Don't Miss!
- Lifestyle
పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే.. రాత్రయినా, పగలైనా 'పడక' పని సాఫీగా సాగుతుంది
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Janaki Kalaganaledu December 28th: రామ అప్పు గురించి తెలియడంతో అందరూ షాక్.. మల్లిక గొడవలు!
జానకి కలగనలేదు సీరియల్ కథలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్ఞానాంబ చిన్న కుమారుడు అఖిల్ ఏ పని లేకుండా ఖాళీగా ఉంటాడు. దీంతో అతను సెటిల్ అయితే బాగుంటుంది అని ఇంట్లో వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇక జానకి, రామ కూడా అదే ఆలోచిస్తారు.
అయితే అఖిల్ మాత్రం జానకి పై కోపం తెచ్చుకుంటాడు. జానకి ఆ విషయంలో గొడవలు రాకుండా చేయాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 463 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

పంతులు సలహా ఇవ్వడంతో..
గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరు కలిసి గుడికి వెళ్లి కుటుంబం గురించి పూజ చేయించాలని అనుకుంటారు. అయితే ఈ క్రమంలో వారు కొబ్బరికాయ కొడుతూ ఉండగా అది పాడైపోయి ఉంటుంది. దీంతో ఏదైనా అరిష్టం జరగబోతుందేమో అని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు.
ఇక వెంటనే వెళ్లి పంతులు గారిని అడగగా ఆయన ఒక సలహా ఇస్తారు. పూజ చేసినటువంటి ఒక కలశం మీ ఇంట్లో పెట్టుకోవాలి అని ఏమైనా అనర్ధాలు ఉంటే తొలగిపోతాయి అని పంతులుగారు చెప్పడంతో జ్ఞానాంబ గోవిందరాజులు ఇద్దరు కూడా కలశాన్ని ఎంతో జాగ్రత్తగా ఇంటికి తీసుకువస్తారు.

జాగ్రత్తగా ఉండాలి
ఇక హాల్లోనే లక్ష్మీదేవి విగ్రహం ముందు ఆ కలశాన్ని పెడతారు. ఇంట్లో ఏవైనా అనర్థాలు జరుగుతాయోమో అని ఆందోళనగా ఉంది అని గుడిలో కొబ్బరికాయ కొట్టబోతుంటే అది కుళ్ళిపోయింది అని జ్ఞానాంబ కూడా చెబుతుంది. ఇక జ్ఞానాంబ అలా మాట్లాడడంతో జానకి కూడా కొంత టెన్షన్ పడుతుంది.
ఇక ఇంట్లో అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అత్తగారు చెబుతారు. ఇక జానకి కూడా మల్లికకు జెస్సికి ఇద్దరికీ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతుంది. ఇక మల్లికా జానకి మాటలు పట్టించుకోకుండా బయట తనకు పని ఉంది అని వెళ్ళిపోతుంది.

రామ ఇంటికి భాస్కరరావు
బయటకు వెళ్లి మల్లిక ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు అలా మాట్లాడారు అంటే ఏదో అపశకునం చోటు చేసుకునే అవకాశం ఉంది అని అది ఏమై ఉంటుందో ఆలోచించాలి అని మల్లిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే రామచంద్ర కు డబ్బులు ఇచ్చిన భాస్కర రావు అనే వ్యక్తి ఇంటికి వస్తాడు.
ఇక అతను స్వీట్స్ ఆర్డర్ చేయడానికి వచ్చాడేమో అనుకొని మల్లికా మాట్లాడుతూ ఉంటుంది. తాను స్వీట్స్ ఆర్డర్ ఇవ్వడానికి రాలేదు అని సంతకాలు పెట్టించుకోవడానికి వచ్చాను అని భాస్కర రావు అంటాడు.

20 లక్షల అప్పు తీసుకున్నాడు
ఈ సంతకాలు దేనికి అని మల్లిక కడగడంతో రామచంద్ర అప్పుగా తీసుకున్న డబ్బు కోసం సంతకాలు పెట్టాల్సి ఉంది అని చెబుతాడు. అంతేకాకుండా ఇంటి పత్రాలు తాకట్టుపెట్టి రామచంద్ర 20 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు అని చెప్పడంతో మల్లిక ఒక్కసారిగా షాక్ అవుతుంది.
మొదట ఏదో తక్కువ డబ్బు అనుకున్న మల్లిక.. ఆ తరువాత 20 లక్షల అప్పు తీసుకున్నాడు అని తెలియగానే ఆమె షాక్ అవుతుంది. ఇక అతను రామచంద్ర ఇంట్లో లేడు కాబట్టి తర్వాత వస్తాను అని అక్కడినుంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు.

గొడవలు సృష్టించేందుకు మల్లిక ప్లాన్
మా బావగారు లేకపోతే ఏంటి ఇంట్లో చాలామంది ఉన్నారు అని వారితో సంతకాలు పెట్టిస్తాను పదండి అంటూ అతని ఇంట్లోకి తీసుకు వెళుతుంది. ఎలాగైనా ఆ విషయంతో మల్లిక ఇంట్లో గొడవలు సృష్టించాలని అలాగే తన భర్తతో బయటకు వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత మల్లికా అందరిని హాల్లోకి రమ్మని పిలుస్తుంది. ఇక అత్తగారు కూడా రావడంతో అప్పు ఇచ్చిన వ్యక్తి తో మాట్లాడిస్తుంది. అసలు సంగతి చెప్పాలి అని అంటుంది.
నిజం చెప్పిన భాస్కర రావు
దీంతో మెల్లగా అప్పులు ఇచ్చిన భాస్కర రావు రామచంద్ర కు గురించి చెబుతాడు. రెండు రోజుల క్రితం రామచంద్ర తన దగ్గరకు వచ్చాడు అని అర్జెంటుగా డబ్బు కావాలి అని 20 లక్షలు తీసుకువెళ్లాడని అతను చెప్పడంతో గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరు కూడా షాక్ అవుతారు. అవసరం లేనిదే రామచంద్ర ఆ స్థాయిలో అప్పు తీసుకోడు ఇంత డబ్బు ఎలా తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు.

నిజం ఒప్పుకున్న రామ
అయితే అంత డబ్బు మీరు ఎలా ఇచ్చారు అని అడగగానే మీ ఇంటి పత్రాలను తాకట్టు పెట్టారు అని అప్పు ఇచ్చిన భాస్కర రావు చెబుతాడు. దీంతో అందరూ మరింత షాక్ అవుతారు. పక్కనే అప్పుడు జానకి ఉంటుంది. ఆమె కూడా ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది.
ఇక ఆ విషయాలు మాట్లాడుతున్న తరుణంలోనే రామచంద్ర బయట నుంచి ఇంటికి వస్తాడు మరొకసారి రామచంద్ర తో గోవిందరాజులు మాట్లాడుతాడు. నిజంగానే నువ్వు ఆయన దగ్గర నుంచి 20 లక్షలు అప్పు తీసుకున్నావా అని అడుగుతారు. అందుకు రామచంద్ర అది నిజమేనని అంటాడు. ఇక రామచంద్ర ఆ విధంగా అప్పు తీసుకోవడంతో మల్లిక గొడవలు సృష్టించాలని అనుకుంటుంది. మరి ఈ విషయంలో జానకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.