»   » రష్మి కన్నీరు చూసి షాకయ్యా, వాళ్లు మొరిగే కుక్కలు.. చెప్పుతో కొట్టాలి: జబర్దస్త్ పవన్ ఆవేదన!

రష్మి కన్నీరు చూసి షాకయ్యా, వాళ్లు మొరిగే కుక్కలు.. చెప్పుతో కొట్టాలి: జబర్దస్త్ పవన్ ఆవేదన!

Posted By:
Subscribe to Filmibeat Telugu
రష్మి ని చూసి షాకయ్యా, చెప్పుతో కొట్టాలి: బట్టలు ఊడదీసి కొట్టాలి !

ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కామెడీ షోలో, ఢీ-10 కార్యక్రమంలో తన పెర్ఫార్మెన్స్‌తో అందరినీ మంత్రముగ్దులను చేస్తున్న ఆర్టిస్ట్ పవన్ అలియాస్ పావని. ఇప్పటి వరకు జబర్దస్త్‌లో లేడీ గెటప్స్ వేసిన అందరి కంటే కూడా పవన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓసారి ఢీ-10లో పవన్ పెర్ఫార్మెన్స్ చూసి యాంకర్ రేష్మి కూడా ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఓ వెబ్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

 రష్మి అలా రియాక్ట్ అవుతుందని అనుకోలేదు

రష్మి అలా రియాక్ట్ అవుతుందని అనుకోలేదు

ఢీ-10 కార్యక్రమంలో ఎమోషన్ సాంగుపై పవన్ స్పందిస్తూ.... నేను ఆ సాంగ్ రియల్ గా ఫీలై చేశాను. అందుకే నా తోటి కంటెస్టెంట్స్, మాస్టర్స్, ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అయ్యారు. రేష్మి లేచి ఒక్కసారిగా కన్నీరు కారుస్తూ నా గురించి చాలా చెప్పింది. ఆమె అలా రియాక్ట్ అవుతుంది అని అనుకోలేదు అని... పవన్ తెలిపారు.

రష్మి ఎమోషనల్ అయిన సందర్భం

రష్మి ఎమోషనల్ అయిన సందర్భం

ఢీ 10లో పవన్ పెర్ఫార్మెన్స్ చూసిన అనంతరం రష్మి ఎమోషనల్ అవుతూ.... ‘ఐదేళ్ల నుండి పవన్‌ను చూస్తున్నాను. ఇండస్ట్రీకి చాలా మంది హీరో అవుదామనో, కమెడియన్ అవుదామనో, విలన్ అవుదామనో వస్తారు. అలాంటిది ఫీమేల్ రోల్స్ చేయాలంటే చాలా మంది సిగ్గుపడతారు. కానీ పవన్ ఇండస్ట్రీలో ఉంటే చాలు, పని ఉంటే చాలు అనుకుని ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ సర్వైవ్ అవుతున్నాడు, తన టాలెంటును నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు' అని రష్మి ఎమోషనల్ అయ్యారు.

రష్మి చెప్పంది నిజమే...

రష్మి చెప్పంది నిజమే...

రేష్మి చెప్పింది నిజమే. ఆమె అలా రియాక్ట్ అవ్వడంతో ఎలాంటి రిప్లై ఇవ్వాలో అర్థం కాలేదు. ఓ సారి ఆమె అడిగారు. ఎందుకు ఇలా లేడీ గెటప్స్ చేస్తున్నావు. నార్మల్ గా కూడా బావుంటావు కదా అన్నారు. నేను అపుడు ఒకటే చెప్పాను. ఏదో ఒకటి చేయాలని వచ్చాను. ఇదే చేయాలి అని ఫిక్స్ అయి రాలేదు. సినిమా ఇండస్ట్రీలో ఒకటి అనుకుని వస్తే ఇంకోటి అవుతుంది. మనం అనుకున్నది జరుగకపోతే బాధపడటం లాంటివి జరుగుతాయి. దాంతో తాగుడుకు బానిసైపోవడం, చెడిపోవడం లాంటివి జరుగుతాయి. అందుకే నేను ఏమీ అనుకోకుండా ఇండస్ట్రికి వచ్చాను. ఏ అవకాశం వచ్చినా సంతోషంగా చేస్తున్నాను అని పవన్ తెలిపారు. అయ్యో నేను ఇది సాధించలేక పోయాను అనే ఫీలింగుతో చాలా మందిని చూశాను. నాకు మాత్రం అలాంటిది లేదు. ఒక మంచి ఆర్టిస్టుగా నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యాను.... అని పవన్ తెలిపారు.

 అలా అనే వారిని చెప్పుతో కొట్టాలి

అలా అనే వారిని చెప్పుతో కొట్టాలి

లేడీ పాత్రలు వేయడం వల్ల గేలుగా మారిపోతున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి అనే ప్రశ్నకు పవన్ స్పందిస్తూ.... అలా అనే వారిని చెప్పుతో కొట్టాలి. లేదంటే బట్టలు ఊడదీసి కొట్టాలి. నేను కూడా కొన్ని టీవీ షోలలో ఇది విన్నాను. నా ముందు ఎవరైనా ఆ మాట అంటే చెప్పులు మెడలో వేసి బట్టలు ఊడదీసి తిప్పకపోతే నేను పేరు మార్చుకుంటాను... అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు.

 మరి వారంతా హీరోలా? మూసుకుని కూర్చోండి

మరి వారంతా హీరోలా? మూసుకుని కూర్చోండి

వ్యాంపు క్యారెక్టర్లు వేసినంత మాత్రాన వ్యాంపులు కాదు, విలన్ క్యారెక్టర్లు వేసినంత మాత్రాన విలన్ కాదు, హీరో వేషాలు వేసినంత రియల్ హీరోలు కాదు. లేడీ గెటప్ వేసినంత మాత్రాన గేస్ కాదండీ. వారు వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ ను మీకు నచ్చితే ఆదరించండి. అంతే కానీ వారి గురించి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. ఇష్టం లేకుంటే మూసుకుని కూర్చొండి అంటూ పవన్ ఫైర్ అయ్యారు.

 నాకు ఫ్యామిలీ ఉంది, వారు బాధపడతారు

నాకు ఫ్యామిలీ ఉంది, వారు బాధపడతారు

నాకు ఏడుగురు బ్రదర్స్. చాలా పెద్ద ఫ్యామిలీ. ఇలాంటి వార్తలు మేము లైట్ తీసుకున్నా... వారు బాధ పడుతుంటారు. జబర్దస్త్ షోలో అవకాశం అనేది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. జనాలు ఆదరిస్తున్నారు. ఎవడో లుచ్చాగాడు అన్నాడని చెప్పి ఊరుకునే మూర్చుడిని కాదు. నేను అలా కూర్చోను. నా దగ్గర వేరే వారి గురించి మాట్లాడినా ఊరుకోను. చాలా మంది వినోద్ గురించి, శాంతి స్వరూప్ గురించి ఈ మధ్య వచ్చిన అందరి గురించి అంటుంటారు. నేను వెంటనే వారికి తగిన బుద్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటాను... అని పవన్ తెలిపారు.

 మీరు మాకు పని ఇస్తారా?

మీరు మాకు పని ఇస్తారా?

నేను ఇలా మాట్లాడుతున్నందుకు చాలా మంది చూసి ఫీలవ్వవచ్చు. మీలాగే మేము కూడా మనుషులమే, మాకూ మనసు ఉంటుంది. మేమంతా లేడీ గెటప్ వేయడం మానేస్తాం. ఏ నా కొడుకు అయితే గే అని అంటున్నాడో వాడు మాకు చేయడానికి పని ఇస్తాడా? అంటూ పవన్ ప్రశ్నించారు.

ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు అయింది, జబర్దస్త్ నాకు లైఫ్ ఇచ్చింది

ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు అయింది, జబర్దస్త్ నాకు లైఫ్ ఇచ్చింది

లేడీ గెటప్స్ వేయడం వల్ల మీ జీవితం మీద ప్రభావం పడుతుందని మీరు ఎప్పుడూ ఆలోచించలేదా? అనే ప్రశ్నకు పవన్ స్పందిస్తూ... ఆకలేసినపుడు మీరు బిర్యానీయే తినాలని కూర్చోరుకదా. ఆ సమయానికి ఏది దొరికితే అది తినేసి ఆకలి తీర్చుకుంటాం. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలైంది. నువ్వు పొట్టిగా ఉన్నావు, ఫెయిర్‌గా ఉన్నావు, ఒకరిని డామినేట్ చేస్తున్నావు అని చాలా మంది ఏ క్యారెక్టర్ ఇవ్వలేదు. జబర్దస్త్ నాకు లైఫ్ ఇచ్చింది.. అని పవన్ తెలిపారు.

కుక్కులు అరుస్తుంటాయి

కుక్కులు అరుస్తుంటాయి

జూనియర్ ఆర్టిస్టుగా, అసిస్టెంటుగా చేస్తుండగా ఓ మంచి రోజు నాకు జబర్దస్త్ లో అవకాశం దొరికింది. ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు. కుక్కులు అరుస్తుంటాయి. నేను వాటికి రియాక్ట్ అవ్వను. నన్ను అర్థం చేసుకుని నాతో ఉండే వారితోనే నేను ఉంటాను.... అని పవన్ తెలిపారు.

జబర్దస్త్ ఎంట్రీ

జబర్దస్త్ ఎంట్రీ

ఐదేళ్ల క్రితం జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాను. అపుడు వినోద్, నేనే ఉన్నాం. ఇపుడు సాయి, శాంతి స్వరూప్ వచ్చారు. వీరు రావడం వల్ల మాకు కాంపిటీషన్ పెరగడం, తగ్గడం లాంటిది ఏమీ లేదు. నాకైతే ఎక్కువగానే అవకాశాలు వచ్చాయి. ఢీ-10 చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. మంచి పెర్పార్మర్ గా పేరు తెచ్చుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు..... అని పవన్ తెలిపారు.

మల్లెమాల సంస్థ గురించి

మల్లెమాల సంస్థ గురించి

మల్లెమాల సంస్థ అనేది చాలా మంచి సంస్థ. మాకు మంచి అవకాశాలు ఇస్తున్నారు. వాటిని నిరూపించుకుంటూ ముందుకు వెళుతున్నాం. వీరు వచ్చారు కదా.... నా ఛాన్స్ పోతుందేమో అనే ఫీలింగ్ రాలేదు. ఒక్కోసారి వేరే పనుల్లో బిజీగా ఉండి కొన్ని జబర్దస్త్ ఎపిసోడ్లు చేయడం లేదు. తొక్కేస్తారనే భయం అస్సలు లేదు... అని పవన్ తెలిపారు.

English summary
Jabardasth Pavan aka Pavani Angry On Lady Getup and gay Comments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu