Don't Miss!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- News
AP DGP Twitter : ఏపీ డీజీపీ ట్విట్టర్ ఖాతాలో బూతు బొమ్మలు- డీఐజీ వార్నింగ్..
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Sports
INDvsNZ : హార్దిక్, షమీ అవుట్.. ఉమ్రాన్ ఇన్.. మూడో వన్డే ఆడే భారత జట్టు ఇదే!
- Technology
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
Janaki Kalaganaledu January 18th: జెస్సి తండ్రి మాటలకు అందరూ షాక్.. కథను మలుపు తిప్పే మరో ట్విస్ట్!
జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా మారుతోంది. అఖిల్ జాబ్ కోసం అని రామ చేసిన అప్పు కారణంగా జ్ఞానాంబ ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది. ఇక ఆ సమస్యల వలన రామ భార్య జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 480 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

కూతురి కోసం వచ్చిన పీటర్
ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అయితే జెస్సి తండ్రి పీటర్ కూడా వచ్చి తన కూతురిని ఇంట్లో నుంచి తీసుకుని వెళ్లాలని అనుకుంటాడు. ఇలాంటి పరిస్థితులలో తన కూతురిని ఇక్కడ ఉంచలేను అని అసలే తను కడుపుతో ఉంది కాబట్టి కూతురుతో పాటు అల్లుడిని కూడా మా ఇంటికి తీసుకువెళ్తాను అని అంటాడు. మీ ఫ్యామిలీ గొప్పగా ఉందని మా అమ్మాయిని ఇంటికి కోడలిగా పంపించాము. కానీ ఇప్పుడు ఇలాంటి స్థితికి తీసుకువచ్చారు. నా కూతురు ఇక్కడ సౌకర్యంగా ఉండలేదు కాబట్టి తీసుకువెళ్లిపోతాను అని అంటాడు.

జెస్సి సమాధానం
అయితే జ్ఞానాంబ మాత్రం ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు అని మళ్లీ త్వరగానే కోలుకుంటాము అని కూడా అతనికి నచ్చజెప్పి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ జస్సీ తండ్రి మాత్రం ఆ మాటలు పట్టించుకోడు. అయితే మరోవైపు జెస్సి కూడా తండ్రితో రావడానికి ఏమాత్రం ఇష్టపడదు. ఈ రోజు నా కుటుంబ పరిస్థితి బాగోలేకపోవడం వలన నేను ఇంటికి వస్తే కోడలిగా నాకు ఏ అర్థం ఉండదు అని ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను అని అంటుంది. అంతేకాకుండా ఇక్కడ నాకు ఏమీ తక్కువ అయింది అని ఇల్లు చిన్నగా ఉండవచ్చు కానీ ఇక్కడ ప్రేమ అనురాగాలకు ఏమాత్రం కొదవలేదు అని చెబుతుంది.

జెస్సి తండ్రి ఆవేశంగా..
అంతే కాకుండా జానకి అక్క కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అని కూడా అని చెబుతుంది. ఒక కూతురుగా మీరు ఏ పండుగ కైనా నన్ను తీసుకువెళ్తే సంతోషిస్తాను. కానీ ఇప్పుడు ఈ విధంగా తీసుకువెళ్తాను అంటే నేను రాలేను అని అలాగే మా అత్తగారు చెప్పే వరకు కూడా నేను మీ ఇంటికి రాలేను అని చెబుతుంది. ఇక జెస్సి ఆ విధంగా మాట్లాడటంతో ఆమె తండ్రి జానకి పై కొంత అసహనం వ్యక్తం చేస్తాడు. నీ కారణంగానే నా కూతురుని మీ ఇంటికి పంపించాను. ఇప్పుడు నీ మనసు హ్యాపీగా ఉందా అని అతను చాలా వెటకారంగా మాట్లాడుతాడు. ఇక జానకి ఏమీ మాట్లాడలేదు పరిస్థితుల్లో ఉంటుంది.

జ్ఞానాంబ అసహనం
వియ్యంకుడు ఆ విధంగా మాట్లాడడంతో ఎప్పుడు కూడా తాను ఎవరితోనూ మాటలు పడలేదు అని జ్ఞానాంబ కూడా బాధపడుతుంది. అంతేకాకుండా ఈ విషయం ఎవరికీ అర్థం కావాలో వారికి అర్థమైతే బాగుంటుంది అని ఈ కుటుంబ పరిస్థితి ఇంతవరకు తీసుకువచ్చిన వారికి ఇంకా బాగా అర్థం కావాలి అని జానకిరామలపై జ్ఞానాంబ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక జానకి జెస్సీ తండ్రి మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది.

అఖిల్ కోపం
ఇక అప్పుడే రామచంద్ర వచ్చి ఆ విషయం నేను కూడా బాధపడుతున్నాను అని అంటాడు. అయితే ఏ తండ్రి అయిన సరే తన కూతురు గొప్ప ఇంట్లో ఉండాలి అని కోరుకుంటాడు అని ఆ విధంగా బాధతో మాట్లాడి ఉండవచ్చు అని జానకి అంటుంది. ఇక మరోవైపు అఖిల్ తన భార్యను తీసుకుని అత్తగారింటికి వెళ్లడానికి ఒప్పుకుంటాడు. అందుకోసం జెస్సీతో ప్రత్యేకంగా మాట్లాడుతాడు. మనం ఇంట్లో ఉండకూడదు అని మీ నాన్నగారు ఇంటికి వెళ్లి అక్కడే ఉందామని, ఒకరు చేసిన తప్పు కారణంగా మనం బాధపడడం ఎందుకు అని అఖిల్ మాట్లాడతాడు. ఇక అఖిల్ అలా స్వార్థం గా మాట్లాడడంతో ఏ మాత్రం ఒప్పుకోడు. అతనికి చాలా కోపం వస్తుంది.

గుడిలో రామ క్యాటరింగ్
ఇక
పరిస్థితులను
చూసి
గోవిందరాజులు
కూడా
ఒక్కసారిగా
కంటతడి
పెట్టుకుంటాడు.
జానకిని
జెస్సి
తండ్రి
ఆ
విధంగా
అని
ఉండకూడదు
అని
ఆయన
అనుకుంటాడు.
ఇక
తాను
ఏమీ
బాధపడటం
లేదు
అని
జానకి
మామ
గారికి
నచ్చచెప్పే
ప్రయత్నం
చేస్తుంది.
ఇక
మరోవైపు
మల్లికా
జ్ఞానాంబ
ఇద్దరు
కూడా
గుడికి
వెళ్లి
పూజ
చేయాలని
అనుకుంటారు.
అయితే
అదే
గుడిలో
ఒక
బరసాల
వేడుకలో
రామచంద్ర
క్యాటరింగ్
చేస్తూ
ఉంటాడు.
అతనికి
తోడుగా
జానకి
కూడా
సహాయం
చేస్తూ
ఉంటుంది.

సునంద వెక్కిరిస్తూ..
అయితే ఆ ఫంక్షన్ కు సంబంధించిన వారు జ్ఞానాంబను కూడా పిలుస్తారు. బారసాలు ఉందని నా మనవడిని అ మీరే ఆశీర్వదించాలి అని ఒక మహిళ చెప్పడంతో జ్ఞానాంబ సరే వస్తాను అని చెబుతుంది. అయితే అదే వేడుకకు జ్ఞానాంబ శత్రువు సునంద కూడా వస్తుంది. ఇక జానకి ఆ క్యాటరింగ్ లో పనిచేస్తూ ఉండడంతో కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ ఈ విధంగా ప్లేట్లు తుడుచుకుంటూ ఉందా అని వెక్కిరిస్తూ ఉంటుంది. ఆమెకు కూడా జానకి కౌంటర్ ఇస్తుంది. మరి ఈ పరిస్థితి జ్ఞానాంబ కంట పడితే ఏ విధంగా మాట్లాడుతుందో చూడాలి.