For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా లవర్ అంటూ షాకిచ్చిన పొట్టి నరేష్... సాక్ష్యాలతో బయటపెట్టడంతో ఒప్పేసుకున్న పూర్ణ !

  |

  తెలుగులో జబర్దస్త్ షో క్లిక్ అయిన అంత బాగా మరే రియాలిటీ షో క్లిక్ కాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. కామెడీ ప్రధానంగా అనేక షోలు రూపొందించారు కానీ జబర్దస్త్ మాత్రం మొదలు పెట్టిన నాటి నుంచి బ్రేక్ లేకుండా కొనసాగుతూనే ఉంది. మధ్యలో కరోనా అలాంటి సమయంలో కొంత బ్రేక్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు వచ్చి కొంత మంది సినిమా ఆఫర్లు దక్కించుకుని బయటికి వెళ్లారు. మరి కొంతమంది జబర్దస్త్ తమ ప్రపంచం అన్నట్లు ఇక్కడే స్కిట్స్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో పొట్టి నరేష్ ఒకరు. అయితే ఆయన తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  ఎప్పటికప్పుడు కొత్తగా

  ఎప్పటికప్పుడు కొత్తగా


  చూడటానికి పొట్టిగా కనిపించే నరేష్ కు పెద్దగా వయసు ఉండదు అని అందరూ అనుకుంటారు. చిన్నపిల్లవాడే అనుకుంటే ఆ మధ్య అది నిజం కాదని 20 ఏళ్ల పైనే ఆయన వయసు ఉంటుందని, కొన్ని స్కిట్ల ద్వారా ప్రేక్షకులకు అర్థం అయింది. ఇక అప్పటి నుంచి అడపాదడపా మనోడు కూడా రొమాంటిక్ కామెడీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అది పెద్దగా వర్కౌట్ కాదు. బుల్లెట్ భాస్కర్ టీమ్ లో కనిపించే నరేష్ ఎప్పటికప్పుడు తనను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ ఉంటాడు.

  షాక్ అయి

  షాక్ అయి


  ప్రస్తుతం జబర్దస్త్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కమెడియన్లలో ఒకరిగా నరేష్ యాంకర్ రష్మీ, రోజా వెళ్లిపోవడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఖాళీగా ఉన్న ప్లేస్ లోకి వచ్చిన పూర్ణ, మరో జడ్జ్ ఇంద్రజ అందరికీ షాకిచ్చాడు. అదేమిటంటే సాధారణంగా నరేష్ కు లవర్ ఉంది అంటే ఎవరూ నమ్మరు. అయితే జబర్దస్త్ షో లోనే ఒక అమ్మాయిని పడేసి నరేష్ షాక్ ఇచ్చాడు. అంతేకాక దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా చూపించడంతో షో లో ఉన్న వారందరూ షాక్ అయిన పరిస్థితి. అలా షాక్ అవ్వడానికి కారణం నరేష్ పడేసింది ఎవరినో కాదు కొత్తగా జడ్జిగా వచ్చిన పూర్ణ.

   రాధేశ్యామ్ లో ట్రైన్ సీన్

  రాధేశ్యామ్ లో ట్రైన్ సీన్


  తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో ప్రకారం కెవ్వుకార్తిక్ తో పాటు స్కిట్ చేసిన నరేష్ తనకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని కార్తిక్ కి చెబుతాడు. అయితే కార్తీక్ నమ్మకపోవడంతో గర్ల్ ఫ్రెండ్ మరెవరో కాదు ఈ షోకి జడ్జిగా వచ్చిన పూర్ణ అని చెప్పి నరేష్ షాకిచ్చాడు. కార్తిక్ కూడా ఎక్కడా తగ్గకుండా నువ్వు పూర్ణ గారు నా లవర్ అంటే సరిపోతుందా నువ్వు చెప్పినా ఎవరూ నమ్మరు అని అంటాడు. మీరు అలా అంటారు నేను సాక్ష్యాధారాలతో వచ్చాను అని చెప్పిన నరేష్ రాధేశ్యామ్ లో ట్రైన్ సీన్ రిపీట్ చేశాడు.

  బాహుబలి2 మార్ఫింగ్ ఫోటోలు

  బాహుబలి2 మార్ఫింగ్ ఫోటోలు


  ఆ సినిమాలో పూజా ప్లేస్ లో పూర్ణ ఫోటో, ప్రభాస్ ప్లేస్ లో తన ఫోటో పెట్టి మార్ఫింగ్ చేసి పెద్ద పోస్టర్ల చేయించి జబర్దస్త్ స్టేజ్ మీద ఆవిష్కరించాడు. ఈ దెబ్బకు పూర్ణ అయితే వెంటనే షాక్ కాగా మిగతా వాళ్ళు కూడా ఏంట్రా బాబు అన్నట్లు ఒక్కసారిగా స్టన్నయిపోయారు. ఇక రష్మి కూడా ఆట పట్టించేందుకు నరేష్ నువ్వు పూర్ణ గారి బరువు మోస్తావా అని ప్రశ్నిస్తే మోసం మోస్తాను అని అనడంతో అందరూ సరదాగా తీసుకున్నారు. అయితే అక్కడితో ఆగకుండా మరో పోస్టర్ చూపించారు. ఈసారి పోస్టర్లో బాహుబలి2 మార్ఫింగ్ ఫోటోలు పెట్టి విల్లు ఎక్కు పెడుతున్నట్లుగా ఉన్న ఫోటోలను విడుదల చేశారు.

   కొరికేసి

  కొరికేసి


  ఇక పూర్ణ కూడా ఎక్కడా తగ్గకుండా నరేష్ ను తన బాయ్ ఫ్రెండ్ గా ఒప్పుకుంటున్నాను అని చెబుతూ తన కొత్త బాయ్ ఫ్రెండ్ నరేష్ తో స్టేజి మీద డాన్స్ వేయాలని ఉంది అని అంటుంది. దానికి ఓకే చెప్పిన నరేష్ పూర్ణతో కలిసి ఉప్పెన సినిమా లోని నీ కన్ను నీలి సముద్రం సాంగ్ కి రొమాంటిక్ స్టెప్పులు వేశారు. ఫైనల్ గా ఎప్పటిలాగే ముద్దు పెడుతున్నట్లు పెడుతూనే నరేష్ చంప పూర్ణ కొరకుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద జబర్దస్త్ ప్రోమో ఆకట్టుకోవడంతో పూర్తి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

  English summary
  in extra Jabardasth promo Naresh reveals that poorna is his love with proofs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X