For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu December 5th: భర్తను సరసంతో రెచ్చగొడుతున్న జానకి.. అల్లరితో టెంప్ట్ చేస్తూ..

  |

  జానకి కలగనలేదు సీరియల్ లో మంచి ఎమోషనల్ సీన్స్ తో పాటు ఊహించని ట్విస్ట్ లు కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే రామ, తమ్ముడు అఖిల్ తన ఫ్రెండ్ మాధురిపై హత్య ప్రయత్నం చేసి తప్పించుకోవాలని అనుకుంటాడు. అయితే ఆ ఘటనను చూసిన జానకి అతడి పై కేసు కూడా పెడుతుంది. కానీ జానకి మాటలను ఎవరు నమ్మరు. ఇక జానకి తన భర్త ఒత్తిడి కారణంగా అలాగే కుటుంబం సంతోషం కారణంగా అఖిల్ మీద కేసును వెనక్కి తీసుకోవడం వలన తన ఐపిఎస్ చదువుకు న్యాయం చేయలేనెమో అని అనుకుంటుంది. ఆ చదువులు ఇంతటితో వదిలేయాలని కూడా అనుకుంటుంది.

  కానీ రామచంద్ర మాత్రం అలా జరగకూడదు అని అనుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 446 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  బానమ్మ ఇంటికి రామ, జానకి

  బానమ్మ ఇంటికి రామ, జానకి

  జానకి చదువు విషయంలో నిర్ణయం తీసుకోకపోవడంతో రామచంద్ర కాస్త కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఆమె మనసు మళ్ళి చదువుపై వెళ్లే విధంగా చేయాలని కూడా అనుకుంటాడు. అయితే ఇంతలో రామచంద్ర జ్ఞానాంబ చిన్ననాటి స్నేహితురాలు బానమ్మ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. చిన్నప్పుడు రామచంద్ర ఆమె దగ్గర ఎక్కువగా ఉండేవాడు.

  అయితే ఇప్పుడు ఒకసారి ఆమెను వెళ్లి చూసి రావాలి అని జ్ఞానాంబ చెప్పడంతో రామచంద్రం తన భార్యతో కలిసి అక్కడికి బయలుదేరుతాడు. ఇక మార్గం మధ్యలో జానకి ఆ గ్రామంలోని ప్రకృతిని ఎంతగానో ఆస్వాదిస్తూ తన భర్తతో చాలా అల్లరిగా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గొడవలన్నిటినీ కూడా మర్చిపోయిన జానకి తన భర్తతో ఎంతో సంతోషంగా ఉంటుంది. మధ్య మధ్యలో రామచంద్రను సరదాగా ఆమె ఆట పట్టిస్తూ ఉంటుంది.

  చాలా హ్యాపీగా రామ, జానకి

  చాలా హ్యాపీగా రామ, జానకి

  ఇక బానమ్మ ఇంటికి రాగానే రామచంద్ర ఎంతగానో సంతోషిస్తాడు. అంతేకాకుండా బానమ్మ కూడా చాలా కాలం తర్వాత రామచంద్రని చూడడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు ఇద్దరు ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది అని మీకోసం ప్రత్యేకంగా భోజనం కూడా రెడీ చేస్తాను అని అంటుంది. అయితే తాము తొందరగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నట్లు రామచంద్ర చెప్పడంతో బానమ్మ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. చాలా కాలం తర్వాత నా దగ్గరికి వచ్చారు. అప్పుడే వెళ్ళిపోతాను అనడం కరెక్ట్ కాదు అని తప్పకుండా ఈరోజు ఇక్కడ ఉండాల్సిందే అని ఆమె చెబుతుంది.

  ప్రత్యేకంగా పట్టుబట్టలు

  ప్రత్యేకంగా పట్టుబట్టలు

  అయితే మేము బట్టలు కూడా తెచ్చుకోలేదని భానుమకు రామచంద్ర చెబుతాడు. ఇక బానమ్మ లోపలికి వెళ్లి తన గదిలో నుంచి రామచంద్ర కోసం అలాగే జానకి కోసం ప్రత్యేకంగా పట్టుబట్టలు తీసుకుని వస్తుంది. నా పెళ్లయిన కొత్తలో మా ఆయన తెచ్చిన కొత్త చీర ఇది అని జానకికి ఇస్తుంది. అంతేకాకుండా రామచంద్రకు మీ పెదనాన్న బట్టలు వేసుకో అని చెబుతోంది. రామచంద్ర జానకి ఇద్దరు కూడా ట్రెడిషనల్ లుక్ లో చాలా అందంగా రెడీ అవుతారు. ఆ తర్వాత వారిద్దరిని చూసిన బానమ్మ ఎంతగానో సంతోషిస్తుంది.

   ఇష్టమైన పుట్టగొడుగులు

  ఇష్టమైన పుట్టగొడుగులు

  అయితే మీరు ఇద్దరు కూడా వెళ్లి విశ్రాంతి తీసుకోండి అని నేను భోజనాలు రెడీ చేస్తాను అని బానమ్మ అంటుంది. అయితే నేను కూడా మీకు సహాయం చేస్తాను అత్తయ్య గారు అంటూ జానకి చెప్పడంతో నువ్వు ఇక్కడ వంటలు చేయలేవు అని ఆమె చెబుతుంది. రామచంద్ర కోసం ఇష్టమైన పుట్టగొడుగులు కూరను పొయ్యి మీద చేయాలి అని చెప్పడంతో జానకి నేను నేర్చుకుని మరి చేస్తాను అని అంటుంది. ఇక బానమ్మ పూర్తిగా వివరణ ఇవ్వడంతో జానకి ప్రత్యేకంగా దాన్ని రెడీ చేస్తూ ఉంటుంది.

  భోజనం చేస్తూ..

  భోజనం చేస్తూ..

  అయితే పక్కనే కూర్చున్న రామచంద్ర జానకిని రొమాంటిక్ గా చూస్తూ ఉంటాడు. ఇక తర్వాత భోజనం సిద్ధం చేసిన తర్వాత అందరూ కలిసి తినాలని అనుకుంటారు. ఒక చెట్టు కింద కూర్చుని ఉండడంతో మొదట బానమ్మ రామచంద్ర కు తన చేతితో అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇలా నీకు తినిపించి చాలా రోజులు అయింది అని ఎమోషనల్ అవుతుంది. అయితే జానకి రామచంద్ర ఇద్దరు కూడా బానమ్మ ఆప్యాయంగా అన్నం తినిపిస్తూ ఉంటారు. ఇక భోజనాలు చేసిన తర్వాత జానకి రామచంద్ర అలా బయటికి వెళ్తారు.

  నడుమును గిల్లేందుకు

  నడుమును గిల్లేందుకు

  ఇక రామచంద్రను జానకి సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక రామచంద్ర కూడా ప్రేమతో జానకి నడుమును గిల్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నన్ను రెచ్చగొట్టొద్దు అని చెప్పినప్పటికీ కూడా జానకి అలానే చేయడంతో రామచంద్ర ఆమెను పట్టుకొని ఒక్కసారిగా కౌగిలించుకుంటాడు. ఇక తర్వాత ఈరోజు చా సంతోషంగా ఉన్నాను అని.. ఎందుకంటే మా ఈరోజు మా అమ్మ నాన్న పెళ్లి రోజు అని చెప్పడంతో రామచంద్ర కూడా కొంత ఆలోచనలో పడతాడు. అయితే నేను బాధపడడం వాళ్లకు ఇష్టం ఉండదు అని జానకి చెబుతుంది. ఇక రామచంద్ర వాళ్లకు ఎంతో ఇష్టమైన ఐపిఎస్ చదవును ఎందుకు వదిలేయాలని అనుకుంటున్నారు అని, మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ప్రశ్నిస్తాడు. మరి ఈ విషయంలో జానకి, రామచంద్రకు ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 446
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X