‌తో రష్మీ షాక్
అది చూసి అంతా అవాక్కయ్యారు. తాను 7వ తరగతిలోనూ స్కూల్ టాపర్ అని, ఇప్పటికీ నేను చదివిన స్కూల్‌కి వెళ్తే అక్కడ టాపర్స్ లిస్టులో నా పేరు ఉంటుందని హైపర్ ఆది భావోద్వేగానికి గురయ్యాడు. టెన్త్‌, ఇంటర్, బీటెక్‌లలో నాకు ఇంగ్లీష్‌లోనే మార్కులు తగ్గాయని లేదంటే మరో రేంజ్‌లో ఉండేదని ఇంటర్‌లో 945 వచ్చినట్లు ఆది తెలిపాడు. ఆ తర్వాత హైపర్ ఆదికి ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో టెస్ట్ చేసి నవ్వించింది రష్మి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. హైపర్ ఆది ప్రతిభను చూసి అంతా మెచ్చుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X