For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగబాబు చేసిన పనితో ఆ నటుడి కోసం వెతుకుతున్న జబర్ధస్త్ టీమ్.. రీప్లేస్ చేయనిది అందుకే.!

  By Manoj
  |

  తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన షోలలో 'జబర్ధస్త్' పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ షో బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ షో.. ఆరంభం నుంచే మంచి పేరు దక్కొంచుకుంది. జబర్ధస్త్ ప్రారంభం సమయంలో వారంలో ఒక రోజు మాత్రమే ప్రసారం అయ్యేది. ఆ తర్వాత దీని పాపులారిటీ అంతకంతకూ పెరిగిపోవడంతో రెండు రోజులకు పెంచారు. దీంతో ఈ షోను అభిమానించే వారు కూడా భారీగా పెరిగిపోయారు. తాజాగా ఈ షో నిర్వహకులు ఓ నటుడి కోసం వెతుకుతున్నారట. ఇంతకీ ఎవరా నటుడు.? జబర్ధస్త్ టీమ్ ఎందుకు ఆయనను వెతుకుతోంది.? పూర్తి వివరాల్లోకి వెళితే..

  జబర్ధస్త్ క్రేజ్ వెనుక కారణం ఇది కూడా

  జబర్ధస్త్ క్రేజ్ వెనుక కారణం ఇది కూడా

  ఓ చానెల్‌లో ప్రసారం అవుతున్న జబర్ధస్త్ షో ఇంత క్రేజ్ సంపాదించుకోవడానికి వెనుక ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ షో వల్ల బుల్లితెరతో పాటు వెండితెరకు ఎంతో మంది ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. అదే సమయంలో రైటర్లు, టెక్నీషియన్లు కూడా వచ్చారు. వీరిలో చాలా మంది తమ హవాను చూపిస్తున్నారు. ఇది కూడా షో పాపులర్ అవడానికి కారణం అవుతోంది.

  వాళ్లిద్దరికి బాగా ఉపయోగపడింది

  వాళ్లిద్దరికి బాగా ఉపయోగపడింది

  జబర్ధస్త్ షో ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులను వెలుగులోకి తీసుకు రావడమే కాదు.. మొదటి నుంచీ జడ్జ్‌లుగా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ నటి రోజాకు కూడా ఎంతోగానో ఉపయోగపడింది. పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో నాగబాబు దీని వల్ల నిలదొక్కుకోగలిగారు. అలాగే, రోజా కూడా ఎంతో పేరు సంపాదించారు.

   సక్సెస్‌ఫుల్ షోలో భారీ కుదుపు

  సక్సెస్‌ఫుల్ షోలో భారీ కుదుపు

  సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న జబర్ధస్త్ షోలో ఇటీవల ఓ కుదుపు కలకలం రేపింది. ఈ షోకు మొదటి నుంచి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు.. వ్యక్తిగత కారణాలతో దూరమయ్యారు. ఆయనతో పాటు కొందరు టీమ్ లీడర్లు, ఆర్టిస్టులు కూడా వెళ్లిపోయారు. అయితే, నాగబాబు మినహా మిగిలిన వారంతా తిరిగి సొంత గూటికి చేరుకున్న విషయం తెలిసిందే.

  నాగబాబు ప్లేస్‌ను భర్తీ చేసేది ఎవరు.?

  నాగబాబు ప్లేస్‌ను భర్తీ చేసేది ఎవరు.?

  జబర్ధస్త్ షో నుంచి మెగా బ్రదర్ ఒక్కసారిగా తప్పుకోవడంతో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ జోరుగా సాగింది. కొందరు ఆయన స్థానంలో ప్రముఖ కమెడియన్ అలీని తీసుకుంటారని అంటుండగా.. మరికొందరు మాత్రం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్‌ను ఎంపిక చేశారని చెప్పారు. ఈ లోపు రోజా ఒక్కరే షోను నడిపించారు.

  Nagababu Re-Entry Rumors Into Jabardasth || Filmibeat Telugu
  షో కోసం వాళ్లను తీసుకొచ్చారు

  షో కోసం వాళ్లను తీసుకొచ్చారు


  ఒక వారం రోజా ఒక్కరే జడ్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించడంతో, ఇక ఆమెతోనే షోను కంటిన్యూ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, దీనికి భిన్నంగా గురువారం వచ్చే ఎపిసోడ్‌కు ప్రత్యేక అతిథులను తీసుకొచ్చారు. అలాగే, శుక్రవారం వచ్చే దానికి మాత్రం అలీకి బాధ్యతలు అప్పగించారు. అయితే, రాబోయే రోజుల్లో ఎవరు ఉంటారన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు.

  ఆ నటుడి కోసం వెతుకుతున్న జబర్ధస్త్ టీమ్

  ఆ నటుడి కోసం వెతుకుతున్న జబర్ధస్త్ టీమ్

  ప్రస్తుతం జడ్జ్‌గా వ్యవహరిస్తున్న రోజాకు తోడుగా మరొకరిని వీలైనంత త్వరగా తీసుకోవాలని జబర్ధస్త్ నిర్వహకులు భావిస్తున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇందుకోసం తమకు వీలైనప్పుడల్లా డేట్స్ కేటాయించే ఓ నటుడి కోసం వెతుకులాట ప్రారంభించారని సమాచారం. ఆయన దొరికిన వెంటనే అగ్రిమెంట్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Jabardasth with tagline Katharnak Comedy Show is Telugu-language television channel comedy television series, broadcasts on the ETV Network channel which is shot at Annapoorna Studios, Telangana, India. The show is produced by Mallemala Entertainments and Directed by Nitin and Bharath.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X