Just In
- 2 min ago
ఎమ్మెల్యేగా పా రంజిత్.. రాజకీయ ప్రవేశానికి రంగం సిద్దం.. జాతీయపార్టీ గ్రీన్ సిగ్నల్!
- 19 min ago
యువ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్
- 31 min ago
Naandhi 11 Days Collections: క్లిష్ట సమయంలోనూ సత్తా చాటిన ‘నాంది’.. లాభాల్లోనూ నరేష్ మూవీ రికార్డు
- 36 min ago
ఆన్లైన్లో నితిన్ దర్శకుడికి టోకరా.. గుడ్డిగా నమ్మి డబ్బులు పంపిన దర్శకుడు.. చివరికి..
Don't Miss!
- Sports
17 సెకన్లలో తిప్పేశాడు.. సచిన్‌ను ఫిదా చేశాడు!!
- News
Viral Video: పేలిన అగ్నిపర్వతం: బూడిద వర్షం: నాలుగు కిలోమీటర్ల ఎత్తు..భయంభయంగా
- Finance
బంగారం ధరలు తగ్గాయి, 387% పెరిగిన దిగుమతులు: ఇన్వెస్ట్ చేయడమే మంచిదా?
- Lifestyle
ఆరోగ్యకరమైన సంబంధాలు కలిగిన రాశిచక్ర గుర్తులు
- Automobiles
తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుడిగాలి సుధీర్ పెద్ద కాట్రాజ్ గాడు.. అన్నీ అలాంటి పనులే: నిజస్వరూపం బయట పెట్టిన జబర్ధస్త్ సాయిలేఖ
సుడిగాలి సుధీర్.. తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా మారుమ్రోగిపోతోన్న పేరిది. దాదాపు ఎనిమిదేళ్లుగా తనదైన శైలి కామెడీతో సత్తా చాటుతోన్న అతడు.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. దీనికి కారణం జబర్ధస్త్ కామెడీ షోనే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని వల్ల వెలుగులోకి వచ్చిన అతడు.. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా సత్తా చాటుతున్నాడు. దీంతో స్టార్ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు. ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ నిజస్వరూపం బయటపెట్టింది జబర్ధస్త్ సాయిలేఖ. ఆ వివరాలు మీకోసం!

అన్నింట్లోనూ సత్తా.. ఆల్‌రౌండర్‌గా పేరు
మ్యాజిక్‌లు చేసుకునే సమయంలో జబర్ధస్త్‌లోకి ప్రవేశించాడు సుడిగాలి సుధీర్. ఆ వెంటనే తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి తన హవా చూపిస్తోన్న అతడు.. ఎన్నో స్టేజ్ షోలు, ఈవెంట్లలో మ్యాజిక్‌లు చేశాడు. అలాగే, డ్యాన్స్‌లు చేస్తూ, పాటలు పాడుతూ బుల్లితెర ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడీ టాలెంటెడ్ యంగ్ స్టార్.

యాంకర్ వల్ల మరింత ఫేమస్ అయ్యాడు
టాలెంట్ ఏమో గానీ వ్యక్తిగత కారణంతో మరింత ఫేమస్ అయ్యాడు సుడిగాలి సుధీర్. మరీ ముఖ్యంగా యాంకర్ రష్మీ గౌతమ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తలతో మరింతగా పాపులర్ అయ్యాడు. అంతేకాదు, ఆమెను వివాహం కూడా చేసుకోబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరి క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు ప్రయోగాలు చేస్తున్నారు.

లవర్ బాయ్‌గా పేరు.. ప్లేబాయ్ గుర్తింపు
కమెడియన్‌గానే కాకుండా తనలోని ఎన్నో టాలెంట్లను బయట పెట్టిన సుడిగాలి సుధీర్ యూత్‌లో ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనపై తానే పంచులు వేసుకుంటూ క్యారెక్టర్‌ను బ్యాడ్ చేసుకున్నాడు. అలాగే, రష్మీ కాకుండా పలువురు యాంకర్లలతో అతడు ప్రేమాయణం సాగిస్తున్నాడని ప్రచారం సాగింది.

యాక్టర్‌గా సక్సెస్.. హీరోగా ఫెయిల్యూర్స్
బుల్లితెరపై తనదైన శైలి టైమింగ్‌తో కామెడీని పండిస్తూ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న సుడిగాలి సుధీర్.. సినిమాల్లోనూ అడుగెట్టాడు. ఈ క్రమంలోనే ‘రేసు గుర్రం', ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', ‘సర్దార్ గబ్బర్ సింగ్', ‘బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాల్లో నటించాడు. ఇవన్నీ అతడికి పేరు తెచ్చిపెట్టాయి. అయితే, హీరోగా చేసిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్', ‘త్రీమంకీస్' మాత్రం ఘోరంగా నిరాశ పరిచాయి.

నిజస్వరూపం బయట పెట్టిన జబర్ధస్త్ సాయి
యూట్యూబ్ ఛానెళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది ఇంటర్వ్యూల ద్వారా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇలా ఇటీవలి కాలంలో లేడీ గెటప్‌లతో ఫేమస్ అయిన జబర్ధస్త్ సాయి అలియాస్ సాయిలేఖ ఒకరు. ఈ మధ్య ఓ ఛానెల్‌తో చిట్ చాట్ చేసిన అతడు.. జబర్ధస్త్ విషయాలు బయట పెట్టాడు. అదే సమయంలో సుడిగాలి సుధీర్ నిజస్వరూపం బయట పెట్టాడు.

సుడిగాలి సుధీర్ పెద్ద కాట్రాజ్ గాడు అంటూ
ఈ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ గురించి మాట్లాడుతూ.. ‘జబర్ధస్త్ కమెడియన్లు అందరిలోనూ సుధీర్ పెద్ద కాట్రాజ్ గాడు' అంటూ నవ్వింది జబర్ధస్త్ సాయిలేఖ. ఆ తర్వాత కొనసాగిస్తూ.. ‘పాపం.. ఆయన పైకి అలా కనిపిస్తాడు కానీ.. లోపల మాత్రం చాలా మంచోడు. స్కిట్లలో అలాంటి పనులు చేయడం వల్లే ఆ పేరు వచ్చింది. మామూలుగా అయితే అలాంటోడు కాదు' అని వివరించింది.