Don't Miss!
- News
Basara: బాసర సరస్వతి క్షేత్రానికి భారీగా తరలొచ్చిన భక్తులు
- Finance
Budget 2023: దేశంలోని పెద్ద రైతులపై పన్ను వేయాల్సిన సమయం వచ్చేసిందా..? ఎందుకిలా..
- Sports
Team India : ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ కెరీర్ ముగిసినట్లేనా?
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Lifestyle
ఇంట్లో నైరుతి మూల వాస్తు చిట్కాలు, దోష నివారణలు
- Automobiles
హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Janaki Kalaganaledu December 29th: రామ అప్పుతో గొడవలు.. డేంజర్ లో పడిన జ్ఞానాంబ ఫ్యామిలీ!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు కీలక మలుపులతో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. రామ చిన్న తమ్ముడు అఖిల్ ఏ పని లేకుండా ఖాళీగా ఉంటాడు. అయితే అతను సెటిల్ అయితే బాగుంటుంది అని ఇంట్లో వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇక జానకి, రామ కూడా అదే ఆలోచిస్తారు.
అయితే అఖిల్ మాత్రం జానకి పై కోపం తెచ్చుకుంటాడు. జానకి ఆ విషయంలో గొడవలు రాకుండా చేయాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 464 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

పెట్టుబడి కోసం 20 లక్షలు
రామచంద్ర తన తమ్ముడు అఖిల్ కు ఎలాగైనా మంచి జాబ్ రావాలి అని తన చిన్ననాటి స్నేహితుడైన చరణ్ తో మాట్లాడుతాడు. అతను కొత్తగా కంపెనీ పెట్టబోతున్నట్లు చెప్పి పెట్టుబడి కింద 20 లక్షలు అవసరమవుతాయని అంటాడు. దీంతో రామచంద్ర ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి 20 లక్షల తీసుకువస్తాడు.
అయితే అప్పు ఇచ్చిన భాస్కరరావు రామచంద్ర దగ్గర సంతకాలు తీసుకోవాలి అని ఇంటికి వస్తాడు. ఇక అతని గురించి ముందే తెలుసుకున్న మల్లిగా అసలు విషయం ఇంట్లో చెప్పి గొడవలు సృష్టించాలని అనుకుంటుంది. ఇక భాస్కరరావు ఇంటికి రాగానే అసలు గొడవ స్టార్ట్ అవుతుంది.

రామ అప్పు.. తెలిసిన నిజం
రామచంద్ర రెండు రోజుల క్రితం అర్జెంటుగా 20 లక్షల అప్పు కావాలి అని నా దగ్గరికి వచ్చాడు అని భాస్కరరావు చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అయితే రామచంద్ర తనని అడగకుండా ఇలాంటి పనులు చేయడు. అసలు 20 లక్షలు ఎందుకు అవసరం వచ్చాయని తల్లి జ్ఞానాంబ కూడా ఆలోచిస్తూ ఉంటుంది.
అయితే అదే అవకాశం గా భావించిన మల్లికా ఈ విషయాన్ని వదిలేది లేదు అని గట్టిగా నిలదీయాలి అని మాట్లాడుతుంది. తాను ఒకప్పుడు 500 రూపాయలు ఖర్చు పెడితేనే అనవసరమైన ఖర్చులు వద్దని వాదించేవారు. ఇప్పుడు 20 లక్షలు అప్పు ఎందుకు తీసుకున్నారో తెలియాలి అని మల్లికా చెబుతుంది.

రామచంద్ర ఎందుకిలా చేశాడు
అంత డబ్బు మీరు ఎలా ఇచ్చారు అని గోవిందరాజులు భాస్కరరావును అడగగానే రామచంద్ర ఇంటి పత్రాలు తాకట్టు పెట్టినట్లుగా కూడా చెబుతారు. ఆ విషయంతో ఇంట్లో వాళ్ళు అందరు కూడా మరింత ఆశ్చర్యపోతారు. ఇంత పెద్ద విషయాన్ని రామచంద్ర ఎందుకు దాచాడు అని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు.
అంతేకాకుండా పక్కనే ఉన్న జానకిని కూడా అడుగుతారు. అసలు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని జానకి నీకు ఈ విషయం తెలుసా అని జ్ఞానాంబ అడిగినప్పుడు ఆమె తెలుసుకొని చెప్పడంతో మరింత షాక్ అవుతారు

జానకి ఘాటైన మాటలు
రామచంద్ర రాగానే అసలు విషయం అడగాలని అనుకుంటారు. అయితే ఎంత అడిగినా కూడా మొదట రామచంద్ర ఆ విషయాన్ని చెప్పకపోవడంతో మల్లిక ఊహించని అనుమానాలను క్రియేట్ చేస్తుంది. రామచంద్ర మీద తప్పుగా మాట్లాడడంతో చిన్నప్పటినుంచి కుటుంబం కోసం ఎంతగానో కష్టపడిన రామచంద్ర ఇప్పుడు తన స్వార్థం కోసం ఆలోచించడు అని ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు.
అంతేకాకుండా గోవిందరాజులు జ్ఞానాంబ కూడా చెబుతారు. కానీ మల్లిక మాత్రం అది పెళ్లికి ముందు అంటే పెళ్లి తర్వాత జానకి వచ్చింది కదా ఆమె సలహాతో ఎక్కడైనా ఫ్లాట్ కొన్నారేమో అని మల్లికా మరింత గాటుగా మాట్లాడుతుంది.

రామపై అనుమానాలు
అయితే అఖిల్ కూడా అదే తరహాలో మాట్లాడుతూ ఉంటాడు. తనకు డబ్బులు కావాలి అని 2000 అడుగుతేనే ఎన్నో ప్రశ్నలు వేసేవారు. అలాంటిది ఇప్పుడు 20 లక్షలు అప్పు చేశారు అంటే అనుమానించకుండా ఉండలేకపోతున్నాము అని అంటాడు. అంతే కాకుండా విష్ణు కూడా అదే తరహాలో మాట్లాడడంతో రామచంద్ర ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అని అనుకుంటాడు.
ఎందుకంటే తన కారణంగా జాబ్ వచ్చింది అని తెలిస్తే మళ్లీ అతను జాబ్ చేయడు అని అనుకుంటాడు.
బయటపడిన చరణ్ మోసం
కానీ అఖిల్ మాత్రం తన మాటలతో మరింత బాధ పెడుతూ ఉంటాడు. దీంతో రామచంద్ర ఓర్చుకోలేక అసలు విషయాన్ని చెబుతాడు. అఖిల్ కోసమే పెట్టుబడి కింద 20 లక్షలు తీసుకున్నాను అని అంటాడు. దీంతో ఇంట్లో అందరూ మరింతగా షాక్ అవుతారు. ఆ విషయంలో రామచంద్ర అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు ఇక ఇంతలోనే రామచంద్ర స్నేహితుడు చరణ్ ఊర్లో నుంచి పారిపోయాడు అని తెలుస్తుంది.
అతను ఆఫీస్ పెట్టడం లేదు అని తెలియడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక ఆ షాక్ లో గోవిందరాజులు గుండె పట్టుకొని ఒక్కసారిగా కింద పడిపోతాడు. అతని ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సమస్య నుంచి కుటుంబాన్ని జానకి ఎలా బయటపడేస్తుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.