For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu December 19th: జానకిని మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్న అఖిల్.. మల్లికకు షాక్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ కథ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుగుతోంది. మల్లిక అబద్ధపు ప్రెగ్నెన్సీతో ఇన్నాళ్లు అందరిని మోసం చేస్తుంటుంది. ఏ పని చేయకుండా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటుంది. కానీ చివరికి ఆ కడుపు విషయం తెలిసే సందర్భం ఎదురవుతుంది అని కడుపే పోయినట్లుగా అబార్షన్ అయినట్లుగా నాటకం ఆడుతుంది. ఇక ఇంట్లో అందరూ నమ్ముతారు. కానీ జనాకికి ముందే ఆ విషయం తెలిసినప్పటికీ కూడా బయటకు చెప్పదు. ఇక మరోవైపు చిన్న కోడలు జెస్సికి సీమంతం చేయాలని అనుకుంటారు. కానీ ఆమె కడుపులో బిడ్డకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక జానకి ఆ విషయాన్ని ఇంట్లో తెలియకుండా చేయాలని అనుకుంటుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 456 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  జెస్సి ఆరోగ్యం విషయంలో..

  జెస్సి ఆరోగ్యం విషయంలో..

  జ్ఞానాంబ చిన్న కోడలు జెస్సి గర్భానికి సంబంధించిన ఆరోగ్య విషయంలో జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది. వైద్యులు కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదల సక్రమంగా లేదు అని కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే ఇంట్లో ఆ విషయాన్ని చెబితే అందరూ కూడా మళ్లీ ఆందోళన చెందుతారు అని జెస్సికి కూడా తెలియకూడదు అని డాక్టర్ తో మాట్లాడుతుంది. కేవలం రామచంద్ర కు మాత్రమే ఆ విషయం తెలుస్తుంది జానకి రామచంద్ర ఇద్దరు కూడా ఆ విషయాన్ని ఇంట్లో తెలియనివ్వకుండా చేయాలని అనుకుంటారు.

  ఏదో ఒక పొరపాటు ఉండే ఉంటుంది

  ఏదో ఒక పొరపాటు ఉండే ఉంటుంది

  అయితే హఠాత్తుగా రిపోర్ట్స్ ఇంటికి వస్తాయి. ఇక ఆ రిపోర్ట్స్ జానకి దాచిపెట్టినప్పటికీ కూడా మల్లిక దొంగతనంగా రిపోర్ట్స్ తీసుకుని అందులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటుంది. అయితే రిపోర్ట్స్ చదవడం ఆమెకు తెలియకపోవడంతో డైరెక్ట్ గా జెస్సికి ఇచ్చి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. తప్పకుండా ఇందులో ఏదో ఒక పొరపాటు ఉండే ఉంటుంది అని అది జానకి ఎవరికీ చెప్పడం లేదు అని ఆమె అనుమానిస్తుంది. అయితే రిపోర్ట్స్ ఎవరి చేతిలో అయినా పడితే ఇంట్లో మళ్ళీ అందరు బాధపడాల్సి వస్తుంది అని జానకి మాత్రం ఎవరూ చూడకూడదు అని కోరుకుంటుంది.

  జానకి జాగ్రత్తలు

  జానకి జాగ్రత్తలు

  ఇక మల్లికను అదే సమయంలో హఠాత్తుగా జ్ఞానాంబ పిలుస్తుంది. ఇక మల్లిక చిరాకుతో రిపోర్ట్స్ ఒక దగ్గర పెట్టి అత్తగారి దగ్గరికి వెళ్తుంది. ఇక జానకి వాటిని చూసి వెంటనే మళ్ళీ తీసేసుకొని గదిలోకి వెళ్లి దాచేసుకుంటుంది. ఇక మల్లిక అత్త గారి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. ఎందుకు పిలిచారు అని అడగడంతో ఆమె నువ్వు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఇప్పటికే నీకు అబార్షన్ అయ్యింది అని కాబట్టి భవిష్యత్తులో నీకు అంత మంచే జరగాలని ఆమె కోరుకుంటుంది.

  మల్లిక టెన్షన్

  మల్లిక టెన్షన్

  ఇక తర్వాత మల్లికా బయటకు వచ్చి చూసేసరికి అక్కడ రిపోర్ట్స్ కనబడవు. ఎక్కడ పెట్టాను అని ఆందోళన చెందుతూ ఉంటుంది. ఇక అప్పుడే వెనకాల నుంచి పనిమనిషి చేయి పెడుతుంది. దీంతో ఎవరు వచ్చారో అని ఆమె ఒక్కసారిగా ఆందోళన చెందుతుంది. కానీ పనిమనిషి కావడంతో ఆ తర్వాత ఆమెను తిట్టేసి కూల్ అవుతుంది. ఇక రిపోర్ట్స్ ఎక్కడ పెట్టానో అని కొంత కన్ఫ్యూజన్ కు గురి అవుతుంది. ఇక గోవిందరాజులు బయట మెట్ల మీద ఉండగా అప్పుడే అతనికి గుండెలో నొప్పి వస్తుంది.

  నాకు ఒకటే టెన్షన్

  నాకు ఒకటే టెన్షన్


  వెంటనే రామచంద్ర తండ్రిని పట్టుకుని ఒక దగ్గర కూర్చోబెడతాడు. టాబ్లెట్ వేసుకోలేదని అనడంతో అవును అని తండ్రి చెబుతాడు. దీంతో వెంటనే ఇంట్లోకి వెళ్లి రామచంద్ర టాబ్లెట్స్ తీసుకుని వస్తాడు. ఆ తర్వాత జ్ఞానాంబ కూడా వచ్చి ఏమైంది అని ఇలా ఎందుకు టాబ్లెట్స్ వేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అని అడుగుతుంది. నాకు ఒకటే టెన్షన్ అని.. రామచంద్ర అలాగే రెండవ కొడుకు విష్ణు ఇద్దరు కూడా వ్యాపారాలు చేసుకునే ఉంటున్నారు. కానీ మూడవ కొడుకు అఖిల్ మాత్రం ఇంకా ఏ జాబ్ చేయడం లేదు. భారం మొత్తం కూడా రామచంద్ర పైన పడుతుంది అని గోవిందరాజులు అంటాడు.

  తప్పుగా అర్థం చేసుకున్న అఖిల్

  తప్పుగా అర్థం చేసుకున్న అఖిల్


  అయితే ఆ తర్వాత మళ్ళీ గోవిందరాజులు నిద్రలో కూడా అఖిల్ భవిష్యత్తులో నిలదొక్కుకోవాలి అని కలవరిస్తూ ఉంటాడు. ఇక రామచంద్ర జానికి ఇద్దరు ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అఖిల్ ఏదైనా మంచి జాబ్ చూసుకుంటే బెటర్ అని తన కాళ్ళ మీద తను నిలబడితే బెటర్ అని జానకి తన భర్తతో చెబుతుంది. అయితే అప్పుడే అఖిల్ వచ్చి పరిస్థితి అర్థం చేసుకోకుండా నా మీద నీకు ఎందుకు అంత కక్ష వదినా. జాబ్ చేసుకోవాలని నాకు ఉండదా? కానీ ప్రస్తుతం ఏ జాబ్ దొరకడం లేదు అని అతను వసంతృప్తితో ఆమెపై అసహనం వ్యక్తం చేస్తూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

  అఖిల్ అసహనం

  అఖిల్ అసహనం

  ఇక అఖిల్ తప్పుగా అర్థం చేసుకోవడంతో జానకి కాస్త బాధపడుతుంది. ఇక తర్వాత అఖిల్ కూడా ఏదో ఒక జాబ్ చేయాలి అని లేకపోతే వదినా తనపై ఇలానే ఏదో ఒకటి చెబుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక జెస్సి తన దగ్గర టాబ్లెట్స్ లేకపోవడంతో జానకికి చెప్పాలి అని అనుకుంటుంది. కానీ అఖిల్ మాత్రం నేను టాబ్లెట్స్ తీసుకు వస్తాను అని అంటాడు. అంతేకాకుండా జాబ్ సెర్చింగ్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తాను అని అంటాడు. ఇక రామచంద్ర తన చిన్ననాటి స్నేహితుడు ఒకడు కలిసి అఖిల్ కు జాబ్ ఇప్పిస్తాను అన్నాడు అని తన కార్డు కూడా ఇచ్చాడు అని దాన్ని మీరే అఖిల్ కు ఇవ్వాలి అని జనాకికి చెబుతాడు. కానీ జానకి మాత్రం ఇవ్వలేను అని అంటుంది. మరి రామచంద్ర ఈ విషయంలో ఏ విధంగా సమాధానం చెబుతాడో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial December 19th Episode 455
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X