For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్‌‌లో ఆ టీమ్ లీడర్‌కు అవమానం: అన్యాయం జరిగిందని కన్నీరు.. వాళ్లిద్దరిపై సంచలన ఆరోపణలు

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతోన్న ఏకైక కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఎనిమిదేళ్లుగా టెలివిజన్‌ రంగంలో హవాను చూపిస్తోన్న ఈ కార్యక్రమం.. అప్పటికీ ఇప్పటికీ ఒకే రకమైన ప్రేక్షకాదరణను అందుకుంటూ దూసుకుపోతోంది. తద్వారా భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సైతం అందుకుంటోంది. దీంతో కొన్ని రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటోందీ సక్సెస్‌ఫుల్ షో.

  ఈ కార్యక్రమానికి పోటీగా ఎన్నో వచ్చినప్పటికీ అవన్నీ దీని ప్రభావానికి తట్టుకోలేక మధ్యలోనే ఆగిపోయాయి. అంతలా ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో జబర్ధస్త్ ప్రసారం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోలో ఓ టీమ్ లీడర్‌కు అవమానం జరిగింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా లీక్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వాళ్లంతా

  ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వాళ్లంతా

  బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ.. చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది జబర్ధస్త్. ఈ షో ద్వారా బుల్లితెరపైకి ఎంతో మంది టాలెంట్ ఉండి అవకాశాలు లేని వాళ్లు వెలుగులోకి వచ్చారు. వాళ్లే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు, టెక్నీషియన్లుగా వెలుగొందుతున్నారు. అలాగే, కొన్ని వందల మందికి ఈ షో ద్వారా జీవనోపాధి లభిస్తోంది.

  అందుకే ఇది విజయవంతంగా సాగుతోంది. ఇక, ఈ షో ద్వారా పరిచయం అయిన చాలా మంది ఇప్పుడు భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు.

  బోల్డు ఫొటోలతో యాంకర్ మంజూష రచ్చ: వామ్మో ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

  వాళ్ల జీవితాలను మార్చేసిన జబర్ధస్త్ షో

  వాళ్ల జీవితాలను మార్చేసిన జబర్ధస్త్ షో

  నెంబర్ వన్ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా ఎంతో మంది టాలెంట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు కూడా మరింతగా హైలైట్ అయ్యారు. వీళ్లిద్దరి నవ్వులు, స్కిట్ల మధ్యలో వేసే పంచులు బాగా పేలేవి. అందుకే ఈ ఇద్దరికీ మంచి పేరు వచ్చింది.

  నాగబాబు వెళ్లిపోయిన తర్వాత సింగర్ మనో ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. ఇక, ఇందులో యాంకర్లుగా చేస్తున్న అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌ కెరీర్‌కు కూడా ఈ షో ఓ రేంజ్‌లో బూస్టును ఇచ్చిందనే చెప్పాలి.

  షోలో మార్పులు... అటు ఇటు చేసేశారు

  షోలో మార్పులు... అటు ఇటు చేసేశారు

  రోజులు గడుస్తోన్న కొద్దీ జబర్ధస్త్ షోలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. కామెడీ డోసును పెంచేందుకు టీమ్ లీడర్లు అందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తూ కొత్త కొత్త స్కిట్లను రాసుకుంటున్నారు. అదే సమయంలో షో నిర్వహకులు కూడా కొన్ని హంగులను జోడిస్తూ ప్రేక్షకులకు మజాను పంచే ప్రయత్నం చేస్తున్నారు.

  ఇందులో భాగంగానే ఇటీవలే కొన్ని టీమ్‌లలో మార్పులు చేర్పులు జరిపారు. ఇందుకోసం కొందరు టీమ్ లీడర్లుగా ప్రమోషన్ పొందారు. అదే సమయంలో పలువురు ఆర్టిస్టులు అప్పటి వరకూ ఉన్న టీమ్‌లను వదిలి కొత్త వాటిలో చేరిపోయారు.

  జాకెట్ తీసేసి బాలయ్య హీరోయిన్ బోల్డ్ షో: అందాల ఆరబోతలో పట్టా తీసుకుందా ఏంటి!

  సందడిగా వచ్చే వారం జబర్ధస్త్ ఎపిసోడ్

  సందడిగా వచ్చే వారం జబర్ధస్త్ ఎపిసోడ్

  వచ్చే వారం ప్రసారం కాబోతున్న జబర్ధస్త్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో టీమ్ లీడర్లు సరికొత్త స్కిట్లతో ప్రేక్షకులకు మజాను పంచబోతున్నారు. ఈ ప్రోమో ఆరంభంలోనే హైపర్ ఆది, నరేష్ వాళ్ల గురువులైన అదిరే అభి, బుల్లెట్ భాస్కర్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి మొదలైన సందడి.. చివరి వరకూ కొనసాగింది.

  మధ్యలో జడ్జ్‌లు రోజా, మనో యాంకర్ అనసూయ భరద్వాజ్ వేసే పంచులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇది యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

  జబర్ధస్త్‌లో ఆ టీమ్ లీడర్‌కు అవమానం

  జబర్ధస్త్‌లో ఆ టీమ్ లీడర్‌కు అవమానం

  రాబోయే గురువారం ఎపిసోడ్ ఎంత ఫన్‌గా ఉండబోతుందో తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. ఫలితంగా వచ్చే వారం ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. అదే సమయంలో చివర్లో ఇందులో ఓ షాకింగ్ సంఘటనను కూడా యాడ్ చేశారు. ఇందులో తనదైన శైలి కామెడీతో అలరిస్తోన్న టీమ్ లీడర్ వెంకీ బాధ పడుతూ కనిపించాడు. అంతేకాదు, అతడు ఇందులో సంచలన ఆరోపణలు కూడా చేశాడు. దీంతో జబర్ధస్త్ వెంకీకి ఏదో అవమానం జరిగిందన్న విషయం అర్థం అవుతోంది. ఫలితంగా షోలో విభేదాలు బయటకు వచ్చినట్లు అయింది.

  గ్లామర్ షోతో సెగలు రేపుతోన్న అల్లు అర్జున్ ఏంజెల్: అదిరిపోయే ఫోజులతో అదరగొడుతోన్న బ్యూటీ

  అన్యాయం జరిగిందని కన్నీటి పర్యంతం

  అన్యాయం జరిగిందని కన్నీటి పర్యంతం

  జబర్ధస్త్‌ షోలో వెంకీతో పాటు తాగుబోతు రమేష్ ఒకే టీమ్‌కు లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ల స్కిట్ అయిన తర్వాత ఏదో సంఘటన జరిగింది. ఇక, ఈ ప్రోమో చివర్లో జబర్ధస్త్ వెంకీ ఏడుస్తూ కనిపించాడు. అప్పుడు జడ్జ్ మనో ఏమైందని అడిగాడు. దీనికతడు ‘చేసేది నేను.. చేపించేది నేను' అంటూ ఎమోషనల్ అయ్యాడు. దీనికి మనో ‘నువ్వు చేపించినా.. వాళ్లు బ్రహ్మాండగా చేస్తున్నారు' అని బదులిచ్చారు. దీంతో వెంకీ మరింతగా బాధ పడ్డాడు. అప్పుడు రమేష్ వెళ్లి ఓదార్చినా ఆగలేదు. దీంతో అతడికి క్రెడిట్ ఇవ్వలేదని ప్రోమోను బట్టి అర్థం అవుతోంది.

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
  షో జరుగుతున్న తీరుపై అనుమానాలు

  షో జరుగుతున్న తీరుపై అనుమానాలు

  జబర్ధస్త్ వెంకీ ఏడుస్తూ తనకు క్రెడిట్ ఇవ్వలేదన్నట్లు మాట్లాడాడు. దీంతో ఇద్దరు జడ్జ్‌లపై అతడు అసహనం వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశాడన్నట్లు చూపించారు. తద్వారా ఈ కామెడీ షోలో విభేదాలు, అవమానాలు కూడా జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఫలితంగా మరికొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఇది నిజంగానే జరిగిందా? లేక టీఆర్పీని పెంచడంలో భాగంగా చూపించారా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికి గురువారం జరిగే ఎపిసోడ్ మాత్రం ఫన్‌తో పాటు ఎమోషనల్‌గా సాగనుంది.

  English summary
  Jabardasth Very Famous Comedy Show is Telugu language. This Show Running Succesfully. Now Jabardasth Venky Did Sensational Allegations on Jabardasth Judges.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X