For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu January 1st: రామ అప్పు వలన ఇంటిని పోగొట్టుకునే పరిస్థితి.. షాక్ లో జానకి!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో కొనసాగుతోంది. రామ చిన్న తమ్ముడు అఖిల్ కోసం రామ చేసిన అప్పు ఇంట్లో వాళ్ళను ఇబ్బందుల్లో పడేస్తుంది. అఖిల్ పని లేకుండా ఖాళీగా ఉండడంతో అతను సెటిల్ అయితే బాగుంటుంది అని ఇంట్లో వాళ్ళు అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇక జానకి, రామ కూడా అదే ఆలోచిస్తారు. అయితే అఖిల్ మాత్రం జానకి పై కోపం తెచ్చుకుంటాడు. జానకి ఆ విషయంలో గొడవలు రాకుండా చేయాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 467 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  మోసం చేసాడని తెలిసి..

  మోసం చేసాడని తెలిసి..

  రామచంద్ర చేసిన ఒక తప్పు కారణంగా ఇంట్లో అందరూ కూడా సమస్యల్లో పడతారు. తన తమ్ముడు అఖిల్ జీవితం బాగుండాలి అని అతని జాబ్ కోసం రామచంద్ర 20 లక్షలు అప్పు చేస్తాడు. అది కూడా ఇంటి పత్రాలను తాకట్టుపెట్టి డబ్బు తీసుకొస్తాడు. తన పాత స్నేహితుడు కొత్తగా కంపెనీ పెడుతున్నాడు అని మాయమాటలు నమ్మిన రామచంద్ర ఆ డబ్బు అతనికి ఇస్తాడు. అయితే అతను ఆ తర్వాత మోసం చేసాడని తెలిసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. దీంతో రామచంద్ర తో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతారు.

  తండ్రికి పక్షవాతం

  తండ్రికి పక్షవాతం

  ముఖ్యంగా ఎప్పుడు తనను ప్రేమగా చూసుకునే వారు కూడా తిడుతూ ఉండడంతో రామచంద్ర తట్టుకోలేక పోతాడు. అయితే ఈ క్రమంలో రామచంద్ర తండ్రి గోవిందరాజులు కూడా మంచన పడతాడు. అతనికి పక్షవాతం వచ్చిందని డాక్టర్ చెప్పడంతో జ్ఞానాంబ కూడా షాక్ అవుతుంది. దీంతో రామచంద్రకు ఏం చేయాలో అర్థం కాదు.

  మొత్తం డబ్బు ఇవ్వాలి

  మొత్తం డబ్బు ఇవ్వాలి

  ఇక అప్పు ఇచ్చిన సుబ్బారావు కూడా ఊహించని విధంగా అప్పుడే డబ్బులు అడగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీ ఇంట్లో పరిస్థితి ఇప్పుడు బాగోలేకపోయినప్పటికీ అడగలేకపోతున్నాను. ఇంతకుముందు ఎలాగైతే 5 లక్షలు అప్పు ఇచ్చానో అదే నమ్మకంతో మీ రామచంద్ర కు కూడా 20 లక్షలు అప్పు ఇచ్చాను. అయితే ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే నా డబ్బు మళ్ళీ తిరిగి రాదేమో అనిపిస్తుంది. నేను ఇప్పుడు జాలిపడితే నా కుటుంబం రోడ్డున పడుతుంది. అందుకే మూడు రోజుల్లో డబ్బు ఇవ్వాలి లేదంటే ఇంటిని జప్తు చేస్తాము అని అతను అనడంతో అందరూ షాక్ అవుతారు.

  విష్ణు వడ్డీ కూడా కట్టలేదు

  విష్ణు వడ్డీ కూడా కట్టలేదు

  అంతేకాకుండా మీ రెండవ అబ్బాయి విష్ణు వడ్డీ డబ్బులు కూడా ఇవ్వడం లేదు అని చెప్పడంతో జ్ఞానాంబ కూడా ఆశ్చర్యపోతుంది. వడ్డీ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు అని తల్లి అడగగానే అతను సైలెంట్ గా ఉండిపోతాడు. దీంతో మల్లికా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. కరోనా కారణంగా బిజినెస్ బాగా జరగలేదు అని షాప్ రెంట్ డబ్బులే కట్టడానికి చాలా కష్టంగా ఉంది మీకు అలాంటిది వడ్డీ డబ్బులు ఎలా కడతామని అబద్ధం చెబుతుంది. అయితే సుబ్బారావు ఇంటిని జప్తు చేస్తాము అని చెప్పడంతో మల్లిక సీరియస్ అయిపోతుంది. ఇల్లు ఒకరిది కాదు అని అందరికీ ఇంటిలో భాగముంది కాబట్టి ఈ విషయంలో అలా జరిగితే బాగుండదు అని మల్లికా హెచ్చరిస్తుంది.

  రామపై అనుమానాలు

  రామపై అనుమానాలు

  అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా రామచంద్రను తిట్టడమే కాకుండా అతని భార్య జానకిని కూడా అనుమానిస్తూ ఉంటారు. జానకి కారణంగానే అన్నయ్య ఇలా చేస్తున్నాడు అని తన జాబ్ కోసం డబ్బులు కట్టినట్లు అబద్ధం చెప్పి ఉండవచ్చు అని కూడా అంటాడు. అంతేకాకుండా మల్లికా అయితే ఎక్కడైనా సొంతంగా ఫ్లాట్ తీసుకున్నారేమో అని అందుకోసమే 20 లక్షలు ఇంటిని తాకట్టు పెట్టి తీసుకున్నారు అని అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో మల్లిక భర్త విష్ణు తో పాటు అఖిల్ కూడా అదే తరహాలో అనుమానించడంతో రామచంద్ర ఒక్కసారిగా కృంగిపోతాడు. తమ్ముడు భవిష్యత్తు కోసం ఆలోచిస్తే తనకు ఇలా జరిగింది ఏంటి అని ఆవేదన చెబుతూ ఉంటాడు.

  నా మాటలు నువ్వు పట్టించుకోలేదు

  నా మాటలు నువ్వు పట్టించుకోలేదు

  అయితే అతని తల్లి జ్ఞానాంబ కూడా రామచంద్రపై ఊహించిన విధంగా కామెంట్ చేస్తుంది. అసలు నీకు చదువుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకూడదు అని అనుకున్నాను. జానకి నీ జీవితంలోకి వచ్చిన తర్వాతనే నీలో చాలా మార్పు వచ్చింది. ఎన్నోసార్లు నా మాటలు నువ్వు పట్టించుకోలేదు. ప్రతి విషయం కూడా నాతో చెప్పుకునే వాడివి. కానీ ఇంత పెద్ద విషయాన్ని నువ్వు నాతో చెప్పలేదు.. అని జ్ఞానాంబ అంటుంది.

  మరో తప్పు చేస్తున్న రామ

  మరో తప్పు చేస్తున్న రామ

  అంతేకాకుండా నువ్వు నాకు చెప్పకుండా నిన్నా మొన్న వచ్చిన నీ భార్యకు నిజం చెప్పావు. ఇక ఆమె కూడా అసలు విషయాన్ని నాతో చెప్పకుండా దాచి పెట్టింది. నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు మీ నాన్నగారు మంచాన పడ్డారు అని జ్ఞానాంబ చాలా సీరియస్ అవుతుంది. అయితే రామచంద్ర 20 లక్షలు అప్పు తీర్చాలంటే మళ్ళీ మన స్వీట్ షాప్ తాకట్టు పెట్టాలి అని అనుకుంటాడు. ఇక ఆ విషయాన్ని తన తల్లితో కూడా చెప్పాలని అనుకుంటాడు. మరి ఈ విషయంలో జ్ఞానాంబ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial 2023 January 1st Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X