For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Extra Jabardasth: లవ్ ట్రాకుల మీద గెటప్ శ్రీను అసహనం.. వాళ్ళని ఎవడు బాగుచేయలేడని..

  |

  జబర్దస్త్ లో కొన్నిసార్లు ఆర్టిస్టుల మధ్యలో నిజంగానే ప్రేమ కొనసాగుతుందా అనే విధంగా పెర్ఫామెన్స్ ఇస్తూ ఉంటారు. మొదట ఏదో ఫెస్టివల్ కోసం మాత్రమే యాంకర్స్ కమెడియన్స్ మధ్యలో ఏదో ఉందని క్రియేట్ చేస్తూ హైప్ క్రియేట్ చేసేవారు. కానీ ఇప్పుడు రెగ్యులర్ కామెడీ షోలలో కూడా ఇది ఆనవాయితీగా మారిపోతుంది. అయితే అప్పుడప్పుడు కొందరు కామెడీలో భాగంగానే కౌంటర్స్ ఇస్తూ ఉండడం కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక రీసెంట్గా జబర్దస్త్ సీనియర్ మోస్ట్ కమెడియన్ గెటప్ శ్రీను కూడా లవ్ ట్రాకుల మీద ఊహించని విధంగా కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  అదే స్ట్రాటజీ

  అదే స్ట్రాటజీ

  ఈటీవీలో ప్రసారమయ్యే కొన్ని ఎంటర్టైన్మెంట్ షోలలో అప్పుడప్పుడు లవ్ ట్రాక్ల మీద అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటికే యాంకర్ రష్మీ సుడిగాలి సుదీర్ మద్యలో ఏదో కొనసాగుతోంది అని పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వాతావరణం కూడా క్రియేట్ చేసేసారు. ఇక వర్ష, ఇమ్మాన్యూయేల్ వరకు కూడా అందరూ ఇదే తరహా స్ట్రాటజీతో జనాల్లో మంచి క్రేజ్ అయితే అందుకున్నారు.

  ఏదో నడుస్తోంది..

  ఏదో నడుస్తోంది..

  రియాలిటీ షో లలో టాలెంట్ తో కన్నా ఇతర వ్యవహారాలతోనే కొందరు ఎక్కువగా క్రేజ్ అందుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఏదో నడుస్తోంది అనే పాయింట్ను ఆసరాగా చేసుకుని టెలివిజన్ షోలు రేటింగ్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ తరహాలోనే ఎమోషనల్ రొమాంటిక్ యాంగిల్స్ లో కూడా ఎక్కువగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక డబుల్ మీరు డైలాగ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  వర్షతో ప్రేమ

  వర్షతో ప్రేమ


  జబర్దస్త్ లో కూడా చాలా రోజులుగా కొంతమంది ఆర్టిస్టులు ఇతర లేడీ కమెడియన్స్ తో కొనసాగుతున్న విధానం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా వర్ష ఇమ్మానుయేల్ మధ్యలో ప్రేమ కొనసాగుతున్నట్లుగా చాలా రకాల కథనాలు వెలుపడ్డాయి చాలాసార్లు వీరు ఇద్దరూ కూడా స్టేజ్ పైనే ప్రపోజ్ చేసుకోవడం అతను లేకపోతే నేనులేను అనడం ఇలా ఎన్నో రకాల స్కిట్స్ తో మాత్రం రియాలిటీ గానే జనాలను ఎక్కువగా ఆకట్టుకున్నట్లు అనిపించింది.

  జోర్డార్ సుజాత, రాకింగ్ రాకేష్

  జోర్డార్ సుజాత, రాకింగ్ రాకేష్


  ఇక జబర్దస్త్ లో ఇటీవల కాలంలో జోర్డార్ సుజాత రాకింగ్ రాకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ ఇదివరకే కొన్ని ఇంటర్వ్యూలలో కూడా ఒకరినొకరం ఇష్టపడుతున్నాము అన్నట్లుగానే సమాధానం ఇచ్చారు. కానీ ఎప్పుడూ కూడా ఆ విషయం ఎంతవరకు వెళ్ళింది అనే విషయంలో మాత్రం పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ జబర్దస్త్ లో ప్రతిసారి లవర్స్ తరహాలోనే ప్రజెంట్ అవుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

  గెటప్ శ్రీను సెటైర్

  గెటప్ శ్రీను సెటైర్


  ఇక రీసెంట్గా గెటప్ శ్రీనుకు స్కిట్ చేయడానికి ఈ లవ్ ట్రాక్ మీద స్టఫ్ అయితే దొరికింది. అతను ఒకరిని కాకుండా అందరినీ ఆడేసుకున్నాడు. యమధర్మరాజుగా ఆటో రాంప్రసాద్ తో స్కిట్ చేసిన శీను ముందుగా రాకింగ్ రాకేష్ , సుజాత ఎలా చనిపోయారు అని అడుగగా వాళ్ళు ఇంట్లో ప్రేమను ఒప్పుకున్నారని పెళ్లి చేసుకొమ్మని అంటున్నారని టెన్షన్ తో చనిపోయినట్లు చెప్పారు.

   వీళ్ళని ఎవడు బాగు చేయలేడు

  వీళ్ళని ఎవడు బాగు చేయలేడు

  ఇక డేంజరస్ కపుల్ అంటూ వర్ష ఇమ్మాన్యూఎల్ ను పరుచయం చేశారు. ఇక మీది నిజమైన ప్రేమ అని ప్రూవ్ చేసుకోవాలని అనడంతో వర్ష మరోసారి ఇమ్ము లేనిదే ఈ వర్ష లేదు ఊపిరి ఆగిపోతుంది అన్నట్లుగా చెప్పడంతో రొమాంటిక్ లవ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అయ్యింది. ఇక ఫాహిమా జోడి రాగానే మరో మ్యూజిక్ వేయడంతో అసలు ఇలాంటి మ్యూజిక్ లు వేసి వారి మధ్యలో లేని పోనీవి కలిగిస్తున్నారు అని అసహనంతో శ్రీను సెటైర్ వేశాడు. అయినా కూడా తగ్గకుండా అలానే మ్యూజిక్ వేయడంతో వీళ్ళని ఎవడు బాగు చేయలేడు అని చెప్పడం హైలెట్ అయ్యింది.

  English summary
  jabardasth getup srinu shocking counter on jabardasth love tracks
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X