Don't Miss!
- Sports
U-19 ప్రపంచకప్ విజేతలకు ఘన స్వాగతం.. అంత కలలా ఉందన్న త్రిష!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- News
తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ ఉంటారు..!!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మొదటి సారిగా శ్రీమతితో జబర్దస్త్ మహేష్ అలా.. అందమైన జంటకు వెల్లువలా విషెస్
జబర్దస్త్ మహేష్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసే ఉంటుంది. ఆహార్యంతో పాటు యాసతోనూ అందర్నీ ఆకట్టుకున్నాడు మహేష్. జబర్దస్త్ వేదికపై పంచ్‌లతో నవ్వుల పూలు పూయించిన మహేష్ వెండితెరపైనా తన దైన శైలిలో దూసుకుపోతున్నాడు. నటనలోని ప్రతిభను నిరూపించుకున్న మహేష్ మంచి అవకాశాలనే అందుకుంటున్నాడు. క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండే ఆర్టిస్ట్ కావడంతో.. ఖాళీగా దొరికిన ఈ లాక్ డౌన్ సమయాన్ని బాగా వినియోగించుకున్నాడు.

ఆ వేదిక నుంచి ఫేమస్..
జబర్దస్త్ వేదికపై నుంచి వెలుగులోకి వచ్చిన ఎంతో మంది ఆర్టిస్టుల్లో మహేష్ ఒకడు. జబర్దస్త్‌లో స్కిట్లలో నవ్వులు పూయించిన మహేష్ వెండితెరపై మాత్రం అన్ని రకాల ఎమోషన్స్‌ను పండిస్తున్నాడు. భిన్నరకాల పాత్రలను పోషిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.

అన్నిరకాలు పాత్రలు..
జబర్దస్త్ మహేష్ కాస్తా రంగస్థలం మహేష్‌గా రూపాంతరం చెందాడంటే ఏ రేంజ్‌లో జీవించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ పక్కనే ఉంటూ అద్భుత నటనను ప్రదర్శించాడు. మహానటి, గుణ 369, ప్రతిరోజూ పండగే వంటి ఎన్నో చిత్రాల్లో మంచి నటనను కనబర్చాడు.

లాక్ డౌన్‌లో పెళ్లి..
అయితే లాక్ డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరభించాడు. అయితే ఈ పెళ్లి వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. బంధువుల అమ్మాయి అయిన పావనిని మే 14వ తేదీన ఉదయం. 6.31 గంటల సుముహూర్తంలో పెళ్లి చేసుకున్నాడు.

ఫస్ట్ ఫోటో ఇదే..
అయితే పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేయని మహేష్.. తాజాగా శ్రీమతితో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇద్దరూ కలిసి ఆస్వాధిస్తున్న మధుర క్షణాలను ఫోటోల బంధించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Recommended Video

విషెస్‌ల వెల్లువ
ఇక ఈ అందమైన జంటకు నెటిజన్స్ విషెస్ చేస్తున్నారు. హ్యాపీ మ్యారిడ్ లైఫ్ అంటూ మహేష్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రేమ వివాహామా? పెద్దలు కుదిర్చిన వివాహామా? అని అడిగిన ప్రశ్నలకు పెద్దలు కుదిర్చినదేనని సమాధానం ఇచ్చాడు.