For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోలీస్ స్టేషన్‌కు జబర్ధస్త్ వినోద్: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు.. అప్పుడలా ఇప్పుడిలా చేయడంతో!

  |

  తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ.. చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది జబర్ధస్త్. దాదాపు ఎనిమిదేళ్లుగా టెలివిజన్ రంగంలో సత్తా చాటుతోన్న దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. అందులో లేడీ గెటప్‌ల స్పెషలిస్టుగా పేరొందిన వినోద్ అలియాస్ వినోదిని కూడా ఒకరు. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. పలు వివాదాల వల్ల ఫేమస్ అయిన అతడు.. తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఆ వివరాలు మీకోసం!

   అలా కెరీర్‌ను మొదలు పెట్టిన వినోద్

  అలా కెరీర్‌ను మొదలు పెట్టిన వినోద్

  యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో హైదరాబాద్‌లో అడుగు పెట్టాడు వినోద్. అలా చాలా కాలం పాటు అవకాశాల కోసం ఎదురు చూశాడు. ఈ సమయంలోనే కొన్ని చిన్న చిత్రాల్లో నటించాడు. అలా కెరీర్ ఆరంభంలోనే యాక్టర్‌గా కొన్ని చిత్రాల్లో మెప్పించాడు వినోద్. ఆ తర్వాత కొందరు టీమ్ లీడర్ల సహాయంతో జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయ్యాడు.

   ఇలా ఫేమస్ అయ్యాడు.. పేరు కూడా

  ఇలా ఫేమస్ అయ్యాడు.. పేరు కూడా

  జబర్ధస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాడు వినోద్. ఎప్పుడూ ఆడ వేషాలతోనే కనిపించే అతడు.. వినోదిని అనే పేరుతో బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా చమ్మక్ చంద్ర స్కిట్లలో అప్పట్లో అతడు చేసే పర్‌ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. జబర్ధస్త్ షోలోనే కాకుండా బయట జరిగే ఈవెంట్లకు కూడా ఆడవేషాలతోనే వెళ్తుంటాడు. తద్వారా ఎనలేని గుర్తింపు పొందాడు.

  మరో అవతారంలో జబర్ధస్త్ వినోదిని

  మరో అవతారంలో జబర్ధస్త్ వినోదిని

  జబర్ధస్త్ షోతో ఊహించని రీతిలో క్రేజ్‌ను అందుకున్నాడు వినోద్. దీని తర్వాత కొన్ని సినిమాల్లోనూ నటించాడు. అలాగే, మరికొన్ని షోలలోనూ పాల్గొంటున్నాడు. ఇలాంటి సమయంలోనే యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా అడుగులు వేశాడు. ఇందులో భాగంగానే ఎంతో మంది సెలెబ్రిటీలను లేడీ గెటప్‌లోనే ఇంటర్వ్యూలు చేశాడు. తద్వారా చేతినిండా సంపాదిస్తున్నాడు.

  వివాదాలతో సహవాసం చేసే వినోద్

  వివాదాలతో సహవాసం చేసే వినోద్

  జబర్ధస్త్ కమెడియన్ వినోద్ తీరు మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఒకసారి వినోద్‌కు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నింగా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత అతడు కిడ్నాప్‌కు గురయ్యాడు. కొద్ది రోజుల క్రితం ఇంటి యజమాని చేసిన దాడి ఘటనతో అతడు మరోసారి వార్తల్లోకి నిలిచిన విషయం తెలిసిందే.

  బాలీవుడ్‌లోకి ఎంట్రీ.. పోర్న్ స్టార్‌తో

  బాలీవుడ్‌లోకి ఎంట్రీ.. పోర్న్ స్టార్‌తో

  వినోద్ గతంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘నేను బాలీవుడ్‌లోకి ఎంటర్ అవుతున్నా. పూనమ్ పాండే లీడ్ రోల్ చేస్తున్న ఓ మూవీలో నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్‌‌లో మూడు రోజులు పాల్గొన్నా. ఆ తర్వాత నాపై దాడి జరగడంతో నా డేట్స్‌లో కొన్ని మార్పులు చేశారు. త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ అవుతా' అని చెప్పినా అది సాధ్యం కాలేదు.

   పోలీస్ స్టేషన్‌కు జబర్ధస్త్ వినోద్ రాక

  పోలీస్ స్టేషన్‌కు జబర్ధస్త్ వినోద్ రాక

  వివాదాలతో సతమతం అవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు జబర్ధస్త్ వినోద్. ఈ మధ్య కాలంలో ఎటువంటి గొడవలు లేకుండా కెరీర్‌ను సాఫీగా నడుపుకుంటున్నాడని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా అతడు మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తనకు న్యాయం చేయాలంటూ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిని ఆయన ఆఫీసులో కలిశాడు.

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
   నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు

  నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు

  గతంలో తనపై దాడి చేసిన ఇంటి యజమానిపై మరోసారి కంప్లైంట్ చేశాడు వినోద్. తనకు రూ. 40 లక్షలకు ఇల్లు అమ్ముతానని రూ. 13 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడని, ఆ తర్వాత రేటు పెంచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇప్పుడు తాను చెప్పిన ధరకే ఇల్లు కొనాలని.. లేకుంటే ఆ డబ్బులు తిరిగి ఇవ్వనని ఓనర్ ఇబ్బంది పెడుతున్నట్లు పోలీసులకు కంప్లైంట్ చేశాడు వినోద్.

  English summary
  Jabardasth Comedy Show famous in telugu television history. One Of The comedian Name vinod Also Famoused By This Show. He plays lady getups In Ths Show. Now He Enters Bollywood Through Poonam Pandey Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X