For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu December 14th: ఓవైపు సీమాంతం.. మరోవైపు జానకి రామ రొమాన్స్.. న్యూ ట్విస్ట్

  |

  జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన కథాంశంతో ఆకట్టుకుంటోంది. జ్ఞానాంబ రెండవ కోడలు మల్లికా అబద్ధపు గర్భంతో ఇన్నాళ్లు ఇంట్లో అందరిని మోసం చేస్తుంటుంది. ఏ పని చేయకుండా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటుంది. అయితే చివరికి ఆ కడుపు విషయం తెలిసే సందర్భం ఎదురవుతుంది అని కడుపే పోయినట్లుగా అబార్షన్ అయినట్లుగా నాటకం ఆడుతుంది. ఇక ఇంట్లో అందరూ నమ్ముతారు. కానీ జనాకికి ముందే ఆ విషయం తెలిసినప్పటికీ కూడా బయటకు చెప్పదు.

  ఇక మరోవైపు చిన్న కోడలు జెస్సికి సీమంతం చేయాలని అనుకుంటారు. అయితే జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 453 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  సీమంతం.. సంతోషం

  సీమంతం.. సంతోషం

  ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి అని ఇంట్లో ఏదైనా వేడుక చేస్తే బాగుంటుంది అని ఆలోచనతో జ్ఞానాంబ నాలుగో నెల నిండగానే తన మూడవ కోడలు జెస్సికి సీమంతం చేయడానికి ఒప్పుకుంటుంది. జెస్సీ తల్లిదండ్రులకు కూడా ఆ విషయాన్ని ఫోన్ చేసి చెబుతుంది. అయితే జెస్సి తల్లి మాత్రం ఇంట్లో లేకపోవడం వలన తాను మాత్రమే వస్తాను అని జెస్సీ ఫాదర్ చెబుతాడు.

  మరోసారి వాయిదా వేసుకుందామని అన్నప్పటికీ కూడా జెస్సీ తండ్రి అలా జరగకూడదు అని ఒక్కరి వల్ల కార్యం ఆగిపోతే బాగుండదు అని నచ్చ చెబుతాడు. ఇక జ్ఞానాంబ ఎంతో సంతోషంగా రేపు సీమంతం జరగబోయే కార్యక్రమానికి అందరూ కూడా కావాల్సిన పూజా సామాగ్రిని కూడా సిద్ధం చేయాలి అని ఆదేశాలు జారీ చేస్తుంది.

  ఆమె బాధలో ఉంది

  ఆమె బాధలో ఉంది

  ముఖ్యంగా రామచంద్ర కు భోజనాలు స్వీట్స్ కు సంబంధించి పనులు చూసుకోమని చెబుతుంది. ఇక జానకి కూడా పసుపు కుంకుమ చీరలు వచ్చిన అతిథులకు ఇవ్వాలి అని సలహాలు ఇస్తుంది. అంతేకాకుండా ఏమైనా అవసరమైతే నన్ను అడగాలని జ్ఞానాంబ చెబుతుంది. అయితే ఈ క్రమంలో మల్లిక ఒక దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది.

  ఆమె బాధలో ఉంది అనుకున్న జ్ఞానాంబ మల్లికకు కూడా అబార్షన్ కాకపోయి ఉంటే ఇప్పుడు ఇద్దరికీ కూడా శ్రీమంతం జరిగి ఉండేది అని జ్ఞానాంబ బాధపడుతూ ఉంటుంది.

  విష్ణు సంతోషం

  విష్ణు సంతోషం

  అయితే రేపు వేడుకకు వచ్చే అందరూ కూడా మల్లికను పరామర్శిస్తే మరింత బాధపడుతుంది అని అందుకే ఆమెను వారి పుట్టింటికి తీసుకు వెళ్ళమని విష్ణుతో చెబుతుంది. అయితే విష్ణు మాత్రం తన తమ్ముడు తండ్రి కాబోతున్నాడు అని మరదలి సీమంతం జరుగుతోంది అని ఈ సమయంలో మేము ఎక్కడికో వెళ్లడం కరెక్ట్ కాదు అని చెబుతాడు.

  ఒక విధంగా అలా జరిగినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం మరో బిడ్డ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెబుతాడు.

  జనకి కౌగిలిలో రామ

  జనకి కౌగిలిలో రామ

  ఇక మరోవైపు రామచంద్ర, జానకిని మళ్లీ ఎలాగైనా చదువుపై దృష్టి మళ్లించేలా చేయాలని అనుకుంటాడు. జానకి రాగానే ఎదురుగా ఆమె గెలుచుకున్న అవార్డులను పుస్తకాలను చూపిస్తు ఆమె లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. ఇక నేను అన్న ఒక్క మాట వలన మీరు చదువుకునే దూరం పెట్టారు.

  మీరు మళ్ళీ చదువుకుంటాను అనే వరకు ఒక మాట ఇవ్వకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను అని రామచంద్ర చెబుతాడు. దీంతో జానకి సరేనని ఒప్పుకుంటుంది. దీంతో రామచంద్ర ఆమెను ఒక్కసారి ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. అంతే కాకుండా జానకి కౌగిలించుకోవడంతో ఆమె సిగ్గు పడిపోతూ ఉంటుంది.

  మల్లిక చిరాకు

  మల్లిక చిరాకు

  ఇక మరోవైపు మల్లిక ఏదైనా పని చేస్తూ కనిపించాలి అని అనుకుంటూ ఉంటుంది. అయితే ఆమెను పనిచేయవద్దు అని ఎక్కడైనా వెళ్లి కూర్చోవాలి అని అత్తగారు ఆదేశాలు జారీ చేస్తారు. దీంతో మల్లిక ఒక దగ్గర కూర్చొని ఉండగా చుట్టాలందరూ కూడా పరామర్శిస్తూ ఉంటారు. దీంతో మల్లికా మరింత చిరాకుతో నేను కూడా ఇంకొన్ని రోజులు అబద్ధం దాచి ఉండి ఉంటే హాయిగా సీమంతం చేసుకునే దాన్ని అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బంధువులందరూ కూడా వస్తూ ఉండడంతో రామచంద్ర ప్రత్యేకంగా వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ సరదాగా మాట్లాడుతుంటాడు.

  జ్ఞానాంబ చేతిలో రిపోర్ట్స్

  ఇక ఈ క్రమంలో పనులు హడావిడిలో ఉన్న రామచంద్ర ఒక్కసారిగా జానకికి తగలడంతో ఆమె కింద పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రామచంద్ర ఆమెను రొమాంటిక్ స్టిల్ తో పట్టుకుంటాడు. ఇక వారిని చూసిన పనిమనిషి సరదాగా కామెంట్ చేస్తూ ఉంటుంది. అనంతరం వెంటనే జానకి అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. జెస్సి కడుపులో బిడ్డకు సంబంధించిన కొన్ని టెస్టులు చేసాము అని 80% నమ్మకం లేదు అని మా ప్రయత్నాల మేము చేస్తామని వైద్యులు చెప్పడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాకుండా రిపోర్ట్స్ ను మీ ఇంటికి నర్సు చేత పంపించాము అని డాక్టర్ చెప్పడంతో జానకి మరింత కంగారుపడుతుంది. అయితే ఆ రిపోర్ట్స్ డైరెక్టుగా వెళ్లి జ్ఞానాంబ చేతిలో పడతాయి. మరి వాటిని నిజంగా ఆమె చూస్తుందా? జానకి ఆ తర్వాత ఎలాంటి సమాధానం ఇస్తుంది అనేది తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 454
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X