For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌ హౌస్‌లోకి జబర్ధస్త్ బ్యూటీ.. ఏ తప్పూ చేయలేదంటూ!

  |

  ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి పరిచయమై.. కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. హిందీలోకి ఎప్పుడో వచ్చిన ఇది.. తెలుగులో మాత్రం కొన్నేళ్ల క్రితమే మొదలైంది. ఆలస్యంగా వచ్చినా అసాధారణమైన స్పందనతో నేషనల్ లెవెల్‌లో రికార్డులు క్రియేట్ చేసిందిది. ఈ క్రమంలోనే నాలుగు సీజన్లను అదిరిపోయేలా ఫినీష్ చేసింది. ఇప్పుడు ఐదో సీజన్ కూడా మొదలైంది. అంగరంగ వైభవంగా జరుగుతోన్న ప్రీమియర్ ఎపిసోడ్‌లో ట్రాన్స్‌జెండ్ ప్రియాంక సింగ్ అలియాస్ జబర్ధస్త్ సాయితేజ తొమ్మిదవ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

  నాలుగు ఒకలా.. ఐదోది కొత్తగా అనేలా

  నాలుగు ఒకలా.. ఐదోది కొత్తగా అనేలా

  తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటి వరకూ నాలుగు సీజన్లను పూర్తి చేసుకోగా.. అవన్నీ ఒకదానికి మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే రేటింగ్‌ను సైతం భారీగా పెంచుకుంటూ దేశ వ్యాప్తంగా హవాను చూపించాయి. దీంతో ఐదో సీజన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. వాటిని అందుకునేలా ఈ సారి మరింత కొత్తగా దీన్ని ప్రసారం చేయబోతున్నారు.

  ఐదో సీజన్ ప్రారంభం.. మరింత జోష్‌తో

  ఐదో సీజన్ ప్రారంభం.. మరింత జోష్‌తో

  కోవిడ్ ప్రభావం కారణంగా బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రసారంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీంతో ఈ సారి ఈ రియాలిటీ షో ప్రారంభం కాదన్న టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అక్కినేని నాగార్జున సారథ్యంలో ఐదో సీజన్‌ను ఘనంగా మొదలైంది. గతంలో కంటే మరింత ఎక్కువ జోష్‌తో ప్రీమియర్ ఎపిసోడ్ సెప్టెంబర్ 5 అనగా ఆదివారం ప్రతి ఇంట్లో సందడి చేసేస్తోంది.

  ఈ సారి అందరూ అలాంటి వాళ్లే ఎంపిక

  ఈ సారి అందరూ అలాంటి వాళ్లే ఎంపిక

  తెలుగులోబిగ్ బాస్ షో ఎంత సక్సెస్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే ఈ సారి ప్రసారం అవుతున్న సీజన్ కోసం నిర్వహకులు ఫేమస్ అయిన కంటెస్టెంట్లనే ఎంపిక చేసుకున్నారు. బుల్లితెరపై సందడి చేసే నటీనటులు, యాంకర్లతో పాటు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారికి పెద్దపీట వేశారు. వీళ్లంతా చాలా రోజులుగా క్వారంటైన్‌లో ఉండి వచ్చారు.

  హౌస్‌లో అడుగు పెట్టిన ప్రియాంక సింగ్

  హౌస్‌లో అడుగు పెట్టిన ప్రియాంక సింగ్

  బిగ్ బాస్ ఐదో సీజన్‌ ప్రీమియర్ ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. హోస్ట్ నాగార్జున సారథ్యంలో కంటెస్టెంట్లు తమదైన శైలి ప్రదర్శనలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్ధస్త్‌ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ట్రాన్స్‌జెండర్ సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్ తాజాగా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. ఈమె ఏ తప్పూ చేయలేదని ప్యారెంట్స్‌కు సారీ చెప్పింది.

  జబర్ధస్త్ బ్యూటీకి ఊహించని అవకాశం

  జబర్ధస్త్ బ్యూటీకి ఊహించని అవకాశం

  బిగ్ బాస్ నిర్వహకులు ప్రతి సీజన్‌లోనూ ఓ స్పెషల్ కంటెస్టెంట్‌ను తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలోనే మూడో సీజన్‌లో టాన్స్‌జెండర్ తమన్నాను కంటెస్టెంట్‌గా ఎంపిక చేశారు. అలాగే, ఇప్పుడు ప్రియాంక సింగ్‌కు ఊహించని విధంగా ఆఫర్ ఇచ్చారు. ట్రాన్స్‌జెండర్‌గా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటోన్న ఆమె తన సత్తాను నిరూపించడానికి ఇది చక్కని అవకాశం అనే చెప్పాలి.

  Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
  అలా ఉండేవాడు.. ఇలా మారిపోయాడు

  అలా ఉండేవాడు.. ఇలా మారిపోయాడు

  జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్నాడు సాయితేజ. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో జెండర్‌ను మార్చుకోవాలన్న కోరికతో ఆ తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. అలాగే, ఇప్పుడు గతంలో మాదిరిగా అవకాశాలను కూడా అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series. This Show 5th Seasn Premiere Episode Started Today. Now Priyanka Singh Entered into Bigg Boss House.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X