»   »  ఏమిటీ ...కామెడీ షోకు జాకీఛాన్ గెస్ట్ గా వస్తున్నారా...షాక్

ఏమిటీ ...కామెడీ షోకు జాకీఛాన్ గెస్ట్ గా వస్తున్నారా...షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: టీవీ టాక్ షోలకు సినిమా సెలబ్రెటీలు తమ సినిమాల ప్రమోషన్ నిమిత్తం రావటం కొత్తేమీ కాదు. అయితే తాము ఊహించని గెస్ట్ లు వచ్చినప్పుడు మాత్రం నిర్వాహకులు షాక్ అవుతూంటారు. ఇప్పుడు అదే పరిస్దితి కపిల్ శర్మది.

కామెడీ షోలలో కపిల్ శర్మది ట్రేడ్ మార్క్ , ఆయన పేరు ఆ షోలతో పేరు దేశంలో మార్మోగిపోతుంటుంది. సినిమా సెలబ్రిటీలను పిలవడం, త్వరలో విడుదల కాబోతున్న వాళ్ల సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు ఆగకుండా గంట పాటు విపరీతంగా నవ్వించే కపిల్ షో అంటే చాలామందికి క్రేజ్.

Jackie Chan

హీరోయిన్లను తనదైన శైలిలో ఆరాధించే కపిల్ చేష్టలు చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే అంటారు వీక్షకులు. అలాంటి షోకు ఈసారి ఎవరు వస్తున్నారో తెలుసా.. సాక్షాత్తు జాకీ చాన్!! అవును.. ఇప్పటికే షారుక్, సల్మాన్ సహా పెద్ద పెద్ద స్టార్లందరినీ తన షోలోకి తీసుకొచ్చిన కపిల్ శర్మ ఇప్పుడు రాబోతున్న అతిథి గురించి తెలిసి ఒక్కసారిగా షాకయ్యాడు. తాను నటించిన సినిమా 'కుంగ్‌ఫూ యోగా' ప్రమోషన్ కోసం జాకీ చాన్ ఈ షోకు రావాలని నిర్ణయించుకున్నాడట.

ఆ విషయాన్ని కపిల్ ట్వీట్ చేశాడు. 'ఓ మై గాడ్.. కపిల్ షోలో జాకీచాన్' అని ఒక్క లైన్ మాత్రమే పెట్టాడు.

ఇక జాకీ చాన్ ఇండియాలో అడుగుపెట్టారు. తన కొత్త చిత్రం 'కుంగ్ ఫూ యోగా' ప్రమోషన్ కోసం నిన్న ముంబై వినాశ్రయానికి చేరుకున్న ఆయనకు సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ తదితరులు సాదర స్వాగతం పలికారు. జాకీచాన్ వెంట 'కుంగ్ ఫూ యోగా' దర్శకుడు స్టాన్లీ టాంగ్ కూడా ఉన్నారు.

తనకు లభించిన స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపిన జాకీచాన్ అనంతరం ఫిల్మ్‌సిటీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగే సినిమా ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం తన గౌరవార్దం సోనూసూద్ ఏర్పాటు చేసే పార్టీలో పాల్గొంటారు. ఇదే సినిమాలో మరో కీలక పాత్ర పోషించిన దిశా పఠానితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్ కూడా పార్టీకి హాజరుకానున్నారు.

రీసెంట్ గా రిలీజైన యాక్షన్ ఓరియంటెడ్ ఎంటర్ టైనర్ 'కుంగ్ ఫూ యోగ' లో జాకీచాన్ బాలీవుడ్ స్టైల్ లో మెస్మరైజ్ చేయనున్నాడు. ఇటు రాజస్థాన్ లోని కొన్ని ఇంటరెస్టింగ్ లొకేషన్ లతో పాటు, చైనా లోని మ్యూజియం ఆఫ్ చైనా లో షూటింగ్ జరుపుకున్న 'కుంగ్ ఫూ యోగ' అటు చైనీస్ కల్చర్, ఇటు ఇండియన్ కల్చర్ కాంబినేషన్ లో ఎట్రాక్ట్ చేస్తుంది. సింహాలు, కార్ చేజింగ్ సీన్స్ హైలెట్ గా నిలిచిన ట్రేలర్ సంథింగ్ స్పెషల్ మూవీ అనిపించుకుంటుంది.

ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సోనూ ''జాకీ చాన్‌తో కలిసి నటించడం తన కల అని, 'కుంగ్ ఫు యోగ' సినిమాతో ఆ కల నేరవేరిందన్నాడు. అంతేకాకుండా నేను కలిసి పనిచేసిన నటుల్లో జాకీచాన్ అత్యంత వినయం గలవారు' అని కితాబిచ్చారు.

సూపర్ స్టార్ జాకీచాన్, సోను సూద్, దిశా పటాని, అమిరా దస్తర్, ఎరిక్ సాంగ్, జాంగ్ గౌళి, యోగ మాస్టర్ ముఖిమియా నటించిన ఈ సినిమా ఇంగ్లిష్, హిందీ, మాండరిన్ భాషల్లో రిలీజవుతుంది. సింగపూర్, చైనా దేశాల్లో జనవరి లాస్ట్ వీక్ లో రిలీజవుతున్న కుంగ్ ఫు యోగ, ఇండియాలో ఫిబ్రవరి 3 న రిలీజవుతుంది.

కుంగ్‌ఫూ యోగా సినిమాలో బాలీవుడ్ నటీ నటులు దిశాపటానీ, సోనూ సూద్, అమైరా దస్తూర్ కీలక పాత్రలు పోషించారు. ఇందులో జాకీచాన్‌ది ఒక పురావస్తు శాస్త్రవేత్త పాత్ర.

English summary
The next guest on Kapil's show will be none other than superstar and martial arts expert Jackie Chan. Kapil Sharma broke the news of Jackie coming on his show on Twitter, which took everyone by surprise. He tweeted, "Oh my god .. #jackiechanontkss."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu