హీరోయిన్‌తో జబర్దస్త్ వర్ష గ్లామర్ పోటీ.. తలబాదుకొన్న జబర్దస్త్ కమెడియన్

తెలుగు వారిని దాదాపు 12 ఏళ్లుగా నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్ కామెడీ షో. తెలుగు నాట ఎన్ని కామెడీ కార్యక్రమాలు వచ్చినా జబర్దస్త్‌ను కొట్టే కార్యక్రమం రావడం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ 12 ఏళ్లలో జడ్జిలు మారినా, కమెడియన్లు మారినా, యాంకర్లు మారినా నేటికీ నిత్య నూతనంగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంది. తాజాగా ఈ వారానికి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. అది ఎలా ఉంది? ఎవరెవరు ఏ స్కిట్స్‌తో అలరించడానికి ముందుకు వచ్చారో ఒకసారి పరిశీలిస్తే..

మిడిల్ క్లాస్‌కి రిచ్‌కి తేడా తెలుసా?
తొలుత కొమరం, నూకరాజులు ముఖాలపై పిండి కొట్టుకుని ఎంట్రీ ఇస్తారు. మిడిల్ క్లాస్ అంటే ఏంటీ అని కొమరం అడగ్గా.. పైసలు తక్కువ, పిల్లలు ఎక్కువ ఉంటారు చూడు వాళ్లని మిడిల్ క్లాస్ అంటారని నూకరాజు చెబుతాడు. పైసలు తక్కువ ఉన్నప్పుడు పిల్లలు ఎందుకు ఎక్కువ అని కొమరం అడగ్గా.. రిచ్ పర్సన్స్‌కి పని తప్పించి వేరే కోరిక ఉండదు, మిడిల్ క్లాస్‌కి కోరికలు తప్పించి అసలు పనులే ఉండవని నూకరాజు చెప్పడంతో అంతా నవ్వేస్తారు.

Jabardasth Varsha fight with Actress Sridevi VijayKumar on Glamour

శ్రీదేవి అందంతో పోటీ
ఆ తర్వాత వర్ష ఓ పొట్టి కమెడియన్‌తో కలిసి స్టేజ్‌పైకి వస్తుంది. రావడం రావడంతోనే శ్రీదేవి గారు అందంగా ఉన్నారా? లేక నేను అందంగా ఉన్నానా? అని వర్ష అడగ్గా.. అతను మరో మాట లేకుండా ఆవిడే అందంగా ఉందని చెబుతాడు కమెడియన్. దాంతో ఎవరు అందంగా ఉన్నారని బుగ్గలు నిమురుతూ వర్ష అడగ్గా.. నువ్వే అందంగా ఉన్నావులే వదిలేయ్ అంటాడు. ఈ మాటలకు కోప్పడిన శ్రీదేవి.. ఎవరు అందంగా ఉన్నారో మీరు చెబితేనే స్కిట్ కంటిన్యూ అవుతుందని వార్నింగ్ ఇస్తుంది. దాంతో ఎవరూ కాదు.. నేను అందంగా ఉన్నాను వదిలేయమంటాడు.

ఎఫైర్లు బయటపెట్టిన ధనరాజ్
అనంతరం ధనాధన్ ధనరాజ్.. నా దగ్గర శ్రీదేవి గారి చీరలు, అనుష్క గారి చీరలు, జూనియర్ శ్రీదేవి గారి చీరలు, లేడీ గెటప్ చీరలు మన దగ్గర ఉన్నాయంటూ బండి మీద పెట్టుకుని వస్తాడు. అప్పారావు లేడీ గెటప్‌లో రాగా.. భర్త వేషం వేసిన కమెడియన్ అతని దగ్గర మాత్రం చీరలు కొనవద్దని చెబుతాడు. చీరలు ఎందుకు కొనను అంటున్నారని అప్పారావు అడగ్గా.. మీ ఆయన కంచిలో కామాక్షి, ధర్మవరంలో దీప, బెనారస్‌లో బేబీ ఉన్నప్పుడు.. ఈ తార్నాకలో ఉన్న తమన్నాకి చీర ఎందుకు కొనిస్తాడని ఫిటింగ్ పెడతాడు ధనరాజ్.

బెస్ట్ ఫ్రెండే నాశనం చేస్తాడు
అనంతరం ఆటో రాంప్రసాద్, సన్నీలు ఎంట్రీ ఇస్తారు. మన బెస్ట్ ఫ్రెండే మనల్ని నాశనం అయిపోవాలని కోరుకుంటాడని చెబుతాడు రాంప్రసాద్. నీకు మందు అలవాటు చేసిందెవరు? నీ కెరీర్ డల్ అయిపోవడానికి కారణం ఎవరు? నేను నీకు ఏం అవుతాను అని రాంప్రసాద్ అడగ్గా.. బెస్ట్ ఫ్రెండ్ అని సన్నీ ఆన్సర్ ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి దొరబాబు ఇంటికి వెళ్లి.. డోర్లు బాగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి, ఏ వుడ్‌ అని రాంప్రసాద్ అనగా.. టాలీవుడ్ అని చెబుతాడు దొరబాబు. మా ఇంట్లో కూడా మంచి డోర్లే ఉన్నాయని చెప్పగా.. ఏ వుడ్ అని అడుగుతాడు దొరబాబు.. దానికి బాలీవుడ్ అని ఆన్సర్ ఇస్తాడు రాంప్రసాద్. ఇక చివరిలో బుల్లెట్ భాస్కర్ వర్ష, పొట్టి నరేష్, ఫైమాలతో కలిసి బెగ్గర్ గెటప్‌లో చేసిన స్కిట్ కడుపుబ్బా నవ్వించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ వీక్ ఏ స్కిట్ బాగా పండింది? ఎవరి పంచ్‌లు బాగా పేలాయి? తెలియాలంటే ఈ శుక్ర, శనివారాల వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X