twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jabardasth: హైపర్ ఆది, సుధీర్ ఫస్ట్ రెమ్యునరేషన్ అంతే.. ఇప్పుడు సినిమాల్లో మరో రేటు!

    |

    జబర్దస్త్ లో మంచి క్రేజ్ అందుకున్న కమెడియన్స్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కూడా రెగ్యులర్ కమెడియన్స్ గా కొనసాగే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు అయితే హీరోలుగా కూడా అడుగులు వేస్తూ వారి స్థాయిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ఇటీవల కాలంలో ఎక్కువ క్రేజ్ అందుకున్న జబర్దస్త్ కమెడియన్స్ లలో సుడిగాలి సుదీర్ హైపర్ ఆది టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. ఇక వీరు మొదట జబర్దస్త్ కు వచ్చినప్పుడు పారితోషికం ఎంత? అలాగే ఇప్పుడు సినిమాలకు ఎంత తీసుకుంటున్నారు అనే వివరాల్లోకి వెళితే..

    చిన్నతనం నుంచే..

    చిన్నతనం నుంచే..

    సుడిగాలి సుదీర్ చిన్నతనం నుంచి ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలి అని ఎన్నో కలలు కన్నాడు. ఇక అతను కొన్నాళ్లకు మెజీషియన్ గా కూడా మారి తన టాలెంట్ను నిరూపించుకున్నాడు. అనంతరం జబర్దస్త్ లో కొత్త వారికి అవకాశాలు వస్తున్నాయి అని తెలుసుకొని అక్కడ సొంతంగా తన టాలెంట్ ను చూపించుకొని టీం లీడర్ వరకు వచ్చాడు.

    సుధీర్ ఫస్ట్ రెమ్యునరేషన్

    సుధీర్ ఫస్ట్ రెమ్యునరేషన్

    సుడిగాలి సుధీర్ కు మొదట జబర్దస్త్ లో అంత ఈజీగా ఏమి అవకాశాలు దొరకలేదు. ప్రముఖ కమెడియన్ వేణు అతన్ని మొదట స్క్రిప్ట్ రైటర్ గా కూడా వాడుకోవడం జరిగింది. ఆ సమయంలోనే అతను చాలా తక్కువ స్థాయిలో పారితోషికం అందుకునేవాడు. మొదట స్క్రిప్ట్ రైటింగ్ కోసం సుధీర్ కు ఒక ఎపిసోడ్ కు రెండు వేల నుంచి ఐదు వేల మధ్యలో రెమ్యునరేషన్ ఇచ్చేవారట.

     టీమ్ లీడర్

    టీమ్ లీడర్

    ఇక జబర్దస్త్ అది తక్కువ కాలంలోనే సక్సెస్ కావడంతో అతను కమెడియన్ గా కూడా స్టేజి పైకి వచ్చి చాలా తొందరగానే సెట్ అయిపోయాడు. సుడిగాలి సుదీర్ కి కూడా అతనితో మంచి కాంబినేషన్ ఏర్పడింది. ఇక వేణు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత టీమ్ లీడర్ గా అవకాశం దక్కించుకున్న సుదీర్ ఎప్పుడూ కూడా నిరాశపరిచే విధంగా స్కిట్స్ చేసింది లేదు. అతని ద్వారా గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్ కూడా మంచి కమెడియన్స్ గా గుర్తింపు పొందారు.

    హైపర్ అది ఫస్ట్ జీతం

    హైపర్ అది ఫస్ట్ జీతం

    ఇక జబర్దస్త్ లో మంచి క్రేజ్ అందుకున్న వారిలో హైపర్ ఆది కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. అతను కూడా మొదట జబర్దస్త్ స్క్రిప్ట్ రైటర్ గానే ఎంట్రీ ఇచ్చాడు. సీనియర్ కమెడియన్ అదిరే అభి టీమ్ లో మొదట రైటర్ గా కామెడీ స్కిట్స్ రాస్తూ వచ్చిన హైపర్ ఆది ఆ తర్వాత తొందరగానే కమెడియన్ గా గుర్తింపు అందుకున్నాడు. అతనికి మొదట స్క్రిప్ట్ రైటింగ్ కోసం ఒక్కో ఎపిసోడ్ కోసం 2 వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు.

     సినిమాలకు అంతకంటే ఎక్కువగా..

    సినిమాలకు అంతకంటే ఎక్కువగా..

    ఇక వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎంతగానో గుర్తింపును అందుకున్న హైపర్ ఆది ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగి జబర్దస్త్ మొత్తంలో కూడా ఎక్కువ పారితోషికాన్ని అందుకున్న వారిలో ఒకడిగా గుర్తింపునందుకున్నాడు. అతను దాదాపు ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు లక్షకు పైగానే రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం సినిమాలకు కూడా అతను ఒక్క రోజుకు అంతకంటే ఎక్కువ స్థాయిలోనే డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

    సుధీర్ మూవీస్ రెమ్యునరేషన్?

    సుధీర్ మూవీస్ రెమ్యునరేషన్?

    ఇక సుడిగాలి సుధీర్ కి ప్రస్తుతం సినిమా అవకాశాలు చాలా ఎక్కువగానే వస్తున్నాయి. సినిమాలతో క్రేజ్ కోసమే అతను జబర్దస్త్ కూడా దూరమయ్యాడు. ఇక ప్రస్తుతం ఈ రూట్లో సుధీర్ కు మంచి ఆదాయం లభిస్తుంది. ఒక్కో సినిమా కోసం రెండు లక్షలకు పైగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే మంచి సినిమాల్లో కంటెంట్ ఉన్న పాత్రలు దొరికితే మాత్రం అతను తక్కువ స్థాయిలో కూడా పారితోషికం తీసుకోవడానికి ఏమాత్రం సందేహించడం లేదని తెలుస్తోంది.

    English summary
    Jabardasth hyper aadi and Sudigali Sudheer first remuneration details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X