Don't Miss!
- Sports
IND vs NZ: ఇషాన్ కిషన్ పిల్ల చేష్టలపై ఐసీసీ సీరియస్.. కాపాడిన అంపైర్లు! లేకుంటే..?
- News
ఎమ్మెల్యేల ఎరకేసు: బీఎల్ సంతోష్, తుషార్ లకు సిట్ నోటీసులపై స్టే పొడిగింపు; ఎప్పటివరకంటే!!
- Finance
IPO Stock: చెలరేగిపోతున్న స్టాక్.. నెలలోనే షేరుకు రూ.100 లాభం.. మీ దర్గర ఉందా..?
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Automobiles
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Jabardasth: సుధీర్‌తో రష్మి పెళ్లిపై గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్.. వేరే లోకం అంటూ!
జబర్దస్త్ లో బాగా పేరు వచ్చిన జోడీలలో సుధీర్, రష్మీ జోడి కూడా ఒకటి. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనే విధంగా జబర్దస్త్ నిర్వాహకులు ఒక భ్రమ కల్పించి ఇప్పటికీ ఆ భ్రమ లో కొనసాగిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొంతమందికి సుధీర్ రష్మీ మధ్య స్నేహమే తప్ప ఇంకేమీ లేదని ఒక అవగాహనా ఉంది. కానీ మరి కొంతమంది మాత్రం ఏదీ లేకుండానే ఇంతలా ఫేమస్ అవుతారా ఏదో ఉందని భావిస్తూ ఉంటారు. అయితే తాజాగా వీరిద్దరి వివాహం గురించి గెటప్ శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

రష్మీ సుధీర్ కాంబో
జబర్దస్త్ లో సూపర్ హిట్ గా నిలిచిన రష్మీ సుధీర్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి మధ్య ఏదీ లేదు అని వారు స్వయంగా చెప్పుకుంటున్నా, ఏదో ఉంది అని భ్రమ కల్పించే విధంగా టెలివిజన్ షోల నిర్వాహకులు అనేక ప్రోగ్రాములు నిర్వహించారు. ఏకంగా వీరికి పెళ్లయినట్టు కూడా కొన్ని ప్రోగ్రాంలు నిర్వహించారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

గెటప్ శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు
నిజంగా ఆన్ స్క్రీన్ లో వీరి కెమిస్ట్రీ చూసినవారు కూడా నిజంగానే రష్మీ సుధీర్ లవర్స్ ఏమో త్వరలో పెళ్లికూడా చేసుకుంటారేమో అని భావిస్తూ ఉంటారు. అందుకే ఎప్పటికప్పుడు వీరి పెళ్లి వార్త కూడా సోషల్ మీడియాలో నానుతూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు ఈ విషయంపై గెటప్ శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక చాట్ సెషన్ నిర్వహించిన గెటప్ శీనుకి సుధీర్ రష్మీ పెళ్లి గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

రంజింప చేయడం కోసమే
సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన గెటప్ శీను ఈ విషయం మీద స్పందించారు. సుధీర్ తో క్లోజ్ రిలేషన్ ఉండడంతో గెటప్ శ్రీనుని సుధీర్ రష్మీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ఒక నెటిజన్ అడిగాడు. దానికి గెటప్ శ్రీను స్పందించారు సుధీర్ రష్మీ పెళ్లి చేసుకోరు షూటింగ్ అయిన తర్వాత రష్మీ ది వేరే లోకం సుధీర్ ది వేరే లోకం కేవలం ప్రేక్షకులను రంజింప చేయడం కోసమే వారు తెరపై లవర్స్ లా నటిస్తారు కానీ వాళ్ళు రియల్ లవర్స్ కాదు అని క్లారిటీ ఇచ్చారు.

చాట్ సెషన్
తాజాగా
ఆయన
అభిమానులతో
సోషల్
మీడియా
వేదికగా
చాట్
సెషన్
నిర్వహించారు.
ఇక
ప్రస్తుతం
సుధీర్
తో
పాటు
గెటప్
శ్రీను
కూడా
జబర్దస్త్
నుంచి
తప్పుకున్నారు.
ఆయన
మరేషోలో
కనిపించడం
లేదు
కానీ
చేతిలో
కొన్ని
సినిమాలు
ఉండడంతో
దాని
మీద
ఎక్కువ
దృష్టి
పెట్టాలని
ఆయన
షో
నుంచి
తప్పుకున్నాడని
ప్రచారం
జరుగుతోంది.

హాట్ టాపిక్ గా
ప్రస్తుతానికి రాంప్రసాద్ ఒక్కరే జబర్దస్త్ లో సందడి చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఒక సినిమాకి సంబంధించిన టీజర్ కూడా తాజాగా విడుదలైంది మొత్తం మీద జబర్దస్త్ వ్యవహారం మాత్రం గత కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అన్న సంగతి తెలిసిందే.