రాత్రి నన్ను అక్కడ గోకుతూనే ఉన్నాడు.. హైపర్ ఆది గురించి జబర్దస్త్ వర్ష
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది ప్రతిభావంతులను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ షోలో అడుగుపెట్టిన ఎందరో సినిమాలలో, సీరియల్స్‌లో, ఇతర వినోద రంగాల్లో బిజీ అయ్యారు. యాంకర్లుగా, డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్లుగా, హీరోలుగా, హీరోయిన్లుగా, దర్శకులుగా ఎంతో మంది నేడు రాణిస్తున్నారు. ఇలాంటి వారిలో ఒకరు కోట ఆదయ్య అలియాస్ హైపర్ ఆది. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఆది నేడు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీగా నిలిచాడు.
అదిరే అభి టీమ్‌లో ఛాన్స్
ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆది.. జాబ్ చేస్తూనే తన టాలెంట్ నిరూపించుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా చిన్న చిన్న ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో అదిరే అభి ఆ వీడియోలు చూసి హైపర్ ఆదికి తన టీమ్‌లో అవకాశం ఇచ్చాడు. తన పంచ్‌లు ప్రాసలతో అనతికాలంలోనే స్టార్ కమెడియన్‌గా నిలిచిన ఆదికి టీమ్ లీడర్ అయ్యే అవకాశం కూడా వెతుక్కుంటూ వచ్చింది. రైజింగ్ రాజుతో కలిసి ఆది చేసిన స్కిట్లు బాగా పేలాయి. వీటికి మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో ఆది పేరు బాగా పాపులర్ అయ్యింది. అతని టీమ్‌లో చేస్తే చాలు ఫేమస్ అయిపోతారని అంతా అనుకున్నారు.

వెండితెరపైనా బిజీ
టాప్ కమెడియన్‌గా రాణిస్తూనే సినిమాలలోనూ అవకాశాలు అందుకున్నాడు. కమెడియన్‌గానే కాకుండా రైటర్‌గానూ తన సత్తా నిరూపించుకున్నాడు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన మేడ మీద అమ్మాయి సినిమాలో నటుడిగా డైలాగ్ రైటర్‌గానూ పనిచేశారు. ఈ సినిమా తర్వాత తొలి ప్రేమ, ఆటగదరా శివ, సవ్యసాచి ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు. జబర్దస్త్‌కు దూరమైన హైపర్ ఆది.. మధ్యమధ్యలో జబర్దస్త్‌లో గెస్ట్ రోల్ ఇస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. జబర్దస్త్‌తో పాటు తెలుగులో పలు ఛానెల్స్‌లోని షోలలో పాల్గొంటున్నాడు.
వర్షపై పంచ్‌ల వర్షం
ఈటీవీలో ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో అలరిస్తున్నాడు ఆది. తన పంచ్‌లతో ఎలాంటి వాతావరణంలోనైనా జోష్ తీసుకురావడం ఆది స్టైల్. స్కిట్ బాగా పండటం కోసం ఆది ఎవరి మీదైనా సరే పంచ్‌లు వేస్తాడు. కో కమెడియన్లతో పాటు జడ్జిలు, యాంకర్లు ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టడు. అయితే డబుల్ మీనింగ్‌తో కూడిన ఆది పంచ్‌ల కారణంగా కొందరు నొచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో జబర్దస్త్ వర్షపై తన పంచ్‌లతో విరుచుకుపడ్డాడు ఆది. వర్ష కూడా ఏమాత్రం తగ్గకుండా రివర్స్ పంచ్‌లతో కొట్టింది. ఇంతకీ ఆ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూస్తే..
పెళ్లిచూపులు కాన్సెప్ట్‌తో నవ్వులు
వర్షంలో పెళ్లి చూపులు కాన్సెప్ట్‌తో వచ్చిన ఎపిసోడ్‌లో వర్షంలో తడుస్తూ పెళ్లి చూపులు జరుగుతాయి. ఆదికి, యాంకర్ సౌమ్యారావుకు పెళ్లి చూపులు జరుగుతుండగా వర్ష వచ్చి.. అంకుల్ అని పిలుస్తుంది. అంకుల్ ఏంటే నేనే పెళ్లికొడుకు అని చెప్పడంతో వర్ష షాక్ అవుతుంది. పెళ్లి చూపుల్లో వర్షం వస్తుందని ఇబ్బంది పడుతున్నారా? అని వర్ష అడగ్గా.. వర్షం వచ్చిందని ఇబ్బంది పడటం లేదని వర్ష వచ్చిందనే కొంచెం ఇబ్బందిగా ఉందని పంచ్ వేస్తాడు ఆది. వర్షం వచ్చినప్పుడు తిడతారేంటీ అని వర్ష అడగ్గా.. తిట్టేది వర్షాన్ని కాదు వర్షని.. ఈ వర్షకు సిగ్గు లేదు, టైమింగ్ లేదు అని ఆది పంచ్‌లు వేస్తాడు. నిన్న రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను గోకుతూనే ఉన్నాడని వర్ష అనగా.. పక్కనే ఉన్న పొట్టి నరేష్ గాడు తూ నీ బతుకు చెడా దీనిని కూడా గోకాలని అనిపిస్తుందా అంటూ పంచ్‌లు విసురుతాడు.


Click it and Unblock the Notifications











