జబర్దస్త్ నూకరాజు మార్కుల షీట్ చూస్తే షాకే.. స్టడీస్ లో అలాంటి రిజల్ట్స్
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం తెలుగులో టాప్ కామెడీ షోగా నిలిచింది. దాదాపు 12 ఏళ్లుగా తెలుగువారిని నవ్విస్తూ.. ఎంతో మంది ప్రతిభావంతులుకు ఓ వేదికగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి టాలెంట్ ఉన్నవారిని ప్రజలకు పరిచయం చేసింది. జబర్దస్త్ నుంచి వెళ్లిన వారు హీరోలుగా, నటులుగా, రైటర్స్‌గా, దర్శకులుగా మారారు. జబర్దస్త్‌లో కమెడియన్లు, యాంకర్లు, జడ్జిలు మారినా ఈ షో మాత్రం ఇప్పటికీ టాప్‌లో కొనసాగుతోంది.
పవర్ ప్లాంట్‌లో జాబ్
జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో నూకరాజు కూడా ఒకరు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన వీరి కుటుంబం తర్వాత విజయవాడలో స్థిరపడింది. వీరి తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. నలుగురు పిల్లల్లో చిన్నవాడు కావడంతో నూకరాజును ఉన్నదాంట్లోనే చాలా గారాభంగా చూసుకునేవారు. చదువు పూర్తి చేసి విజయవాడ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగంలో చేరాడు నూకరాజు. గవర్నమెంట్ జాబ్ కావడంతో కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. అయితే నూకరాజుకు సినిమాలు, కామెడీ అంటే పిచ్చి కావడంతో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాడు.

గవర్నమెంట్ జాబ్ వదిలేసి కష్టాలు
ఆ తర్వాత జీ తెలుగులోనూ ఓ షోకి అవకాశం రావడంతో ఉద్యోగం చేస్తూనే ఈ షోలలో నటించేవాడు. అయితే టైమింగ్స్ సెట్ కాకపోవడం, విజయవాడ టూ హైదరాబాద్ ట్రావెలింగ్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న నూకరాజు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి తనకెంతో ఇష్టమైన సినీరంగం వైపే అడుగులు వేశాడు. బంగారం లాంటి గవర్నమెంట్ జాబ్‌ని వదిలేయడంతో నాన్న ఎంతో బాధపడ్డారు.
పటాస్‌తో లైఫ్ ఛేంజ్
కొద్దిరోజులకే నూకరాజు తల్లిదండ్రులు భయపడినదంతా జరిగింది. కామెడీ కిలాడీలు అనే కార్యక్రమాన్ని రెండో షెడ్యూల్‌కే ఆపేయడంతో నూకరాజు పరిస్థితి దారుణంగా తయారైంంది. కనీసం ఇంటి రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో కూలీ పనులకు వెళ్లేవాడు. 10 అంతస్తుల ఎత్తైన బిల్డింగ్‌కి ఇసుక, సిమెంట్, ఇటుకలు మోసుకుంటూ వెళ్లేవాడు. దాంతో భుజం వాచిపోయి.. కష్టాలు తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోదామనుకున్నాడు నూకరాజు. ఈ దశలో టీవీ ప్లస్‌లో వచ్చే పిట్టగోడ కామెడీ షో ఆడిషన్స్‌కి వెళ్లి సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత పటాస్ కామెడీ షోలో అవకాశం రావడంతో నూకరాజు జీవితం మారిపోయింది.
జబర్దస్త్‌లో పంచ్‌ల వర్షం
ఈ షోలో నూకరాజు- ఆసియా జంట చేసే కామెడీ కడుపుబ్బా నవ్వించింది. ఒకానొక దశలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆసియాతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలతో మరింత పాపులర్ అయ్యాడు నూకరాజు. తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో జబర్దస్త్‌లో అవకాశం దక్కించుకున్నాడు నూకరాజు. ఇక్కడా తను చేసిన స్కిట్లు బాగా పేలడంతో టాప్ పొజిషన్‌కి చేరుకున్నాడు.
డిప్లొమోలో టాపర్
ఇదిలాఉండగా.. జబర్దస్త్‌తో పాటు పలు ఛానెల్స్‌లో ప్రసారమయ్యే షోలలోనూ నూకరాజు పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ ఆకట్టుకుంటున్నాడు. ఓ రోజున శ్రీదేవి డ్రామా కంపెనీలో కంటెస్టెంట్ల మార్కుల లిస్టుల్ని యాంకర్ రష్మి గౌతమ్ స్క్రీన్ మీద ప్రదర్శించింది. వీటిలో నూకరాజు మార్కుల లిస్ట్ రాగా.. దానిని హైపర్ ఆది వివరించాడు. పదో తరగతిలో 600 మార్కులకు గాను నూకరాజుకు 490 మార్కులు వచ్చాయి. తెలుగులో 85, ఇంగ్లీష్‌లో 67, మ్యాథ్స్‌లో 87, సైన్స్‌లో 83, సోషల్ స్టడీస్‌లో 92, హిందీలో 76 మార్కులు వచ్చాయి. అది చూసి అందరూ నూకరాజును మెచ్చుకున్నారు. ఇక పాలిటెక్నిక్‌లోనూ మనోడు టాప్ లేపాడు. డిప్లొమోలో 82 పర్సెంటేజ్‌లో మార్కులు వచ్చాయని చెప్పడంతో ఇంద్రజ అవాక్కయ్యింది. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టమని ఎప్పుడూ 80 పైనే మార్కులు వచ్చేవని అలాగే ఇప్పుడు లా చదువుతున్నానని నూకరాజు చెప్పడంతో అందరూ ప్రశంసించారు.


Click it and Unblock the Notifications











